EPAPER

Jobs in Defence Ministry: 10 పాసైతే చాలు.. డిఫెన్స్ మినిస్ట్రీలో ఎగ్జామ్ లేకుండా జాబ్స్!

Jobs in Defence Ministry: 10 పాసైతే చాలు.. డిఫెన్స్ మినిస్ట్రీలో ఎగ్జామ్ లేకుండా జాబ్స్!


Defence Ministry Recruitment 2024: 10వ తరగతి ఉత్తీర్ణులైన వారికి ఎలాంటి పరీక్ష లేకుండానే నేరుగా ప్రభుత్వ ఉద్యోగం పొందేందుకు ఇది సువర్ణ అవకాశమనే చెప్పాలి. రక్షణ మంత్రిత్వ శాఖ (Ministry of Defence) ఫైర్‌మెన్ పోస్టులకు రిక్రూట్‌మెంట్ కోసం దరఖాస్తు ప్రక్రియను ప్రారంభించింది. ఆసక్తి, అర్హత గల అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ mod.gov.inని సందర్శించడం ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు చేయడానికి చివరి తేదీ మే 23 2024.

దరఖాస్తు చేయడానికి ముందు, వయోపరిమితి, పోస్టుల వివరాలు, జీతం, దరఖాస్తు ప్రక్రియ, రిక్రూట్‌మెంట్ ప్రక్రియ మొదలైన వాటి గురించి వివరంగా తెలుసుకోండి.

వయస్సు పరిమితి, విద్యార్హత

ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి అభ్యర్థుల వయస్సు 56 ఏళ్లు మించకూడదు. అలాగే.. అభ్యర్థులు ఏదైనా గుర్తింపు పొందిన బోర్డు నుండి 10వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి.


Also Read: వాషింగ్ మెషిన్‌లో నోట్ల కట్టలు.. ఏంటి.. ఎక్కడ?

పోస్టుల వివరాలు

ఈ రిక్రూట్‌మెంట్ కింద మొత్తం 40 పోస్టులకు అర్హులైన అభ్యర్థులను నియమిస్తారు. రక్షణ మంత్రిత్వ శాఖ కన్నూర్, కొచ్చిలో అభ్యర్థులను ఎంపిక చేస్తుంది.

కన్నూర్‌లో మొత్తం పోస్టులు- 02
కొచ్చిలో మొత్తం పోస్టులు- 38

జీతం వివరాలు

లెవల్ 2 ప్రకారం.. ఎంపికైన అభ్యర్థులందరికీ రూ.19,900 నుండి రూ.63,200 వరకు జీతం ఇవ్వబడుతుంది.

రిక్రూట్‌మెంట్ ప్రక్రియ ఇలా..

ఫిజికల్ ఫిట్‌నెస్ టెస్ట్, డాక్యుమెంట్ల వెరిఫికేషన్ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. దీని కోసం ఎటువంటి పరీక్ష నిర్వహించరు. దరఖాస్తు చేసిన తర్వాత.. అర్హత కలిగిన అభ్యర్థులు ఫిజికల్ టెస్ట్, డాక్యుమెంట్ల వెరిఫికేషన్ కు వెళ్లవలసి ఉంటుంది. అందుకు ముందుగానే అభ్యర్థులకు తెలియజేస్తారు.

Also Read: JEE Main Exams : జేఈఈ మెయిన్ పరీక్షల షెడ్యూల్ లో మార్పు.. కొత్త తేదీలివే..

ఇలా దరఖాస్తు చేసుకోండి

దరఖాస్తు చేసుకోవాలనుకున్నవారు mod.gov.in అధికారిక వెబ్ సైట్ లో ఇచ్చిన ఫార్మాట్‌ను డౌన్‌లోడ్ చేసి ప్రింట్ అవుట్ చేయాలి. అక్కడ అడిగిన సమాచారాన్నంతా ఫిల్ చేయాలి. అలాగే.. తప్పనిసరి పత్రాలను జతచేసి.. ఫ్లాగ్ ఆఫీసర్ కమాండింగ్-ఇన్-చీఫ్, {స్టాఫ్ ఆఫీసర్ (సివిలియన్ రిక్రూట్‌మెంట్ సెల్)} హెడ్‌క్వార్టర్స్ సదరన్ నావల్ కమాండ్ నేవల్ బేస్, కొచ్చి – 682004 చిరునామాకు స్పీడ్ పోస్ట్ ద్వారా మే 23 కంటే ముందు పంపవలసి ఉంటుంది.

Tags

Related News

Minister Comments: బ్రేకింగ్ న్యూస్.. వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన మంత్రి.. తన కూతురు – అల్లుడిని నదిలో తోసేయండంటూ..

Amit Shah: ఆ విషయంలో.. పాక్‌తో చర్చలు జరిపే ఆలోచనే లేదు: అమిత్ షా

No Doctors For Jails: 5600 మంది ఖైదీలకు ఒక డాక్టర్.. జైళ్లలో నేరస్తుల ఆరోగ్యంపై నిర్లక్ష్యమా?..

Uttar Pradesh Wolf Attacks: యూపీలో తోడేళ్ల విధ్వంసం.. 8 మంది మృతి.. మంత్రి వింత వాదన!

Kolkata Rape Case CBI: కోల్‌కతా రేప్ నిందితుడికి బెయిల్?.. సిబిఐ నిర్లక్ష్యం.. మండిపడిన మమతా పార్టీ!

Jammu and Kashmir Assembly Polls: జమ్మూకాశ్మీర్ బీజేపీ ఎన్నికల మేనిఫెస్టో విడుదల

Mumbai times tower: ముంబై.. మంటల్లో టైమ్స్ టవర్, భారీగా నష్టం

Big Stories

×