EPAPER

RuPay in Maldives: మోదీతో మాల్దీవుల ప్రెసిడెంట్ భేటీ.. ఇక అక్కడా ‘RuPay’ కార్డ్

RuPay in Maldives: మోదీతో మాల్దీవుల ప్రెసిడెంట్ భేటీ.. ఇక అక్కడా ‘RuPay’ కార్డ్

India Introduced RuPay Card in Maldives: మాల్దీవుస్ కు వెళ్లేందుకు పర్యాటకులు భారీగా ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు. అక్కడి అందాల ఒడిలో ఆనందాన్ని ఆస్వాదించేందుకు టూరిస్టులు క్యూ కడుతుంటారు. ప్రపంచ వ్యాప్తంగా ఈ ప్రదేశానికి పర్యాటకులు వస్తుంటారు. ఇటు ఇండియా నుంచి కూడా పర్యాటకులు వెళ్తుంటారు. పర్యాటక రంగమే అక్కడి దేశానికి ప్రధానంగా ఆర్థిక వనరులను సమకూర్చే రంగం. అందుకే వారు పర్యాటక రంగానికి ఎక్కువగా ప్రిపరెన్స్ ఇస్తుంటారు. అయితే, గతంలో ఇండియాపై పలు వ్యాఖ్యలు చేసిన ఆ దేశ అధ్యక్షుడు.. ఆ తరువాత తన తప్పును తెలుసుకుని సారీ చెప్పిన విషయం తెలిసిందే.


అనంతరం ఇండియాతో స్నేహ సంబంధాన్ని బలం చేసుకునే దిశగా అడుగులు వేస్తుంది మాల్దీవుస్. అందులో భాగంగా ఆ దేశ అధ్యక్షుడు ముయిజ్జు ఇండియాలో పర్యటించి.. రెండు దేశాల మధ్య సత్స్య సంబంధాలపై సుదీర్ఘంగా చర్చించారు. ఇందుకు ఇండియా కూడా హామీ ఇచ్చింది. మాల్దీవుల్లో రూపే కార్డును ఇండియా ప్రవేశపెట్టింది. దీంతో అక్కడికి వెళ్లే పర్యాటకులకు డబ్బుల మార్పిడి విషయమై ఎదురయ్యే ఇబ్బందులు ఇక నుంచి ఉండవు. అదేవిధంగా ఈ రూపే కార్డును ఇంట్రడ్యూస్ చేయడంతో అక్కడి ప్రభుత్వానికి ఆర్థికంగా మేలు జరగనున్నది. దీనితోపాటు ఇరు దేశాల మధ్య సత్స్యసంబంధాలు మరింత బలపడనున్నాయి.

Also Read: ఇజ్రాయెల్ మరోసారి భీకర దాడులు.. 24 మంది మృతి.. విమానాలు రద్దు చేసిన ఇరాన్


కాగా, మాల్దీవుస్ అధ్యక్షుడు ముయిజ్జు ఇండియాలో పర్యటిస్తున్నారు. ఆయనకు ప్రధాని మోదీ స్నేహపూర్వకంగా స్వాగతం పలికారు. వీరి ఇద్దరి మధ్య పలు అంశాలపై చర్చలు కొనసాగాయి. ముఖ్యంగా రూపే కార్డు ఇంట్రడ్యూసింగ్ విషయమై చర్చించారు. ఈ సందర్భంగా ముయిజ్జు మాట్లాడుతూ సంతోషాన్ని వ్యక్తం చేశారు. ప్రస్తుతం వారు జరిపిన చర్చలతో రెండు దేశాల స్నేహ సంబంధం మరింతగా బలపడుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.

ఇదిలా ఉంటే.. ముయిజ్జు గతంలో ఇండియాపై పలు వ్యాఖ్యలు చేశారు. లక్షద్వీప్ లో ప్రధాని మోదీ పర్యటించారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను నెట్టింటా షేర్ చేశారు. ఆ సమయంలో ముయిజ్జు ఇండియాకు వ్యతిరేకంగా పలు వ్యాఖ్యలు చేశారు. దీంతో మాల్దీవుస్ కు వెళ్లే పర్యాటకుల సంఖ్య తగ్గింది. అప్పటి నుంచి తన తప్పును తెలుసుకుని సరిద్దిద్దుకునే ప్రయత్నాలను చేపట్టారు. భారత్ తో స్నేహంగా ఉండేందుకు ప్రయత్నిస్తున్న విషయం విధితమే.

Also Read: ప్రశాంతంగా ఉన్న ప్రజల జీవితాలను అల్లకల్లోలం చేసిన హామాస్-ఇజ్రాయెల్ వార్.. నేటికి ఏడాది పూర్తి

మాల్దీవుస్ లో ఇండియా రూపే కార్డును ప్రవేశపెట్టడం పట్ల టూరిస్టులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇండియా నుంచి అక్కడికి వెళ్లినప్పుడు డబ్బులు మార్పిడి విషయంలో పలు ఇబ్బందులు ఎదురయ్యేవని, కానీ, రూపే కార్డును ప్రవేశపెట్టడంతో ఆ ఇబ్బందులు ఇక ముందు ఉండవని అంటున్నారు. ఆ దేశవాసులు కూడా స్పందిస్తూ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. దీంతో తమ దేశానికి ఆర్థికంగా సపోర్టుగా ఉండడమే కాకుండా ఇరు దేశాల మధ్య మంచి సంబంధాలు కొనసాగుతాయంటున్నారు.

Related News

Mumbai Metro Line 3: ముంబై మొదటి భూగర్భ మెట్రో లైన్ 3ని ప్రారంభించిన ప్రధాని మోడీ.. ఛార్జీల వివరాలు ఇవే

Rahul Gandhi: దళితులపై ఆ వ్యాఖ్యలు చేసిన రాహుల్ గాంధీ… వైరలవుతున్న వీడియో

Arvind Kejriwal: మోదీ అలా చేస్తే.. బీజేపీ తరపున ప్రచారం చేస్తా.. కేజ్రీవాల్ సవాల్

Stampede: తొక్కిసలాటలో నలుగురు మృతి.. వందలాది మందికి గాయాలు.. ఈ తీవ్ర విషాదం ఎక్కడ జరిగిందంటే?

6 వేల మీటర్ల ఎత్తులో 3 రోజులు అరిగోస, IAF సాయంతో ప్రాణాలతో బయటపడ్డ విదేశీ పర్వతారోహకులు

hairball in stomach: 2 కేజీల తల వెంట్రుకలను మింగిన మహిళ.. ఆమెకు అది అలవాటేనంటా!

×