J&K grants land ownership rights to west Pakistan refugees
ఆర్టికల్ 370 రద్దు తర్వాత జమ్మూ కాశ్మీర్ లో అనూహ్య మార్పులొచ్చాయి. అప్పటిదాకా జమ్ము కాశ్మీర్ కు స్వయంప్రతిపత్తి జెండా ఉండేది. కానీ 2019లో ఆర్టికల్ 370 రద్దు కావడంతో అక్కడ భారత మువ్వన్నెల జెండా ఎగురుతోంది. 1947 లో భారత భూభాగం నుంచి విడిపడింది పాకిస్తాన్. అయితే పాక్ నుంచి వచ్చి భారత్ లో దాదాపు ముప్పై ఆరువేల మంది శరణార్థులకు ఒక్కో కుటుంబానికి ప్రభుత్వం రూ.5 లక్షల సాయం అందించింది. అలాగే పశ్చిమ పాకిస్తాన్ ప్రాంతం నుంచి భారత్ లోని జమ్ము కాశ్మీర్ కు వచ్చి తలదాచుకున్న ఐదు వేల ఏడు వందలకు పైగా శరణార్థులకూ భారత్ ఐదు లక్షల సాయం అందించింది.
ఇన్నాళ్లూ ఆస్తి హక్కు లేక..
స్వాత్రంత్రం వచ్చి 77 ఏళ్లు అవుతున్నా పాక్ పశ్చిమ ప్రాంతం నుంచి వలస వచ్చి జమ్ము కాశ్మీర్ లో స్థిరపడిన వారికి ఆస్తి హక్కు లేకపోవడంతో వారు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఇక్కడ భారత సంస్క్రతికి అలవాటు పడ్డామని..మా కుటుంబాలు,వారసులు అంతా భారత్ లోనే స్థిరపడిపోవాలని నిర్ణయించుకున్నామని, పాకిస్తాన్ కు తాము తిరిగి వెళ్లబోమని స్సష్టం చేస్తున్నారు పశ్చిమ పాక్ నుంచి జమ్ము ప్రాంతానికి వలస వచ్చినవారు. అయితే ఇప్పుడు జమ్ము కాశ్మీర్ వారికి శుభవార్తను తెలియజేసింది. ఇకపై వారికి కూడా ఆస్తి హక్కు ఉంటుందని స్పష్టం చేసింది. రాజధాని శ్రీనగర్ లో జరిగిన కౌన్సిల్ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నామని కాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా తెలిపారు. పశ్చిమ పాకిస్తాన్ నుంచి భారత్ కు వలస వచ్చిన వారు ఎక్కువగా కథువా, జమ్ము, సాంబా ప్రాంతాలలో స్థిర నివాసాలు ఏర్పాటు చేసుకున్నారు.
ఒక్కో ఫ్యామిలీకి 4 ఎకరాలు
దాదాపు ఐదు వేల మందికి పైగా ఉన్న వీరి కుటుంబాలకు ఒక్కో ఫ్యామిలీకీ 4 ఎకరాల వ్యవసాయ భూమిని కేటాయించారు. ఇది జరిగి 70 ఏళ్లు అయింది. అయితే 70 ఏళ్ల తర్వాత ఈ భూములపై వీరికి ఆస్తి హక్కు లభించినట్లయింది. ప్రస్తుతం పాక్ పశ్చిమ వలసదారుల సంఖ్య ఇరవై రెండు వేలకు పైగా చేరింది. జమ్ము కాశ్మీర్ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో శరణార్థులు, వలసదారులు పెద్ద ఎత్తున సంబరాలు చేసుకుంటున్నారు. డెబ్బై ఏళ్ల తమ కల సాకారం చేసినందుకు జమ్ము కాశ్మీర్ ప్రభుత్వానికి కృతజ్ణతలు తెలుపుతున్నారు.
స్వీట్స్ తినిపించుకుంటూ సంబరాలు
తమకు డెబ్బై ఏళ్ల తర్వాత స్వాతంత్ర్యం ఈ రోజే వచ్చినంత ఆనందంగా ఉందని వలసదారులు చెబుతున్నారు. తమ ఆనందాన్ని ఒకరినొకరు మిఠాయిలు తినిపించుకుని పంచుకుంటున్నారు. తమని ఇప్పటికైనా భారత ప్రభుత్వం గుర్తించినందుకు ధన్యవాదములు చెబుతున్నారు. కాగా పాక్ పశ్చిమ ప్రాంతం నుంచి వలస వచ్చిన వారికి ఆస్తి హక్కు మంజూరు నిర్ణయానికి తమ పూర్తి స్థాయి మద్దతు ప్రకటించింది అడ్మినిస్ట్రేటివ్ కౌన్సిల్. లెఫ్టినెంట్ గవర్నర్ తీసుకున్న నిర్ణయానికి తమ పూర్తి మద్దతు ప్రకటించడం విశేషం.