EPAPER

India- China: అరుణాచరల్ ప్రదేశ్ పై చైనా మొండి వాదన.. భారత్‌ కౌంటర్‌..

India- China: అరుణాచరల్ ప్రదేశ్ పై చైనా మొండి వాదన..  భారత్‌ కౌంటర్‌..
India- China
India- China

India- China: అరుణాచల్ ప్రదేశ్ పై చైనా కుట్రలు ఆగడంలేదు. దక్షిణ టిబెట్.. జాంగ్నాన్  తమదేనని మొండి వాదన చేస్తోంది. ఆ భూభాగం తమ దేనని ఆ దేశ రక్షణశాఖ అధికార ప్రతినిధి సీనియర్ ఝాంగ్ షియాంగాంగ్ అన్నారు. చైనా వాదనకు భారత్ ధీటుగా బదులిచ్చింది. అరుణాచల్ భారత్ లో అంతర్భాగమని తేల్చిచెప్పింది. ఆధారాలు లేకుండా మాట్లాడితే.. వాస్తవాలు మారవని చైనాకు బదులిచ్చింది.


జాంగ్నాన్ ప్రాంతంపై చైనా రక్షణశాఖ ప్రతినిధి చేసిన వ్యాఖ్యలను భారత్ ఖండించింది. మళ్లీ మళ్లీ చైనా నిరాధార వాదనలు చేస్తోందని మండిపడింది. జాంగ్నాన్ ప్రాంతంలో భారత్ లోనిదేనని స్పష్టం చేసింది. అక్కడ భారత్ అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టిందని పేర్కొంది. మౌలిక సదుపాయాల ప్రాజెక్టులు పూర్తి చేసిన విషయాన్ని ప్రస్తావించింది. ఈ అభివృద్ధి పనుల వల్ల జాంగ్నాన్ ప్రాంత ప్రజలకు అనేక ప్రయోజనాలు కలుగుతున్నాయని భారత్ విదేశాంగశాఖ అధికార ప్రతినిధి రణ్‌ధీర్‌ జైస్వాల్‌ ప్రకటించారు.

భారత్-చైనా సరిహద్దు ప్రాంతంలో సేలా సొరంగ మార్గాన్ని ఇటీవల ప్రధాని మోదీ ప్రారంభోత్సవం చేశారు. అక్కడికి సైనిక బలగాలు, ఆయుధాలను తీసుకెళ్లేందుకు ఈ మార్గం ఉపయోగపడుతోంది. ఈ నేపథ్యంలో చైనా మొండి వాదనలు మొదలుపెట్టింది.


Also Read :  సీఏఏ అమలును వ్యతిరేకిస్తూ పిటిషన్లు .. కేంద్రానికి సుప్రీంకోర్టు నోటీసులు..

ఆ సమయంలోనూ భారత్ పై డ్రాగన్ విమర్శలు చేసింది. ఆ భూభాగం తమదేనని వాదించింది. భారత్ చర్యలు సరిహద్దు వివాదాన్ని మరింత సంక్లిష్టంగా మార్చేస్తాయని విమర్శలు చేసింది. ఆ సమయంలోనూ భారత్ గట్టిగా సమాధానం చెప్పింది.

Tags

Related News

Rahul Gandhi: ఖర్గే, నడ్డాల లేఖల యుద్ధం

Toxic Workplace: వర్క్ ప్రెజర్‌ తట్టుకోలేక ప్రైవేట్ ఉద్యోగిని మృతి.. రంగంలోకి దిగిన సర్కారు

Delhi CM: ఢిల్లీ సీఎంగా అతిశీ ప్రమాణానికి డేట్ ఫిక్స్

Rahul Gandhi Vs Ravneet Bittu: జాతీయ పార్టీల అధినేతల మధ్య లేఖల యుద్ధం..

Monkeypox Case in India: భారత్‌ను వణికిస్తున్న మంకీపాక్స్.. రెండో కేసు నమోదు.

Train accident in Uttar Pradesh: పట్టాలు తప్పిన మరో రైలు.. రైళ్ల రాకపోకలకు అంతరాయం

Bank Holidays: ఖాతాదారులకు బిగ్ అలర్ట్.. అక్టోబర్‌లో భారీగా సెలవులు..ఎన్ని రోజులంటే?

Big Stories

×