EPAPER

Kargil Vijay Diwas 2024: పాక్ పాలిట యమకింకరులు.. కార్గిల్ యుద్ధ వీరులు.. యుద్ధంలో ఏం జరిగిందంటే..

Kargil Vijay Diwas 2024: పాక్ పాలిట యమకింకరులు.. కార్గిల్ యుద్ధ వీరులు.. యుద్ధంలో ఏం జరిగిందంటే..

Kargil Vijay Diwas 2024(National news today India): కార్గిల్ యుద్ధ వీరుల స్మారకోత్సవంగా ప్రతీ సంవత్సరం జూలై 26న కార్గిల్ విజయ్ దివస్ వేడుకలు జరుగుతాయి. 1999లో కార్గిల్ యుద్ధంలో ప్రాణాలర్పించిన వీరులను ఈ సందర్భంగా గుర్తుచేసుకుంటారు. మే 1999న మొదలైన కార్గిల్ యుద్ధం, జూలై 26 1999న ముగిసింది. భారత భూభాగాన్ని ఆక్రమించుకున్న పాకిస్తాన్ సైన్యాన్ని, ఉగ్రవాదులను ఈ యుద్ధంలో విజయవంతంగా భారత సైన్యం తరిమికొట్టింది.


కార్గిల్ విజయ్ దివస్ చరిత్ర
భారత్, పాకిస్తాన్ దేశాల మధ్య 1971లో ఓ పెద్ద యుద్దం జరిగింది. బంగ్లాదేశ్ లో నుంచి పాకిస్తాన్ సైన్యాన్ని తరిమి కొట్టేందుకు భారతదేశం సహాయం చేసింది. ఈ యుద్ధం తరువాత బంగ్లాదేశ్ ప్రత్యేక దేశంగా ఏర్పడింది. ఈ యుద్ధం ముగిసినా సియాచిన్ హిమ పర్వతాలు ఇరువైపుల పాకిస్తాన్, భారత్ సైన్యాలు తమ స్థావరాలు ఏర్పాటు చేసుకున్నాయి. 1998లో రెండు దేశాలు న్యూక్లియర్ పరీక్షలు చేయడంతో ఇరు దేశాల మధ్య శత్రుత్వం తారాస్థాయికి చేరింది. ఆ తరువాత శత్రుత్వాన్ని తగ్గించడానికి 1999 ఫిబ్రవరిలో రెండు దేశాల ప్రభుత్వాలు లాహోర్ డిక్లరేషన్ ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయి. ఈ ఒప్పందం ప్రకారం.. శాంతియుతంగా కాశ్మీర్ సమస్యకు పరిష్కారం చేసేందుకు అంగీకరించాయి.

అయితే పైకి ఒప్పందం కుదుర్చుకున్నా.. పాకిస్తాన్ ఆర్మీ దొంగబుద్ధి చూపింది. 1999 సంవత్సరం చలికాలంలో రహస్యంగా కార్గిల్ లోని ద్రాస్, బతలిక్ ప్రాంతాలలో సైనికులను పంపింది. తీవ్ర చలికాలంతో మంచు కురుస్తుండడంతో ఇరు దేశాల సైన్యాలు సామాన్యంగా అక్కడి నుంచి కొంచెం విరమిస్తాయి. ఇదే అదునుగా భావించి పాక్ సైనికులు భారత సైనిక స్థావరాలను ఆక్రమించుకున్నారు. భారత సైన్యం ఈ విషయం తెలుసుకునే వరకు ఆలస్యమైంది. తొలుత అక్కడ ఉన్నది ఉగ్రవాదులని భావించిన భారత సైన్యం.. వారిని ఎదుర్కొనేందుకు కొంతమంది సైనికులను పంపింది. కానీ అక్కడ ఉన్నది ఉగ్రవాదులు కాదు.. ఏకంగా పాకిస్తాన్ మిలిటరీనే అని తెలియడంతో రెండు దేశాల మధ్య యుద్ధం మొదలైంది. ఈ యుద్ధం కోసం కార్గిల్ లో దాదాపు రెండు లక్ష్లల భారత సైనికులు రంగంలోకి దిగారు.


