Big Stories

Credit Card:- క్రెడిట్ కార్డ్ బిల్లు ఈఎంఐల్లో కట్టడం మంచిదేనా..?

Credit Card:- ఒకేసారి భారం మోయడం కన్నా.. కొద్ది కొద్దిగా దించుకోవడం బెటర్. గుడ్డి కన్నా మెల్ల బెటర్. అసలుకే క్రెడిట్ కార్డ్ బిల్లు చెల్లించలేక డిఫాల్ట్ అవడం కంటే.. నెలకింత చొప్పున బిల్లు కట్టేస్తూ ఉండడమే బెటర్. మొత్తం కట్టగలిగితే.. ఇంకే గొడవా ఉండదు. ఆ అవకాశం ఉన్నప్పుడు.. పూర్తి బిల్లు కట్టగలిగే స్తోమత ఉన్నప్పుడు ఈఎంఐకి వెళ్లకపోవడమే బెటర్. ఇదంతా చెప్పేది వస్తువు కొనేటప్పుడు ఈఎంఐ గురించి కాదు. టోటల్ క్రెడిట్ కార్డ్ బిల్లు చెల్లింపు గురించి.

- Advertisement -

క్రెడిట్ కార్డ్ బిల్లును ఈఎంఐలుగా చెల్లించాలంటే కనీసం 14 శాతం వడ్డీ వేస్తారు. పైగా వాయిదాలు కడుతున్న కొద్దీ.. క్రెడిట్ లిమిట్ రిలీజ్ అవుతుంది. ఉదాహరణకు మీ క్రెడిట్ కార్డ్ బిల్లు లక్ష రూపాయలు అయితే.. నెలకు ఈఎంఐ కింద 20వేల చొప్పున కట్టడానికి సిద్ధమైతే.. మీరు ఉపయోగించుకునే మొత్తం 20వేలే అవుతుంది. రెండు నెలలకు కలిపి 40వేల ఈఎంఐ కడితే.. ఆ 40 వేలే ఉపయోగించుకోవాల్సి ఉంటుంది. అంటే.. ఈఎంఐలు మొత్తం కడితేనే.. క్రెడిట్ కార్డ్ లిమిట్‌లో ఉన్న మొత్తం అమౌంట్‌ను ఉపయోగించుకోడానికి వీలు ఉంటుంది. పైగా ఈఎంఐలోకి మార్చుకుంటే.. ముందుగా ప్రాసెసింగ్ ఫీజు కూడా కట్టాల్సి ఉంటుంది. అది కనీసం 3 శాతం వరకు ఉండొచ్చు. లేదంటే బ్యాంకును బట్టి మారుతుంటుంది. ఇవన్నీ గమనించాల్సిన అంశాలే.

- Advertisement -

పైగా ఒక్కటి గుర్తుపెట్టుకోవాలి. ఒకసారి ఈఎంఐగా మార్చుకున్న తరువాత కచ్చితంగా నెల నెలా కట్టాల్సిందే. ఒక్కసారి కట్టలేకపోయినా.. బ్యాంకులు వేసే వడ్డీ మామూలుగా ఉండదు. మిగిలిన మొత్తాన్ని సాధారణ కార్డు బాకీగా మార్చి మరుసటి నెల బిల్లులో కలిపి పంపిస్తారు.

ఏదైనా కారణంతో క్రెడిట్ కార్డు బిల్లులు చెల్లించకపోతే అనవసరంగా అధిక వడ్డీ భరించాల్సి ఉంటుంది. పైగా 30 నుంచి 40 శాతం వడ్డీ వేస్తాయి. అందులోనూ, బిల్లు కట్టడం లేట్ అవుతుంది కాబట్టి.. క్రెడిట్ స్కోరుపై కూడా ప్రభావం పడుతుంది. వీటన్నింటి కన్నా వాయిదాల పద్ధతిలో బిల్లు కట్టడం బెటర్.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News