EPAPER

Kalaburagi Jail : కర్ణాటక జైలులో ఖైదీలకు విఐపి ట్రీట్‌మెంట్.. జైలర్‌పై కేసు నమోదు

Kalaburagi Jail : కర్ణాటక జైలులో ఖైదీలకు విఐపి ట్రీట్‌మెంట్.. జైలర్‌పై కేసు నమోదు

Kalaburagi Jail | కర్ణాటకలోని కాలబుర్గీ జైలులో ఖైదీకు విఐపీ సదుపాయాలు లభిస్తున్నాయి. జైలు గదిలో ఉన్న ఖైదీలు సిగరెట్ తాగుతూ, సోషల్ మీడియా కోసం వీడియోలు చేస్తున్నారంటే వారంతా ఏ స్థాయిలో ఎంజాయ్ చేస్తున్నారో అర్థంచేసుకోండి. జైలులో లగ్జరీ లైఫ్ ఎంజాయ్ చేస్తున్న ఖైదీల వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఫర్హతాబాద్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు అయింది.


వైరల్ అవుతున్న వీడియోల్లో జైలు ఖైదీలు.. స్మార్ట్ ఫోన్ ద్వారా వీడియో కాల్స్ చేస్తూ, సెల్ఫీలు తీస్తూ కనిపిస్తున్నారు. కొందరైతే గంజాయి సేవనం చేస్తూ కనిపించారు.

దీంతో కాలబుర్గీ నగరం పోలీస్ కమిషనర్ జైలును తనిఖీ చేశారు. తనిఖీల్లో ఖైదీల వద్ద నుంచి బీడీలు, సిగరెట్‌లు, గుట్కా, రెండు మొబైల్ ఫోన్లు, ఇనుప రాడ్లు లాంటివి లభించాయి. వీటిని స్వాధీనం చేసుకున్న పోలీస్ బృందం.. జైలు చీఫ్ సూపరింటెండెంట్ డాక్టర్ అనితా పై కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించారు. మరోవైపు జైళ్ల శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ జెనెరల్ ఆఫ్ పోలీస్(ఎడిజిపి) మాలినీ కృష్ణమూర్తి కూడా జైలును సందర్శించి ప్రాథమిక విచారణ చేపట్టాలని ఆదేశాలు జారీ చేశారు.


ఎడిజిపి మాలినీ కృష్ణమూర్తి మీడియాతో ఈ విషయం గురించి మాట్లాడుతూ.. “కాలాబుర్గీ బుర్గీ జైలులో నిషేధిత వస్తువులు ఖైదీలకు ఎలా అందుతున్నాయనే విషయంపై విచారణ ప్రారంభించాం. జైలు సిబ్బంది, అధికారులు జైలు నియమాలను ఉల్లంఘించినట్లు తేలితే వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం. జైలులో ఏయే వస్తువులకు అనుమతించాలో దీని గురించి ఒక జాబితా ముందే తెలియజేశాం. ఇంకా విస్తృత స్థాయి తనిఖీలు చేపడతాం. ఈ విషయంలో ఇప్పటికే ఒక ఎఫ్ఐఆర్ నమోదైంది. విచారణకు కూడా ఆదేశించాం. ఒక కమిటీ ఆధ్వర్యంలో ఈ విచారణ సాగుతుంది. ఈ కమిటీలో పోలీస్ కమిషనర్, డిసిపి, పోలీస్ సూపరింటెండెంట్ ఉంటారు. వీరు అన్ని జైళ్లలో తనిఖీలు చేసి నివేదిక అందిస్తారు. ఈ తనఖీల్లో జైలు సిబ్బందిని కూడా విచారణ చేస్తారు.

