EPAPER

IndiGo pilot: ల్యాండింగ్‌కు ముందు పైలట్‌ కళ్లకు లేజర్‌ లైట్‌.. తృటిలో తప్పిన పెను ప్రమాదం

IndiGo pilot: ల్యాండింగ్‌కు ముందు పైలట్‌ కళ్లకు లేజర్‌ లైట్‌.. తృటిలో తప్పిన పెను ప్రమాదం
Laser light for pilot eyes before landing
Laser light for pilot eyes before landing

Laser light for pilot eyes before landing: బెంగళూరు నుంచి కోల్‌కతాకు వెళ్లే ఇండిగో విమానం టచ్‌డౌన్‌కు చేరుకునేముందు జరిగిన సంఘటనపై ఎయిర్‌లైన్స్‌ ఆందోళన వ్యక్తం చేసింది. విమానం ల్యాండింగ్‌కు కిలోమీటరు దూరంలో ఉండగా లేజర్‌ లైట్‌ కాక్‌పిట్‌లోకి వెళ్లింది. దీంతో ఆ లేజర్‌ లైట్‌ సరిగ్గా పైలట్‌ కళ్లను తాకాయి.


ఈ సంఘటన ఇండిగో విమానంలో చోటు చేసుకుంది. శుక్రవారం ఇండిగో 6E 223 విమానం బెంగళూరు నుంచి కోల్‌కతాకు బయలుదేరింది. అందులో 165 మంది ప్రయాణికులతో పాటు ఆరు మంది సిబ్బంది కూడా ఉన్నారు. సరిగ్గా సయంత్రం 7.31 గంటలకు ఈ విమానం ల్యాండ్‌ కావాల్సి ఉంది.

Read More: చరిత్ర సృష్టించిన అయోధ్య రాముడు.. నెలరోజుల్లో కోట్ల విరాళాలు


విమానం ల్యాండింగ్‌కు టచ్‌డౌన్‌ కోసం నిమిషానికి 1,500 నుంచి 2,000 అడుగుల వేగంతో రన్‌వేపై వేగంగా దిగుతుంది. అదే సమయంలో ఓ లేజర్‌ కంతి కిరణాలు విమానం కాక్‌పిట్‌లో నుంచి పైలట్‌ కళ్లలోకి వెళ్లంది. దీంతో కాసేపు పైలెట్‌ కళ్లు మసగబారిన.. సురక్షితంగా ల్యాండింగ్‌ చేశారు.

ఈ ఘటనలో ఎలాంటి ప్రమాధం జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. పైలట్‌పై జరిగిన ఈ చర్యల పట్ల ఇండిగో సిభంది విచారం వ్యక్తం చేస్తోంది. లేజర్ చొరబాట్లకు సంబంధించిన ఫిర్యాదును నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ పోలీస్ స్టేషన్‌కు పంపినట్లు విమానాశ్రయ అధికారులు తెలిపారు.

Read More: దేశంలో పొడవైన కేబుల్ బ్రిడ్జ్.. సుదర్శన్ సేతును ప్రారంభించిన మోదీ..

ఇలా ల్యాండింగ్‌ సమయంలో పైలట్‌పై లేజర్‌ లైట్లు పడటంతో చూపు కోల్పోయే అవకాశం ఉంటుంది. విమానం ల్యాండ్‌ చేయడం కూడా పెద్ద సవాళ్లుగా మరుతుంది. రెండు వైపుల నుంచి వచ్చె లేజర్‌ లైట్‌ ద్వారా విజిబిలిటీని కోల్పోతారు. దీంతో ల్యాండింగ్‌ సమయంలో పైలట్‌ క్లిష్టమైన పరిస్థితి ఎదుర్కోవాల్సి వస్తుంది.

Tags

Related News

Nipah virus: కేరళలో నిఫా వైరస్ విజృంభణ.. స్టూడెంట్ మృతి.. రాష్ట్రంలో ఆంక్షలు!

PM Modi: ఇది ట్రైలర్ మాత్రమే.. ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు నాయుడు భేటీ

yashwant Sinha: వాజ్ పేయి సిద్ధాంతాలతో.. పార్టీ పేరు ప్రకటించిన యశ్వంత్ సిన్హా

Delhi: ఢిల్లీకి తదుపరి సీఎం ఎవరు? రేసులో ఆరుగురు పేర్లు.. వీళ్లేనా?

Rajasthan Road Accident: రాజస్థాన్‌లో ట్రక్కును ఢీకొట్టిన తుఫాను.. ఎనిమిది మంది దుర్మరణం

Jammu Kashmir: గాంధీ, నెల్సన్ మండేలాతో బీజేపీ పోల్చుతున్న ఈ బుఖారీ ఎవరు?

PM Narendra Modi: మరో 6 వందే భారత్ రైళ్లు.. వర్చువల్‌గా ప్రారంభించిన ప్రధాని మోదీ

Big Stories

×