EPAPER

Broadcasting Bill: యూట్యూబ్‌లో ఇక నిజాలు వినలేమా? ప్రధానిని విమర్శిస్తే ఛానెల్ బ్లాక్? నేరుగా.. జైలుకే!

Broadcasting Bill: యూట్యూబ్‌లో ఇక నిజాలు వినలేమా? ప్రధానిని విమర్శిస్తే ఛానెల్ బ్లాక్? నేరుగా.. జైలుకే!

Broadcasting regulation Bill 2023: ప్రభుత్వ తప్పిదాలను వేలెత్తి చూపే యూట్యూబ్ ఛానెళ్ల చేతులను కట్టేందుకు రంగం సిద్ధమవుతోంది. అయ్యా.. అన్యాయం జరుగుతోందని చెప్పినా.. నోరు నొక్కేస్తారు. తేడా వస్తే తేట తీస్తారు. జైలుకు తోస్తారు. దీనిపై మరికొద్ది రోజుల్లో ఓ క్లారిటీ రాబోతోందంటూ వార్తలు వచ్చాయి. అయితే, దీనిపై ఇంకా పూర్తి స్పష్టత రావల్సి ఉంది. సోషల్ మీడియాలో వచ్చే న్యూస్ ని పూర్తిగా కంట్రోల్ చేయడానికి కేంద్ర ప్రభుత్వం గీస్తున్న ఈ మాస్టర్ ప్లాన్ అమల్లోకి వస్తే.. సామాన్యుడి గొంతు మూగబోవడం ఖాయమని తెలుస్తోంది. మరి, ప్రజల తరపున తమ గళం వినిపించే యూట్యూబ్ ఛానెళ్లను బ్లాక్ చేయడం సాధ్యమేనా? ఇందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధం చేసిన ఆ బిల్ ఏమిటీ? అది అమల్లోకి వస్తే ఏం జరుగుతుంది? దాన్ని మళ్లీ ఎందుకు వెనక్కి తీసుకున్నారు?


మళ్లీ తెరపైకి బ్రాడ్‌కాస్టింగ్ సర్వీసెస్ రెగ్యులేషన్ బిల్

బ్రాడ్‌కాస్టింగ్ సర్వీసెస్ రెగ్యులేషన్ బిల్ 2023 అనేది ఇప్పుడు మళ్లీ హాట్ టాపిక్ గా మారింది. గత ఏడాది ఈ బిల్‌ తీసుకొచ్చేందుకు ఎన్డీఏ గవర్నమెంట్ రెడీ అయింది. ఆ బిల్ ముసాయిదా కాపీనీ ప్రజలకు అందుబాటులోకి తెచ్చిన తర్వాత ఆందోళనలు, నిరసనలు కనపడ్డాయి. ఇంతలో ఎలక్షన్లు రావడంతో ఆ డిస్కషన్ పక్కకుపోయింది. ఇప్పుడు మళ్లీ ఈ బిల్ కోసం కేంద్రం నెక్స్ట్ స్టెప్ వేసింది. అయితే.. ఇక్కడే చిన్న మతలబు ఉంది. ఈ బిల్ ని యాజ్ ఇట్ ఈజ్ గా ఇంప్లిమెంట్ చేయకుండా కొన్ని కరెక్షన్స్ చేశారు. ఆ కరెక్షన్స్ చేసిన కాపీల్ని అతి కొద్దిమందికి కేంద్రం పంపించింది. అలా పంపించిన వారిలో ఎవరూ ఆ బిల్ కాపీల్ని బయట పెట్టకుండా ఉండేందుకు వాటిపై వాటర్ మార్క్స్ ఉంచారట. అంత సీక్రెట్ ఎందుకంటూ ఇటీవల నేషనల్ మీడియా రచ్చ చేసింది. అయినా కేంద్రం తగ్గేదే లేదంటోంది. బిల్ విషయంలో ఇంకా సీక్రెట్ మెయింటెన్ చేస్తోంది. ప్రస్తుతానికైతే మరోసారి ఆ బిల్లును అమల్లోకి తెచ్చే ఆలోచన లేదంటూ స్పష్టత ఇచ్చింది. కానీ, అది అనుమానమే. కేంద్రం ఏ క్షణంలోనైనా దాన్ని అమల్లోకి తెచ్చే అవకాశం లేదు.