కొంతకాలం క్రితం కర్ణాటక రాజధాని బెంగుళూరులోని పారప్పన అగ్రహార జైలులో నటుడు దర్శన్ హత్య కేసులో ఉండగా.. అతనికి విఐపి సదపాయాలు లభిస్తున్నట్లు వీడియోలు, ఫొటోలు మీడియాలో కనిపించాయి. దీంతో జైళ్ల నిర్వహణపై ప్రతిపక్ష పార్టీలు, మీడియా తీవ్ర స్థాయిలో విమర్శలు చేశాయి. రేణుకాస్వామి హత్య కేసులో దర్శన్ తో పాటు అతని మేనేజర్ నాగరాజ్ కూడా జైలులో ఉన్నాడు. అయితే నాగరాజ్ కూడా ఇంతకుముందు బల్లారి జైలులో ఉండగా.. అతడిని కాలబుర్గీ జైలుకి బదిలీ చేశారు.

kalaburagi jail

నేరం చేసిన వారికి న్యాయస్థానం శిక్షించాలనే ఉద్దేశంతో జైలులో ఖైదు చేయాలని ఆదేశిస్తుంది. కానీ జైలులో ఏ పని చేయకుండా హాయిగా 5 స్టార్ హోటల్ లో అతిథిగా ఈ ఖైదీలు జీవిస్తున్నారు. అంతే కాదు వారికి జైలులో గంజాయి లాంటి మాదక ద్రవ్యాలు కూడా అందుతున్నయంటే దీని వెనుక పెద్ద స్థాయిలో అవినీతి జరుగుతోంది.

ఇప్పుడు జైళ్లలో ఖైదీలు గురించి ఇంతగా జరుగుతోందంటే దానికి కారణం.. ముంబై రాజకీయ నాయకుడు బాబా సిద్దిఖ్ హత్య. గుజరాత్ లోని సాబర్మతి జైలులో ఉన్న లారెన్స్ బిష్నోయి అనే గ్యాంగ్ స్టర్.. జైలు నుంచి విదేశాల్లో ఉన్న తన అనుచరులకు ఆదేశాలు ఇస్తున్నాడు. అతని గ్యాంగ్ లో దేశవ్యాప్తంగా 700 మంది షూటర్లు హత్యలు చేయడానికి సిద్ధంగా ఉంటారని ఇటీవల జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి.

Also Read: బాబా సిద్దిక్ హత్య కేసులో మూడో నిందితుడు అరెస్ట్.. ‘షూటర్లకు కాంట్రాక్ట్ ఇచ్చింది ఇతనే’

జైలులో ఉన్న ఒక ఖైదీ బయటి ప్రపంచంలో నేరాలు ఆదేశిస్తున్నడంటే.. అతనికి జైలు సిబ్బంది సహకారం లభిస్తోందని ఆరోపణలు రావడంతో ఇప్పుడు దేశవ్యాప్తంగా జైళ్లలో తనఖీలు జరుగుతున్నాయి.

Related News

Delhi Pollution Supreme Court: ఢిల్లీలో తీవ్ర వాయు కాలుష్యం.. పంజాబ్, హర్యాణా ప్రభుత్వాలపై సుప్రీం సీరియస్!

Omar Abdullah CM Oath: జమ్ము కశ్మీర్ సిఎంగా ఒమర్ అబ్దుల్లా ప్రమాణ స్వీకారం.. ప్రభుత్వానికి కాంగ్రెస్ బయటి నుంచే మద్దతు!

‘Jai Shri Ram’ In Mosque: మసీదులో ‘జై శ్రీ రామ్’ జపించడం నేరం కాదు.. హై కోర్టు కీలక వ్యాఖ్యలు

S JAI SHANKER : పాకిస్థాన్‌లో భారత విదేశాంగ మంత్రి జై శంకర్‌.. ప్రధాని షరీఫ్‌తో భేటీ

Priyanka Gandhi at Wayanad : అన్న స్థానం చెల్లెలికి.. వయనాడ్ కాంగ్రెస్ అభ్యర్థిగా ప్రియాంకా గాంధీ ఖరారు

Karnataka: గవర్నర్‌కు బెదిరింపులు.. అలర్టైన కేంద్రం.. Z+ భద్రత మంజూరు

Big Stories

×