EPAPER

Monkeypox Case in India: ఇండియాలోకి మంకీపాక్స్ ఎంట్రీ.. తొలి కేసు ఎక్కడంటే..?

Monkeypox Case in India: ఇండియాలోకి మంకీపాక్స్ ఎంట్రీ.. తొలి కేసు ఎక్కడంటే..?

Monkeypox Case in India: ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న మంకీపాక్స్‌.. భారత్‌కు కూడా వచ్చేసింది. భారత్‌లో తొలి మంకీ పాక్స్‌ కేసు నమోదైంది. విదేశాల నుంచి భారత్‌కు వచ్చిన ఓ యువకుడికి మంకీపాక్స్‌ లక్షణాలు ఉన్నట్టు అధికారులు గుర్తించారు. ఈ నేపథ్యంలో ఆ వ్యక్తికి పరీక్షలు నిర్వహించగా మంకీపాక్స్ వ్యాధి సోకినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ పేర్కొంది. బాధితుడు ప్రస్తుతం ఆసుపత్రిలో ఐసోలేషన్‌లో చికిత్స పొందుతున్నాడు. అతడి ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని ఆసుపత్రి వర్గాలు తెలియజేశాయి.


మంకీపాక్స్‌ పాజిటివ్‌గా నిర్ధారణ అయిన యువకుడు ప్రయాణంలో ఉండగా వైరస్‌ సోకినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. అతడిలో వెస్ట్‌ ఆఫ్రికన్‌ క్లేడ్‌–2 ఎంపాక్స్‌ వైరస్‌ ఉన్నట్లు గుర్తించినట్టు తెలిపింది. అయితే ఈ మంకీపాక్స్ కేసులు 2022 లో ఆగష్టు నుంచి ఇండియాలో నమోదైన కేసుల్లాంటిదేనన్ని పేర్కొంది. ప్రస్తుతం నమోదైన కేసు ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రజారోగ్య అత్యవసర పరిస్థితిగా ప్రకటించిన
క్లేడ్ -2 రకం అంత ప్రమాదం ఏమి లేదని.. ఎవరూ ఆందోళన చేందాల్సిన అవసరం లేదని వైద్యులు చెబుతున్నారు. ప్రస్తుతం బాధితుడు ఐసోలేషన్ ఉన్నాడు కనుక ఆ వ్యక్తి నుంచి ఎవరికి ఆ వ్యాధి సోకే ప్రమాదం లేదని కేంద్రం పేర్కొంది.

మంకీపాక్స్‌ పాజిటివ్‌గా నిర్ధారణ అయిన యువకుడిది హరియాణాలోని హిసార్‌ పట్టణం. 26 ఏళ్ల యువకుడు ఇటీవలే విదేశాల నుంచి తిరిగొచ్చాడు. అతడిలో ఎంపాక్స్‌ లక్షణాలు కనిపించడంతో శనివారం ఢిల్లీలోని లోక్‌నాయక్‌ జయప్రకాశ్‌ నారాయణ్‌ ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించారు. అనుమానిత ఎంపాక్స్‌ కేసుగా కేంద్ర ఆరోగ్య శాఖ ఆదివారం ప్రకటించింది. పరీక్షల అనంతరం ఎంపాక్స్‌ పాజిటివ్‌గా తేలింది. దీంతో అతడికి అదే ఆసుపత్రిలో చికిత్స కొనసాగిస్తున్నారు. మరోవైపు అనుమానిత, నిర్ధారిత ఎంపాక్స్‌ బాధితుల కోసం ఢిల్లీలో మూడు ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఐసోలేషన్‌ వార్డులు సిద్ధం చేశారు. ఎంపాక్స్‌ కేసుల చికిత్స విషయంలో లోక్‌నాయక్‌ జయప్రకాశ్‌ నారాయణ్‌ ఆసుపత్రి నోడల్‌ సెంటర్‌గా సేవలందిస్తోంది. ఇందులో 20 ఐసోలేషన్‌ రూమ్‌లు ఉన్నాయి.


Also Read: మంకీపాక్స్ కూడా ఎయిడ్స్ లాంటిదేనా? ఎలా వ్యాపిస్తుంది?

ఎంపాక్స్‌ వైరస్‌ వ్యాప్తితో ప్రజల్లో తీవ్ర ఆందోళన నెలకొంది. ఈ నేపథ్యంలో కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి అపూర్వ చంద్ర అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలను అప్రమత్తం చేశారు. అనుమానిత ఎంపాక్స్‌ కేసుల విషయంలో స్క్రీనింగ్, టెస్టింగ్‌ నిర్వహించాలని సూచించారు ఆయన. ఆసుపత్రుల్లో ఐసోలేషన్‌ రూమ్‌లు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఈ మేరకు అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు లేఖ పంపారు. ఎంపాక్స్‌పై ప్రజల్లో అనుమానాలను తొలగించాలని పేర్కొన్నారు. వైరస్‌ సోకినా ప్రాణాలకు ముప్పు ఉండదన్న సంగతి తెలియజేయాలని కోరారు.

మంకీపాక్స్‌ 1958లో డెన్మార్క్‌లో తొలిసారి కోతుల్లో వెలుగు చూసింది. 1970లో మానవుల్లో తొలిసారి గుర్తించారు. 2005లో కాంగోలో వేల సంఖ్యలో ఈ కేసులు నమోదయ్యాయి. 2017 తర్వాత నైజీరియా సహా అనేక దేశాలకు వ్యాపించింది. ఆ తర్వాత 2022 లో నుంచి మళ్లీ విపరీతంగా ఇతర దాశాలకు వ్యాప్తి చెందింది.
2022 నుంచి ఆగస్టు 2024 వరకు 120 దేశాల్లో వెలుగుచూడగా.. సుమారు లక్ష కేసులు నిర్థరణ అయ్యాయి. తాజాగా కాంగోలో ఆందోళనకర స్థాయిలో ప్రాణాంతక వైరస్‌ వ్యాపిస్తోంది.

Related News

Uttarakhand Train: రైలు ప్రమాదానికి భారీ కుట్ర.. పట్టాలపై 6 మీటర్ల ఇనుస రాడ్

Mahalakshmi Scheme: కాంగ్రెస్ హామీని కాపీ కొట్టిన బీజేపీ

Rahul Gandhi: ఖర్గే, నడ్డాల లేఖల యుద్ధం

Toxic Workplace: వర్క్ ప్రెజర్‌ తట్టుకోలేక ప్రైవేట్ ఉద్యోగిని మృతి.. రంగంలోకి దిగిన సర్కారు

Delhi CM: ఢిల్లీ సీఎంగా అతిశీ ప్రమాణానికి డేట్ ఫిక్స్

Rahul Gandhi Vs Ravneet Bittu: జాతీయ పార్టీల అధినేతల మధ్య లేఖల యుద్ధం..

Monkeypox Case in India: భారత్‌ను వణికిస్తున్న మంకీపాక్స్.. రెండో కేసు నమోదు.

Big Stories

×