EPAPER

Tax Exemption Limits : ఈసారైనా పన్ను మినహాయింపు పరిమితి పెరుగుతుందా..?

Tax Exemption Limits : ఈసారైనా పన్ను మినహాయింపు పరిమితి పెరుగుతుందా..?
Tax Exemption Limits

Tax Exemption Limits : ఫిబ్రవరి 1న కేంద్ర ప్రభుత్వం మధ్యంతర బడ్జెట్‌ను ప్రవేశపెట్టనుంది. పన్ను మినహాయింపుల విషయంలో ఈ మధ్యంతర బడ్జెట్‌లో కొన్ని మినహాయింపులు దొరికుతాయని వేతన జీవులు ఆశగా ఎదురు చూస్తున్నారు. ముఖ్యంగా, సెక్షన్ 80C కింద మినహాయింపుల పరిమితిని పెంచాలని కోరుతున్నారు.


సెక్షన్ 80C కింద మినహాయింపుల పరిమితిని చివరిసారిగా 2014-2015 బడ్జెట్‌లో రూ.1 లక్ష నుంచి రూ.1.5 లక్షలకు సవరించారనీ, సుమారు 8 ఏళ్లుగా ఇందులో ఏ మార్పూ చేయలేదని వారు చెబుతున్నారు. ఈ ఎనిమిదేళ్లలో ద్రవ్యోల్బణం, జీవన వ్యయం బాగా పెరిగాయనీ, కనుక ఈసారి బడ్జెట్‌లో సెక్షన్ 80C కింద మినహాయింపుల పరిమితిని మరింత పెంచాలని వారు కోరుతున్నారు.

ఆదాయపు పన్ను చట్టంలో సెక్షన్ 80C ప్రకారం.. ఆదాయపు పన్నుదారులు తాము చేసిన పొదుపును బట్టి కట్టిన పన్నులో కొంత మొత్తాన్ని వెనక్కి పొందగలగటం, పన్ను చెల్లింపు మొత్తంలో కొన్ని మినహాయింపులు పొందుతున్నారు. ప్రస్తుతం పబ్లిక్‌ ప్రావిడెంట్ ఫండ్‌(పీపీఎఫ్‌), ప్రావిడెంట్ ఫండ్‌(పీఎఫ్‌), యూనిట్‌ లింక్డ్‌ ఇన్సూరెన్స్‌ ప్లాన్‌(యులిప్), ఈక్విటీ లింక్డ్‌ సేవింగ్‌ స్కీమ్‌(ఈఎల్‌ఎస్‌ఎస్‌), జీవిత బీమా ప్రీమియంలు, సుకన్య సమృద్ధి యోజన, నేషనల్‌ సేవింగ్స్‌ సర్టిఫికేట్‌ పథకాల్లో పొదుపు చేసేవారు.. ఆయా పొదుపు మొత్తాల మీద సెక్షన్ 80సి మినహాయింపు పొందుతున్నారు.


తమ వేతనాల్లో పీఎఫ్ కింద ఎక్కువ మొత్తం పోతోందనీ, హౌసింగ్ లోన్ ఈఎంఐ పోనూ, ఖర్చులకు మిగిలే మొత్తం సరిపోవడంలేదని ఉద్యోగులు చెబుతున్నారు. కనుక ప్రభుత్వం ప్రస్తుతం ఉన్న మినహాయింపు పరిమితిని రూ. 1.50 లక్షల నుంచి కనీసం రూ. 2,50,000కి పెంచితే వేతనజీవులమైన తమకు గొప్ప ఊరట లభిస్తుందని వారు కోరుతున్నారు.

Related News

Rahul Gandhi: ఖర్గే, నడ్డాల లేఖల యుద్ధం

Toxic Workplace: వర్క్ ప్రెజర్‌ తట్టుకోలేక ప్రైవేట్ ఉద్యోగిని మృతి.. రంగంలోకి దిగిన సర్కారు

Delhi CM: ఢిల్లీ సీఎంగా అతిశీ ప్రమాణానికి డేట్ ఫిక్స్

Rahul Gandhi Vs Ravneet Bittu: జాతీయ పార్టీల అధినేతల మధ్య లేఖల యుద్ధం..

Monkeypox Case in India: భారత్‌ను వణికిస్తున్న మంకీపాక్స్.. రెండో కేసు నమోదు.

Train accident in Uttar Pradesh: పట్టాలు తప్పిన మరో రైలు.. రైళ్ల రాకపోకలకు అంతరాయం

Bank Holidays: ఖాతాదారులకు బిగ్ అలర్ట్.. అక్టోబర్‌లో భారీగా సెలవులు..ఎన్ని రోజులంటే?

Big Stories

×