EPAPER

J&K Haryana Election Results Live: రెండు రాష్ట్రాల్లో ఆ పార్టీదే హవా.. మరికొన్ని గంటల్లోనే ప్రజాతీర్పు, లైవ్ అప్‌డేట్స్ చూసేయండి

J&K Haryana Election Results Live: రెండు రాష్ట్రాల్లో ఆ పార్టీదే హవా.. మరికొన్ని గంటల్లోనే ప్రజాతీర్పు, లైవ్ అప్‌డేట్స్ చూసేయండి

జమ్ము కశ్మీర్, హర్యానా ఓటర్లు బీజేపీకి షాక్ ఇవ్వనున్నారా? ఈ రాష్ట్రాల్లో కూడా కాంగ్రెస్ హవా కొనసాగనుందా? ఎన్నికల ఫలితాల్లో ఎవరిది పైచేయి? ఏ రాష్ట్రంలో క్లియర్ మెజారిటీ రానుంది? ఎక్కడ హంగ్ వస్తుంది. ఈ ఉత్కంఠకు తెరపడే సమయం వచ్చింది. మరికొన్ని గంటల్లోనే ప్రజా తీర్పు వెలువడనుంది. ప్రతి క్షణం.. ఎన్నికల ఫలితాల అప్‌డేట్స్‌ను మీరు ఇక్కడ తెలుసుకోవచ్చు. ఎన్నికల ఫలితాల్లోకి వెళ్లే ముందు.. అసలు ఎగ్జిట్ పోల్స్‌లో ఎలాంటి ఫలితాలు వచ్చాయో చూద్దాం.


జమ్ము, హర్యానాలో ఇటీవల పోలింగ్ పూర్తయ్యింది. ఆ వెంటనే వచ్చిన ఎన్నికల ఫలితాల్లో కొన్ని ఏజెన్సీలు కాంగ్రెస్ పార్టీదే హవా అంటూ ప్రకటించాయి. మరికొన్ని మాత్రం.. అటుఇటుగా ఫలితాలు ఉంటాయని చెప్పాయి. అయితే, ప్రజా తీర్పు ఎలా ఉంటుందనేది ఫలితాలు వచ్చే వరకు చెప్పలేం. తారుమారయ్యే అవకాశాలు కూడా లేకపోలేదు. ఈ ఎన్నికల ఫలితాలు బీజేపీకి చాలా కీలకం. ఎందుకంటే.. ఇటీవలే చావు తప్పి కన్ను లొట్టపోయినట్లు.. కొద్దిలో అధికారాన్ని అందుకొనే అవకాశాన్ని కోల్పోయేది. కాంగ్రెస్ పార్టీ తిరిగి పుంజుకోవడమే ఇందుకు కారణం. ఈ నేపథ్యంలో కమలదళంలో ఆందోళన మొదలైంది.

హర్యానాలో ఇలా..


హర్యానాలో కూడా హస్తానిదే హవాని అని పేర్కొన్నాయి. హర్యానాలో 90 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరిగాయి. మొత్తం 1031 మంది అభ్యర్థులు పోటీ పడ్డారు. అక్కడ బీజేపీ, కాంగ్రెస్, ఆప్ పార్టీలు విడివిడిగా పోటీ చేశాయి. అందుకే, అక్కడ ఎవరు పాగా వేస్తారనే ఉత్కంఠ నెలకొంది. కొన్ని ఎగ్జిట్ పోల్స్ అక్కడ హంగ్ ఏర్పడే అవకాశం ఉందని చెబుతున్నాయి. బీజేపీకి క్లియర్ మెజారిటీ రాకపోవచ్చని.. ఒక వేళ అటూఇటుగా ఫలితాలు వస్తే ఆమ్ ఆద్మీ.. కాంగ్రెస్‌కే మద్దతు ఇవ్వొచ్చని టాక్. అక్కడ మెజారిటీ సాధించాలంటే కనీసం 46 స్థానాలు రావాలి.

జమ్మూలో అలా..

జమ్ము కశ్మీర్‌లో కాంగ్రెస్ కూటమి (I.N.D.I.A) పాగా వేయనున్నట్లు కొన్ని ఎగ్జిట్ పోల్స్‌లో తేలింది. ఇక్కడ పదేళ్ల తర్వాత జరుగుతున్న ఎన్నికలు కావడంతో యావత్ దేశం చూపు ఇటే ఉంది. జమ్మూ కశ్మీర్‌లో మొత్తం 90 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. అక్కడి పరిస్థితుల నేపథ్యంలో ఒకేసారి కాకుండా మూడు విడతల్లో ఎన్నికలు నిర్వహించారు. ప్రజలు సైతం తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఇక్కడ కాంగ్రెస్ – ఎన్‌సీ, బీజేపీతోపాటు పీడీపీ కూడా బరిలో ఉంది. కాంగ్రెస్ కూటమికే విజయావకాశాలు ఎక్కువ ఉన్నాయని ఎగ్జిట్ పోల్స్ చెబుతున్నాయి.

ఎగ్జిట్ పోల్స్ పూర్తి ఫలితాలు చూసేందుకు.. ఈ కింది లింక్ క్లిక్ చేయండి

బీజేపీకి షాక్.. ఆ రెండు రాష్ట్రాలూ కాంగ్రెస్‌కే, ఎగ్జిట్ పోల్స్ ఫలితాలివే!

Related News

RuPay in Maldives: మోదీతో మాల్దీవుల ప్రెసిడెంట్ భేటీ.. ఇక అక్కడా ‘RuPay’ కార్డ్

Mumbai Metro Line 3: ముంబై మొదటి భూగర్భ మెట్రో లైన్ 3ని ప్రారంభించిన ప్రధాని మోడీ.. ఛార్జీల వివరాలు ఇవే

Rahul Gandhi: దళితులపై ఆ వ్యాఖ్యలు చేసిన రాహుల్ గాంధీ… వైరలవుతున్న వీడియో

Arvind Kejriwal: మోదీ అలా చేస్తే.. బీజేపీ తరపున ప్రచారం చేస్తా.. కేజ్రీవాల్ సవాల్

Stampede: తొక్కిసలాటలో నలుగురు మృతి.. వందలాది మందికి గాయాలు.. ఈ తీవ్ర విషాదం ఎక్కడ జరిగిందంటే?

6 వేల మీటర్ల ఎత్తులో 3 రోజులు అరిగోస, IAF సాయంతో ప్రాణాలతో బయటపడ్డ విదేశీ పర్వతారోహకులు

×