Also Read: మహిళా ఉద్యోగులకు నెలసరి సెలవు.. స్వాతంత్ర్య దినోత్సవం వేళ సంచలన నిర్ణయం

ఇంతకీ ఏంటా బిల్.. ఆ బిల్ అమలులోకి వస్తే నష్టం ఏంటి?

బ్రాడ్‌కాస్టింగ్ సర్వీసెస్ రెగ్యులేషన్ బిల్ గురించి తెలుసుకునే ముంది అసలు మన ఇండియాలో మీడియా పొజిషన్ ఏంటి..? దాన్ని రెగ్యులేట్ చేయడానికి ఏమేం చట్టాలున్నాయో ఓసారి చూద్దాం. ప్రస్తుతం.. ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా, డిజిటల్ మీడియాలు ప్రజలకు అందుబాటులో ఉన్నాయి. ప్రింట్ మీడియా కోసం ఫస్ట్ టైమ్ ప్రెస్ అండ్ రిజిస్ట్రేషన్ ఆఫ్ బుక్స్ యాక్ట్ 1867 లో వచ్చింది. ఆ తర్వాత వెర్నాక్యులర్ ప్రెస్ యాక్ట్ 1878తో కొన్ని కండిషన్స్ పెట్టాలనుకున్నారు. అది వర్కవుట్ కాలేదు. 1908 ప్రెస్ యాక్ట్ కూడా పత్రికలకు కొత్త కండిషన్లు పెట్టింది. ఆఫ్టర్ ఇండిపెండెన్స్ 1955లో రిజిస్ట్రార్ ఆఫ్ న్యూస్‌పేపర్స్ ఫర్ ఇండియా అంటే.. RNA ని స్థాపించారు. ఒకరకంగా RNA వల్ల కూడా నష్టం ఉందని అప్పట్లో జర్నలిస్ట్ లు ఆందోళన చేపట్టారు. ఆనాటి నెహ్రూ గవర్నమెంట్ కూడా పత్రికల స్వేచ్ఛని అడ్డుకుంటుందని గొడవ చేశారు. కానీ ఫలితం లేదు. ఆ యాక్ట్ అమలులోకి వచ్చింది. ఇక ఎమర్జెన్సీ టైమ్ లో ఇందిరాగాంధీ పత్రికలపై ఆంక్షలు పెట్టారు. ఎమర్జెన్సీ తర్వాత అవి తీసేశారు.

ఇక ఎలక్ట్రానిక్ మీడియా విషయానికొద్దాం. ఇక్కడ ఎలక్ట్రానిక్ మీడియా అంటే టీవీ మీడియా. ప్రధానంగా న్యూస్ ఛానెల్స్. వీటిని రెగ్యులేట్ చేయడం కోసం కేబుల్ టెలివిజన్ నెట్‌వర్క్‌ రెగ్యులేషన్ చట్టాన్ని 1995లో తీసుకొచ్చారు. అవసరమైనప్పుడు కొన్ని సవరణలు చేస్తూ ప్రస్తుతానికి దీన్నే అమలులో ఉంచారు.

డిజిటల్ మీడియా ఇప్పుడొక రెవల్యూషన్. ప్రింట్ మీడియాను.. టీవీ వచ్చి పక్కకు నెట్టేస్తే, టీవీని డిజిటల్ మీడియా వెనక్కు నెట్టింది. ఇప్పుడంతా బ్రేకింగ్ న్యూస్ లు మొబైల్ ఫోన్స్ లోనే చూస్తున్నారు. ఇన్ షార్ట్స్ వంటి న్యూస్ యాప్స్ ఇంగ్లిష్ లో బాగా ఫేమస్, ఛోటా న్యూస్ వంటివి తెలుగులో పాపులర్ అవుతున్నాయి. క్షణాల్లో వార్తల్ని మన కళ్లముందు ఉంచుతున్నాయి. ప్రస్తుతం భారత్ లో 63 శాతం మంది యువత వార్తలకోసం డిజిటల్ మీడియానే ప్రిఫర్ చేస్తున్నారు.