కార్గిల్ విజయ్ దివస్ ప్రాముఖ్యం
1999 కార్గిల్ యుధ్దంలో ప్రాణాలు త్యాగం చేసిన ఇండియన్ ఆర్మీ సైనికుల గౌరవార్థం కార్గిల్ దివస్ జరుపుకుంటారు. జమ్మూ కాశ్మీర్, లదాఖ్ ప్రాంతాల్లో జరిగిన ఈ యుద్ధంలో 527 మంది భారత సైనికులు చనిపోయారు. పాకిస్తాన్ ఆర్మీ దొంగచాటుగా వచ్చి ఆక్రమించుకున్న భారత కొండ భూభాగాన్ని భారత సైన్యం విజయవంతంగా తిరిగి తన ఆధీనంలోకి తీసుకుంది. యుద్ధంలో తీవ్ర నష్టం తరువాత పాకిస్తాన్ సైనికులు వెనుదిరగడంతో ఈ యుద్ధంలో భారత్ విజయం సాధించింది.

కార్గిల్ యుద్ధంలో అమరులైన వీరులు..
దేశం పట్ల అంకిత భావం, ప్రేమతో ప్రాణత్యాగం చేసిన సైనికుల కోసం జూలై 26ని భారత ప్రభుత్వం అంకితం చేస్తూ.. కార్గిల్ విజయ్ దివస్ జరుపుకుంటుంది. మాతృభూమి కోసం ధైర్యంగా పోరాడిన వారికి అందరూ వందనం చేస్తారు.

కెప్టెన్ విక్రమ్ బత్రా (13 జమ్మూ కశ్మీర రైఫిల్స్)
కార్గిల్ యుద్ధంలో అత్యంత ప్రముఖుడు కెప్టెన్ విక్రమ్ బత్రా. యుద్ధంలో ఆయన శరీరంలో బుల్లెట్లు దిగినా.. కొండపైన ఉన్న పాయింట్ 4875 స్థావరాన్ని తిరిగి భారత ఆధీనంలోకి తీసుకురావాలని ఆయన కదనరంగంలో ధైర్యంగా ముందుకు సాగారు. ‘యె దిల్ మాంగె మోర్’ నినాదంతో ఆయన తీవ్ర రక్తస్రావమైనా పాకిస్తాన్ సైన్యంపై విరుచుకుపడి ఆయన మిషన్ లో విజయం సాధించారు. కెప్టెన్ విక్రమ్ బత్రా మరణానంతరం ఆయనకు పరమ్ వీర్ చక్ర అవార్డు ప్రదానం చేశారు.

Also Read:  యూట్యూబర్ ధృవ్ రాఠీకి ఢిల్లీ కోర్టు సమన్లు.. పరువు నష్టం దావా వేసిన బిజేపీ నాయకుడు

లెఫ్టెనెంట్ మనోజ్ కుమార్ పాండే (1/11 గోర్ఖా రైఫిల్స్)
ఈ యుద్ధంలో ప్రాణత్యాగం చేసీ తన మాతృదేశానికి విజయం సాధించి పెట్టిన వీరపుత్రలలో లెఫ్టెనెంట్ మనోజ్ కుమార్ పాండే పేరు చెప్పుకోవడం చాలా ముఖ్యం. యుద్ధంలో కీలకమైన ప్రాంతాలను తిరిగి సాధించడంలో ఆయన ముఖ్య పాత్ర పోసించారు. లెఫ్టెనెంట్ మనోజ్ కుమార్ పాండే మరణానంతరం ఆయన కుటుంబానికి పరమ్ వీర్ చక్ర అవార్డు ప్రదానం చేశారు.

