EPAPER

World Population Prospects 2024: భారత జనాభా 2060 నాటికి 170 కోట్లు..

World Population Prospects 2024: భారత జనాభా 2060 నాటికి 170 కోట్లు..

భారతదేశపు సంతానోత్పత్తి రేటు ఇప్పటికే 2020లో 2.1 రీప్లేస్‌మెంట్ స్థాయి కంటే పడిపోయిందనీ.. 2024లో అది 1.962గా ఉందని నివేదిక తెలిపింది. అందువల్ల, భవిష్యత్ జనాభా పెరుగుదల గత వృద్ధి ఫలితంగా ఉందని పేర్కొంది. ప్రపంచ జనాభా అంచనా పరిమాణంలో గత కారణాల వల్ల ప్రపంచంలోని అతిపెద్ద దేశాల్లో.. ముఖ్యంగా చైనాలో ఇటీవలి సంవత్సరాల్లో సంతానోత్పత్తి అంచనా కంటే తక్కువగా ఉందని నివేదిక పేర్కొంది. ఇక, ప్రపంచవ్యాప్తంగా పెద్ద దేశాల్లో జనాభా పెరుగుదలకు, లేదంటే తగ్గిపోయడానికి వివిధ కారణాలను నివేదిక పేర్కొంది. 2024లో గ్లోబల్ ఫెర్టిలిటీ రేటు ఒక్కో మహిళకు 2.25 జననాలు అయితే, ఇప్పుడు అన్ని దేశాలలో సగానికి కంటే ఇది తక్కువగా ఉందని తెలిపింది.


అన్ని దేశాలలో దాదాపు ఐదవ వంతులో, సంతానోత్పత్తి రేటు ఇప్పటికే 1.4 కంటే తక్కువగా ఉందని నివేదించింది. తక్కువ సంతానోత్పత్తి ఉన్న కొన్ని దేశాలలో, సంతానోత్పత్తిని పెంచడానికి ఉద్దేశించిన విధానాలు కూడా కాలక్రమేణా తగ్గుతున్నట్లు తెలుస్తోంది. 2030ల చివరి నాటికి, ఇప్పటికే అత్యధిక జనాభా ఉన్న దేశాల్లోని స్త్రీలలో సగం మంది సహజ మార్గాల ద్వారా పిల్లలను కనలేక పోతారని నివేదిక హెచ్చరించింది. దీనికి కారణం సుమారుగా, 15 నుండి 49 సంవత్సరాల మధ్య పునరుత్పత్తి వయస్సు పరిధిలోకి వచ్చే స్త్రీల వాటా పలు దేశాలలో వేగంగా తగ్గుతుందని అంచనా వేస్తున్నారు. అందుకే, కానీ 2100 నాటికి 62 దేశాలలో జనాభా పెరుగుదలకు వలసలు ప్రధాన కారణంగా ఉంటాయని అంచనా వేశారు.

ఇక, రాబోయే దశాబ్దాల్లో సంతానోత్పత్తి, ఆయుర్దాయం మెరుగుపరచాల్సిన అవసరాన్ని నివేదిక ప్రస్తావించింది. ఎందుకంటే, 1995లో 17%తో పోలిస్తే 2054లో 80 ఏళ్లు లేదా అంతకంటే ఎక్కువ వయస్సులో ప్రపంచంలోని సగానికి పైగా జనాభాకు మరణాలు సంభవించే అవకాశం ఉందని తెలిపింది.
అయితే, నివేదిక ప్రకారం, అటువంటి మరణాలు చాలా వరకు నివారించదగినవి అయినప్పటికీ అనేక ప్రాంతాలలో అధిక స్థాయి పిల్లల మరణాలు కొనసాగుతున్నాయనీ.. వాటిని అరికట్టాల్సిన ఆవశ్యకతను నివేదిక సూచించింది. డెమొక్రాటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో, ఇండియా, నైజీరియా, పాకిస్తాన్‌తో సహా జనాభా పెరుగుతున్న 126 దేశాల్లో దాదాపు 5 ఏళ్లలోపు పిల్లల మరణాలు మొత్తం 95% జరుగుతున్నట్లు నివేదిక పేర్కొంది.

Also Read: ‘కేజ్రీవాల్‌కు బెయిల్ వస్తుందని తెలిసే సిబిఐ అరెస్టు చేసింది.. అంతా రాజకీయం’

ఇక, 2011 తర్వాత పదేళ్ల జనాభా గణన లేకపోవడం వల్ల ఈ నివేదికలో ఉన్న గణాంకాలు, భారతదేశ జనాభాకు సంబంధించిన అత్యంత అధికారిక అంచనాలుగా నిపుణులు భావిస్తున్నారు. 2021 జనాభా లెక్కలు నిరవధికంగా వాయిదా పడ్డాయి. మొదట్లో మహమ్మారి కారణంగా, ఆపై ఇతర రాజకీయ కారణాలతో వాటి ప్రస్తావన వస్తున్నా.. చర్యలు మాత్రం శూన్యంగానే ఉన్నాయి. అయితే, ఐక్యరాజ్య సమితి విడుదల చేసిన ఈ జనాభా నివేదిక, భారత్‌లో జనాభా లెక్కల ఆవశ్యకతను తెలియజేస్తోందని విశ్లేషకులు చెబుతున్నారు.

 

Tags

Related News

Mahalakshmi Scheme: కాంగ్రెస్ హామీని కాపీ కొట్టిన బీజేపీ

Rahul Gandhi: ఖర్గే, నడ్డాల లేఖల యుద్ధం

Toxic Workplace: వర్క్ ప్రెజర్‌ తట్టుకోలేక ప్రైవేట్ ఉద్యోగిని మృతి.. రంగంలోకి దిగిన సర్కారు

Delhi CM: ఢిల్లీ సీఎంగా అతిశీ ప్రమాణానికి డేట్ ఫిక్స్

Rahul Gandhi Vs Ravneet Bittu: జాతీయ పార్టీల అధినేతల మధ్య లేఖల యుద్ధం..

Monkeypox Case in India: భారత్‌ను వణికిస్తున్న మంకీపాక్స్.. రెండో కేసు నమోదు.

Train accident in Uttar Pradesh: పట్టాలు తప్పిన మరో రైలు.. రైళ్ల రాకపోకలకు అంతరాయం

Big Stories

×