పేరుకి డిజిటల్ అనేది సింగిల్ వర్డ్. కానీ ఇందులో చాలా రకాలున్నాయి. ఎవరికి వారు సొంతగా నిర్వహించుకునేవి వెబ్ సైట్స్, న్యూస్ యాప్స్. ఇవి కాకుండా ఫేస్ బుక్, యూట్యూబ్, ట్విట్టర్, ఇన్ స్టాలో కూడా డిజిటల్ న్యూస్ ఛానెల్స్ వచ్చేశాయి. వాట్సప్ లో ఛానెల్స్ పేరుతో వచ్చిన కొత్త ఫెసిలిటీ కూడా న్యూస్ బ్రాడ్ కాస్ట్ కోసమే. ఓటీటీ అనేది వీటికి అడిషన్. ప్రస్తుతానికి ఓటీటి కేవలం ఎంటర్టైన్మెంట్ కోసమే ఉన్నా.. న్యూస్ బులిటెన్లు కూడా అక్కడక్కడ కనపడుతున్నాయి. వీటన్నిటికీ ఇప్పటి వరకు ఎలాంటి కండిషన్లు లేవు. ఎవరకు నచ్చిన న్యూస్, వారికి నచ్చినట్టు ఇచ్చుకోవచ్చు. దీన్ని స్ట్రీమ్ లైన్ చేయడం కోసమే కేంద్రం ప్రయత్నిస్తోంది.

స్ట్రీమ్ లైన్ చేయడం వేరు, కంట్రోల్ లో పెట్టుకోవడం వేరు. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం డిజిటల్ మీడియాని కంట్రోల్ చేయాలనుకుంటున్నట్టు తెలుస్తోంది. ప్రింట్, టీవీ మీడియాల్ని కంట్రోల్ లో పెట్టినంత సులభంగా డిజిటల్ మీడియా లొంగకపోవడం ఇక్కడ విశేషం. అందుకే బ్రాడ్‌కాస్టింగ్ సర్వీసెస్ రెగ్యులేషన్ బిల్ తీసుకొస్తున్నారు. లాస్ట్ టర్మ్ ఇది సాధ్యం కాలేదు, ఈసారి కొత్తగా దీన్ని రెడీ చేస్తున్నారు.

ఈ బిల్ లో ఏముంటుంది?

యూట్యూబ్, ఇన్ స్టా గ్రామ్ లో వార్తల్ని ప్రసారం చేస్తూ కంటెంట్ క్రియేటర్లుగా ఉన్నవారు ఇకపై ప్రభుత్వం వద్ద రిజిస్టర్ చేసుకోవాలి. తమ సబ్ స్క్రైబర్స్ డేటాను ఎప్పుడు అడిగితే అప్పుడు వారు ప్రభుత్వానికి ఇవ్వడానికి రెడీగా ఉండాలి. ఆన్ లైన్ యాడ్స్, గూగుల్ యాడ్స్ కి సంబంధించిన డేటా మొత్తం ప్రభుత్వానికి ఇవ్వాలి. వారి ఆదాయంపై కూడా నిఘా ఉంటుంది. రూల్స్ బ్రేక్ చేస్తే భారీగా ఫైన్ కూడా వేస్తారు. ఈ ఫైన్ 2.5 కోట్ల రూపాయల వరకు ఉంటుందని అంచనా. అవసరమైతే వారి దగ్గరనుంచి డేటాను ప్రభుత్వం తీసేసుకోవచ్చు, వారి ఎక్విప్ మెంట్స్ కూడా సీజ్ చేయొచ్చు. ఇవీ ఇందులోని కొన్ని క్లాజెస్.

దీనివల్ల ఏంటి నష్టం?

2014లో న్యూస్-18 గ్రూప్ లో రిలయన్స్ కంపెనీ ఇన్వెస్ట్ మెంట్ చేయడం నచ్చక ఎడిటర్లంతా వరసబెట్టి రిజైన్ చేశారు. ఎందుకంటే.. వారికి అక్కడ స్వేచ్ఛ లేదు కాబట్టి. రెండేళ్ల క్రితం ఎన్డీటీవీని అదానీ టేకోవర్ చేయడంతో రాజ్ దీప్ సర్దేశాయ్ సహా చాలామంది రాజీనామా చేశారు. ఎందుకంటే అక్కడ స్వతంత్రంగా పనిచేయలేరు కాబట్టి. ఇక డిజిటల్ మీడియాని కూడా కేంద్ర ప్రభుత్వం శాసిస్తే ఇండివిడ్యువల్ జర్నలిస్ట్ ల సంగతేంటి..? ఇప్పటి వరకు ఎక్కడా తలొంచనివారు, ఎవరికీ భజన చేయని వారు, రేపు కేంద్రంపై కేవలం పాజిటివ్ వార్తలు మాత్రమే ఇవ్వాలి. ఎక్కడా నెగెటివిటీ ఉండకూడదు. ఒకవేళ విమర్శిస్తే వారిని అధికారికంగా బెదిరించే అవకాశం ప్రభుత్వానికి ఉంటుంది.

