EPAPER

Monkeypox Case in India: భారత్‌ను వణికిస్తున్న మంకీపాక్స్.. రెండో కేసు నమోదు.

Monkeypox Case in India: భారత్‌ను వణికిస్తున్న మంకీపాక్స్.. రెండో కేసు నమోదు.

India reports second Monkey pox, man from dubai diagnosed with virus in Kerala: దేశాన్ని వణికిస్తున్న మంకీపాక్స్‌ రెండో కేసు నమోదు అయ్యింది. ఈ విషయాన్ని కేరళ ప్రభుత్వం ధృవీకరించింది. మళప్పురంకు చెందిన 38 ఏళ్ల వ్యక్తికి మంకీపాక్స్‌ వచ్చినట్లు అధికారులు చెబుతున్నారు. అతను దుబాయి నుంచి సెప్టెంబర్ 13న స్వదేశానికి వచ్చాడని.. సెప్టెంబర్ 16 నుంచి హై-ఫీవర్, శరీరంపై దద్దుర్లతో ఆస్పత్రిలో చేరినట్లు వెల్లడించారు.


అతని రక్తనమానాలను ఆస్పత్రి సిబ్బంది పరీక్షలకు పంపించగా.. కోజికోడ్ మెడికల్ కాలేజి ఆస్పత్రిలో వైరాలజీ ల్యాబ్‌లో పరీక్షలు చేశారు. మంకీపాక్స్‌ నిర్థారణ కావడంతో రోగికి మంజేరీ మెడికల్ కాలేజి ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. అతనితో పాటు విదేశాలకు వెళ్లిన కుటుంబసభ్యులు, సన్నిహితులను ఐసోలేషన్‌లో ఉండాలని ఆదేశించారు. ఏవైనా లక్షణాలు కనిపిస్తే.. వెంటనే వైద్యులను సంప్రదించాలని సూచించారు.

దుబాయి నుంచి తిరిగొచ్చిన తర్వాత సదరు వ్యక్తి.. ఎవరెవరిని కలిశారో తెలుసుకునే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు. వారిని కూడా ఐసోలేషన్‌లో ఉంచే ప్రయత్నాలను కేరళ ప్రభుత్వం చేస్తోంది. కాంటాక్ట్ ట్రేసింగ్‌లో ఇప్పటి వరకూ 16 మందిని గుర్తించి.. ఐసోలేషన్‌లో ఉంచి పరిశీలన చేస్తున్నారు. రోగి శాంపిళ్లను మరిన్ని పరీక్షల కోసం పూణెలోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ .. NIVకి పంపించారు. రక్తం, శరీర ద్రవాలు, ఇన్‌ఫెక్షన్‌కి గురైన జంతువుల ద్వారా మంకీపాక్స్ వ్యాప్తి చెందినట్లు చెబుతున్నారు.


Also Read: వణికిస్తున్న మంకీ పాక్స్.. మరో లాక్ డౌన్ తప్పదా?

అటవీ ప్రాంతాల్లో నివసించేవారికి జంతువుల నుంచి ఈ వ్యాధి వ్యాప్తి చెందే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు వైద్యులు హెచ్చరిస్తున్నారు. స్మాల్‌పాక్స్‌కు ఇచ్చే వ్యాక్సిన్‌ను ప్రపంచ వ్యాప్తంగా నిలిపివేయడంతో మనుషుల్లో ఈ తరహా వ్యాధుల పట్ల ఇమ్యూనిటీ తగ్గినట్లు గుర్తించారు. ఇదిలా ఉంటే ఇటీవల విదేశాల నుంచి బారత్ కు వచ్చిన యువకుడికి మంకీపాక్స్ సోకిన సంగతీ తెలిసిందే..
సెప్టెంబర్ 9న ఢిల్లీలో మొట్టమొదటి మంకీపాక్స్‌ కేసు నమోదైంది.

Related News

Mahalakshmi Scheme: కాంగ్రెస్ హామీని కాపీ కొట్టిన బీజేపీ

Rahul Gandhi: ఖర్గే, నడ్డాల లేఖల యుద్ధం

Toxic Workplace: వర్క్ ప్రెజర్‌ తట్టుకోలేక ప్రైవేట్ ఉద్యోగిని మృతి.. రంగంలోకి దిగిన సర్కారు

Delhi CM: ఢిల్లీ సీఎంగా అతిశీ ప్రమాణానికి డేట్ ఫిక్స్

Rahul Gandhi Vs Ravneet Bittu: జాతీయ పార్టీల అధినేతల మధ్య లేఖల యుద్ధం..

Train accident in Uttar Pradesh: పట్టాలు తప్పిన మరో రైలు.. రైళ్ల రాకపోకలకు అంతరాయం

Big Stories

×