గ్రెనేడియర్ యోగేంద్ర సింగ్ యాదవ్ (18 గ్రెనెడియర్స్)
కేవలం 19 ఏళ్ల యుక్త వయసులో ఉన్నగ్రెనేడియర్ యోగేంద్ర సింగ్ యాదవ్.. కార్గిల్ యుద్ధంలో టైగర్ హిల్ ఆక్రమించుకునే క్రమంలో వీరోచితంగా పోరాడారు. యాదవ్ కు తీవ్ర గాయాలైనా యుద్ధం కొనసాగించి శత్రు బంకర్లపై దాడులు చేసి విజయం సాధించాడు. ఈ క్రమంలో తన ప్రాణాలు అర్పించాడు. యాదవ్ కు కూడా పరమ్ వీర్ చక్ర అవార్డు ప్రదానం చేశారు.

రైఫిల్ మ్యాన్ సంజయ్ కుమార్ (13 జమ్ము కశ్మీర్ రైఫిల్స్)
సంజయ్ కుమార్.. కార్గిల్ యుద్ధంలో అత్యంత ధైర్య సాహసాలతో పోరాడిన వీర సైనికుడు. కెప్టెన్ విక్రమ్ బత్రాతో పాటు కీలక పాయింట్ 4875 పై తిరిగి భారత జెండా పాతడంలో దూకుడుగా శత్రు సైనికులపై విరుచుకుపడ్డాడు. యుద్దంలో సంజయ్ కుమార్ మరణించడంతో ఆయనకు పరమ్ వీర్ చక్ర అవార్డు ప్రదానం చేశారు.

మేజర్ రాజేష్ అధికారి (18 గ్రెనెడియర్స్)
టోలోలింగ్ బంకర్ తిరిగి భారత సైన్యం ఆక్రమించుకోవడం మేజర్ రాజేష్ అధికారి ముఖ్య పాత్ర పోషించారు. చివరి శ్వాస వరకు యుద్ధంలో తీవ్ర గాయాలతో పోరాడి అనుకున్న మిషన్ ని సాధించారు. మరణాంతరం ఆయనకు మహా వీర చక్ర అవార్డు ప్రదానం చేశారు.

యుద్ధంలో చనిపోయిన వారందరూ దేశభక్తి చాటుతూ ప్రాణత్యాగం చేశారు. వారంతా మన దేశానికి గర్వకారణం. దేశపౌరులకు ఆదర్శం. వారి సాహసాల వల్లే భారత సైన్యం యుద్ధం గెలిచింది. సరిహద్దుల్లో వారు ప్రాణత్యాగం చేయడంతోనే దేశ పౌరులు క్షేమంగా జీవిస్తున్నారు అని గుర్తుంచుకోవాలి.

ఈసారి లదాఖ్ లోని ద్రాస్ లో 25వ కార్గిల్ విజయ్ దినోత్సవ వేడుకలకు భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ముఖ్య అతిథిగా పాల్గొనన్నారు.

Also Read:  ‘నువ్వు ఆడదానివి.. నీకేం తెలుసు.. మాట్లాడకు..’ మళ్లీ నోరుజారిన బిహార్ సిఎం!

Related News

Nipah virus: కేరళలో నిఫా వైరస్ విజృంభణ.. స్టూడెంట్ మృతి.. రాష్ట్రంలో ఆంక్షలు!

PM Modi: ఇది ట్రైలర్ మాత్రమే.. ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు నాయుడు భేటీ

yashwant Sinha: వాజ్ పేయి సిద్ధాంతాలతో.. పార్టీ పేరు ప్రకటించిన యశ్వంత్ సిన్హా

Delhi: ఢిల్లీకి తదుపరి సీఎం ఎవరు? రేసులో ఆరుగురు పేర్లు.. వీళ్లేనా?

Rajasthan Road Accident: రాజస్థాన్‌లో ట్రక్కును ఢీకొట్టిన తుఫాను.. ఎనిమిది మంది దుర్మరణం

Jammu Kashmir: గాంధీ, నెల్సన్ మండేలాతో బీజేపీ పోల్చుతున్న ఈ బుఖారీ ఎవరు?

PM Narendra Modi: మరో 6 వందే భారత్ రైళ్లు.. వర్చువల్‌గా ప్రారంభించిన ప్రధాని మోదీ

Big Stories

×