EPAPER

Karnataka Ex Minister Nagendra: కర్ణాటక మాజీ మంత్రి అరెస్ట్.. మనీ లాండరింగ్ కేసు ఆరోపణలపై ఈడీ విచారణ

కర్ణాటక మాజీ మంత్రి, కాంగ్రెస్ నాయకుడు బి. నాగేంద్రని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) శుక్రవారం అరెస్టు చేసింది. కర్ణాటక మహర్షి వాల్మీకి షెడ్యూడ్ ట్రైబ్స్ డెవెలప్‌మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్(కర్ణాటక ఆదివాసి అభివృద్ధి శాఖ)నిధుల దుర్వినియోగం చేశారనే ఆరోపణలు ఉండడంతో ఈడీ అధికారులు ఆయనను అదుపులోకి తీసుకున్నారు.

Karnataka Ex Minister Nagendra: కర్ణాటక మాజీ మంత్రి అరెస్ట్.. మనీ లాండరింగ్ కేసు ఆరోపణలపై ఈడీ విచారణ

Karnataka Ex Minister Nagendra news(Telugu flash news): కర్ణాటక మాజీ మంత్రి, కాంగ్రెస్ నాయకుడు బి. నాగేంద్రని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) శుక్రవారం అరెస్టు చేసింది. కర్ణాటక మహర్షి వాల్మీకి షెడ్యూడ్ ట్రైబ్స్ డెవెలప్‌మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్(కర్ణాటక ఆదివాసి అభివృద్ధి శాఖ)నిధుల దుర్వినియోగం చేశారనే ఆరోపణలు ఉండడంతో ఈడీ అధికారులు ఆయనను అదుపులోకి తీసుకున్నారు.


కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక.. నాగేంద్ర ఆదివాసీ అభివృద్ధి శాఖ మంత్రి పదవి పొందారు. అయితే ఆ శాఖలో భారీ మొత్తంలో నిధులు కాజేస్తున్నారని.. ఓ ప్రభుత్వ ఉద్యోగి చంద్ర శేఖరన్.. మే 26, 2024న ఆత్మహత్య చేసుకుంటూ లేఖలో రాసి చనిపోయాడు. చనిపోయిన చంద్ర శేఖరన్ .. అదే శాఖలో అకౌంటెంట్ పనిచేస్తుండగా.. నిధుల దుర్వినియోగంలో సహకరించమని అతడిని సీనియర్ అధికారులు, రాజకీయ నాయకులు ఒత్తిడి చేసినట్లు చనిపోయేముందు లేఖలో రాశాడు.

Also Read: ‘ముస్లిం మహిళలకు విడాకుల భరణం’.. సుప్రీం కోర్టు తీర్పును వ్యతిరేస్తూ పిటీషన్!


కార్పొరేషన్‌కు చెందిన మొత్తం రూ.187 కోట్లు.. అనుమతిలేకుండా దారిమళ్లించారని.. అందులో రూ.88.62 కోట్లు ప్రముఖ ఐటి కంపెనీలు, హైదరాబాద్‌కు చెందిన కో-ఆపరేటివ్ బ్యాంక్ అకౌంట్లకు బదిలీ చేశారని సూసైడ్ నోట్‌లో చంద్రశేఖరన్ పేర్కొన్నాడు. ఈ కుంభకోణంలో కార్పొరేష్ మేనేజింగ్ డైరెక్టర్ పద్మనాభ్, అకౌంట్స్ ఆఫీసర్లు పరశురాం, దురుగన్నవర్, యూనిబ్యాంక్ ఆఫ్ ఇండియా మెనేజర్ సుచి స్మిత రావల్ దోషలని.. వీరందరూ మంత్రి నాగేంద్ర ఆదేశాల మేరకే పని చేశారని రాశాడు.

ప్రభుత్వోద్యోగి ఆత్మహత్య… లేఖలో తీవ్ర ఆరోపణలు ఉండడంతో కర్ణాటక ప్రభుత్వం చర్యలు తీసుకునేందుకు నాగేంద్రను మంత్రి పదవిని తప్పించింది. జూన్ 6, 2024న నాగేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేశారు. ఈ కేసులో గత రెండు రోజులుగా ఈడీ అధికారులు నాగేంద్ర ఇల్లు, ఆఫీసు, ఇతర భవనాల్లో సోదాలు చేశారు. నాగేంద్రకు సన్నిహితంగా ఉండే కాంగ్రెస్ ఎమ్మెల్యే, అదివాసీ అభివృద్ధి కార్పొరేషన్ చైర్మెన్ బాసనగౌడ దడ్డల్ ఇంట్లో కూడా సోదాలు చేశారు.

Also Read: స్కూల్ పిల్లల భోజనంలో బల్లి!.. 30 విద్యార్థులకు అనారోగ్యం.. కేంద్రం సీరియస్

ఈడీ అధికారులు నాలుగు రాష్ట్రాలు కర్ణాటక, ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ, మహారాష్ట్రలో మొత్తం 20 చోట్ల సోదాలు చేశారు.

 

Related News

Deadbody In Suitcase: సూట్‌కేసులో యువతి డెడ్ బాడీ, ముక్కలుగా నరికి.. దారుణ హత్య

Chennai’s IT Corridor: ఐటీ కారిడార్, సూట్ కేసులో మహిళ మృతదేహం.. ఏం జరిగింది?

Cambodia Cyber Slaves Agent: విదేశాల్లో బానిసలుగా భారతీయులు.. ఉద్యోగాల పేరుతో మోసం.. యువతి అరెస్ట్

Woman Cop Kidnap: మహిళా పోలీస్ కిడ్నాప్.. 112 డయల్ చేసి ఎలా తప్పించుకుందంటే?.

Fatal Extramarital Affair: భర్త పనికి వెళ్లగానే ఇంట్లో ప్రియుడితో రొమాన్స్ షురూ.. ఆ తరువాత ఎంత హింస జరిగిందంటే..

Head Master Harassment: హెచ్‌ఎం కామాంధుడు.. సబ్బు, షాంపూలతో ఎర, విద్యార్థిణులపై వేధింపులు..

Lover Knife Attack: పెళ్లికి నిరాకరణ.. ప్రియురాలిపై ప్రియుడు కత్తితో.. ఆపై ఇద్దరూ

Big Stories

×