Also Read: నా చెవులు, కళ్లు తెరిచే ఉన్నాయి: నిరసన చేస్తున్న డాక్టర్లతో పశ్చిమ బెంగాల్ గవర్నర్

ఇప్పటి వరకు అడ్వర్టైజ్ మెంట్లు ఇస్తూ ప్రింట్ మీడియాని, టీవీ మీడియాని మేనేజ్ చేసిన కేంద్రం, డిజిటల్ మీడియాని కూడా అలాగే దారిలోకి తీసుకోవాలని చూస్తోంది. అయితే కొంతమంది లొంగడం లేదు. ఇలా లొంగనివారి వల్ల తమ ఇమేజ్ డ్యామేజీ అయిందని, అందుకే ఈ ఎన్నికల్లో అనుకున్న టార్గెట్ రీచ్ కాలేకపోయామనేది బీజేపీ నేతల అనుమానం. అందుకే అర్జెంట్ గా ఇండివిడ్యువల్ జర్నలిస్ట్ ల మెడపై కత్తి పెట్టాలనుకుంటున్నారు. కేంద్రాన్ని విమర్శించడానికి ఏమాత్రం భయపడని ధ్రువ్ రాథే, రవీష్ కుమార్ లాంటి జర్నలిస్ట్ లకు ప్రాబ్లమ్స్ మొదలైనట్టే అనుకోవాలి.

లాభం ఏమిటీ?

కేంద్ర ప్రభుత్వ ప్రయత్నం మంచిదే.. ట్రోలింగ్, అబ్యూజింగ్ వంటి చెత్తకు డిజిటల్ మీడియాలో చోటు ఉండకూడదు. ఓటీటీలో బూతు కంటెంట్ ని కచ్చితంగా కంట్రోల్ చేయాల్సిందే. అంటే తప్పకుండా కంటెంట్‌కు సెన్సార్ ఉండాలి. ఇటీవల తెలుగు మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ కూడా కొన్ని యూట్యూబ్ ఛానెళ్లకు నోటీసులు పంపించడం, వాటిలో కంటెంట్ ని బ్లాక్ చేయడంలో సక్సెస్ అయింది. ప్రణీత్ హనుమంతు అనే యూట్యూబర్ ని అరెస్ట్ చేయడం కూడా కరెక్టే. కానీ వీటన్నిటికీ సైబర్ క్రైమ్ చట్టాలను ఉపయోగించుకుంటున్నారు. వాటి స్థానంలో డిజిటల్ మీడియా చట్టాలు తీసుకు రావాలనేదే కేంద్రం ఆలోచన. అయితే చట్టాల పేరుతో ఇండివిడ్యువల్ జర్నలిస్ట్ లని టార్గెట్ చేయడం మంచిది కాదు.

Related News

Uttarakhand Train: రైలు ప్రమాదానికి భారీ కుట్ర.. పట్టాలపై 6 మీటర్ల ఇనుస రాడ్

Mahalakshmi Scheme: కాంగ్రెస్ హామీని కాపీ కొట్టిన బీజేపీ

Rahul Gandhi: ఖర్గే, నడ్డాల లేఖల యుద్ధం

Toxic Workplace: వర్క్ ప్రెజర్‌ తట్టుకోలేక ప్రైవేట్ ఉద్యోగిని మృతి.. రంగంలోకి దిగిన సర్కారు

Delhi CM: ఢిల్లీ సీఎంగా అతిశీ ప్రమాణానికి డేట్ ఫిక్స్

Rahul Gandhi Vs Ravneet Bittu: జాతీయ పార్టీల అధినేతల మధ్య లేఖల యుద్ధం..

Monkeypox Case in India: భారత్‌ను వణికిస్తున్న మంకీపాక్స్.. రెండో కేసు నమోదు.

Big Stories

×