EPAPER

Jammu Kamshir Election Results 2024: కాషాయాన్ని దూరం పెట్టిన కాశ్మీరం.. కాంగ్రెస్‌ విజయానికి ప్రధాన కారణాలివే

Jammu Kamshir Election Results 2024: కాషాయాన్ని దూరం పెట్టిన కాశ్మీరం.. కాంగ్రెస్‌ విజయానికి ప్రధాన కారణాలివే

Jammu Kamshir Election Results 2024: జమ్మూకాశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ కూటమి విజయం దిశగా వెళ్తోంది. తాజాగా ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్-ఎన్సీ కూటమి మేజిక్ ఫిగర్ దాటేసింది. ప్రభుత్వం ఏర్పాటు దిశగా అడుగులు వేస్తోంది. దాదాపు దశాబ్దం తర్వాత అక్కడ ఎన్నికలు జరిగాయి.


జమ్మూ కాశ్మీర్ 370 ఆర్టికల్ రద్దు తర్వాత తొలిసారి అక్కడ ఎన్నికలు జరిగాయి. దీనిపై బీజేపీ చాలా ఆశలు పెట్టుకుంది. 370 ఆర్టికల్ రద్దు తర్వాత మా పార్టీకి కలిసి వస్తుందని బోలెడంత ఆశలు పెట్టుకుంది. జమ్మూకాశ్మీర్ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కమలనాధులు, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి, పార్టీ ప్రధాన కార్యదర్శి రామ్ మాధవ్‌కు బాధ్యతలు అప్పగించింది.

గతంలో ఈ ఇద్దరు నేతలు జమ్మూకాశ్మీర్‌ పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనడంతో వారికి ఛాన్స్ ఇచ్చింది. కానీ, కాశ్మీర్‌లో కమల వికాసం కనిపించలేదు. పార్టీ నిలబడే ప్రయత్నం చేసింది. ఈసారి కమలం జెండా రెపరెపలాడుతుందనే అంచనాలు పెట్టుకుంది ఆ పార్టీ.


ఆర్టికల్ 370 రద్దు తర్వాత చాలా ఇబ్బందులు పడ్డామని అక్కడి ప్రజల మాట. దీనికితోడు కాంగ్రెస్-ఎన్సీ కలిసి పని చేయడం ఇండియా కూటమికి కలిసొచ్చిందనే చెప్పాలి. పీడీపీ, బీజేపీ సొంతంగా పోటీ చేశాయి. కేవలం అక్కడ హిందూ కులాలను నమ్ముకుంది బీజేపీ. ఆ విషయంలో సక్సెస్ అయ్యింది కూడా.

ALSO READ: కాశ్మీర్‌లో బీజేపీకి ఊహించని దెబ్బ.. మోదీశకం ముగింపుకు సంకేతాలా?

ఎగ్జిట్ పోల్స్ సైతం జమ్మూకాశ్మీర్‌లో కమలం వికసిస్తుందని తేల్చిచెప్పాయి. వాటి అంచనాలు పూర్తిగా రివర్స్ అయ్యాయి. పీడీపీతో పొత్తు కుంటే విజయం సాధించేదని అంటున్నారు. మెజార్టీకి అటు ఇటుగా వస్తుందని భావించింది బీజేపీ. ఈ క్రమంలో ఐదుగురు ఎమ్మెల్యేలను అసెంబ్లీకి నామినేట్ చేసింది. అయినా ఫలితం తారుమారైంది.

ఫలితాలపై కాశ్మీర్ మాజీ సీఎం ఒమర్ అబ్దుల్లా రియాక్ట్ అయ్యారు. ఎలాంటి కుట్రలకు పాల్పడవద్దని ఆయన అన్ని పార్టీలను రిక్వెస్ట్ చేశారు. ప్రస్తుతం జమ్మూకాశ్మీర్‌లో 50 సీట్లలో కాంగ్రెస్ కూటమి ఆధిక్యంలో ఉండగా, బీజేపీ 25 సీట్లు, పీడీపీ-2, ఇతరులు ఎనిమిదింటిలో లీడ్‌లో ఉన్నారు. (నోట్: పూర్తి ఫలితాలు ఇంకా వెల్లడికావల్సి ఉన్నాయి. ప్రస్తుతం కాంగ్రెస్ విజయం దాదాపు ఖరారైనట్లే.)

Related News

Congress Reaction: హర్యానా ఎన్నికల ఫలితాలపై జైరాం రమేష్ హాట్ కామెంట్స్… వామ్మో ఇలా అనేశాడేంటి..?

అమెజాన్‌లో అందుబాటులో ఉన్న NCERT పుస్తకాలు.. ధర తక్కువనా.. ఎక్కువనా..?

Haryana Election Results 2024: హర్యానాలో బీజేపీ హవా.. అంతా ఆమ్ ఆద్మి దయేనా? అంచనాలన్నీ తారుమారు!

Haryana Election Result 2024: ఈసీ వెబ్ సైట్ లో ఫలితాల జాప్యం.. ఫిర్యాదు చేయనున్న కాంగ్రెస్.. గెలుపుపై పార్టీల భిన్న వాదన

J&K Haryana election results 2024: కాశ్మీర్‌లో బీజేపీకి ఊహించని దెబ్బ.. మోదీశకం ముగింపుకు సంకేతాలా?

Haryana and Jammu & Kashmir: నేడే జమ్మూకశ్మీర్‌, హర్యానా రిజల్ట్స్.. ఫలితాలపై ఉత్కంఠ!

×