EPAPER

INDIA Bloc Maharally: లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ మ్యాచ్ ఫిక్సింగ్.. ధనిక మిత్రులతో కలిసి మోదీ నిర్ణయం: రాహుల్ గాంధీ

INDIA Bloc Maharally: లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ మ్యాచ్ ఫిక్సింగ్.. ధనిక మిత్రులతో కలిసి మోదీ నిర్ణయం: రాహుల్ గాంధీ

INDIA Bloc Maharally INDIA Bloc Maharally: ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ అరెస్ట్ కు నిరసనగా విపక్ష ఇండియా కూటమి మెగా ర్యాలీని నిర్వహించింది. బీజేపీ, దాని మాతృసంస్థ ఆరెస్సెస్ పై కాంగ్రెస్ పార్టీ జాతీయాధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఘాటు వ్యాఖ్యలు చేశారు. దేశంలో బీజేపీ నియంత పాలన కొనసాగిస్తోందన్నారు. బీజేపీ ఆరెస్సెస్ విషం లాంటివని.. దాన్ని రుచి చేస్తే చచ్చిపోతారని ప్రజలను హెచ్చరించారు. అలాంటి బీజేపీకి ఓటు వేస్తే ప్రాణలమీదకి తెచ్చుకున్నట్లే అని అన్నారు.


కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ చైర్‌పర్సన్ సోనియా గాంధీ, కాంగ్రెస్ కీలక నేత రాహుల్ గాంధీ, మహారాష్ట్ర మాజీ సీఎం ఉద్ధవ్ ఠాక్రే, శివసేన ఎంపీ సంజయ్ రౌత్, ఎన్ సీపీ చీఫ్ శరద్ పవార్ వంటి కీలక నేతలు ఈ ‘లోక్తంత్ర బచావో ర్యాలీ’లో పాల్గొన్నారు. వీరితో పాటుగా కేజ్రీవాల్ సతీమణి సునీతా కేజ్రీవాల్ సహా భారత కూటమికి చెందిన నేతలంతా పాల్గొన్నారు.

ఈ మెగా ర్యాలీలో బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న తీరుపై కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే మండిపడ్డారు. రాంలీలా మైదానంలో మాట్లాడిన ఆయన భిన్నత్వంలో భిన్నత్వంలో ఏకత్వానికి ఇది వేదిక అని అన్నారు. మన భిన్నత్వంలో ఏకత్వం ఉంది, అందుకే ఈ ర్యాలీని నిర్వహించాం. దీని కోసం నేను మా భాగస్వాములందరికీ ధన్యవాదాలు. ఈ సమావేశానికి ఒకే ఒక లక్ష్యం ఉంది, అది ప్రతిపక్షాలను ఏకం చేయడమ అని ఖర్గే వెల్లడించారు.


ఆమ్ ఆద్మీ పార్టీని బెదిరించేందుకు మోదీ ప్రభుత్వ సంస్థలను వినియోగిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతిపక్ష పార్టీలను, నాయకులను బెదిరించి రాష్ట్రాల్లో బీజేపీ ప్రభుత్వాలను ఏర్పాటు చేసేందుకు ప్రధాని మోదీ సంస్థలను దుర్వినియోగం చేస్తున్నారని ఖర్గే మోదీపై ఫైర్ అయ్యారు.

MP ఎన్నికల్లో మోదీ మ్యాచ్ ఫిక్సింగ్: రాహుల్ గాంధీ
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ మాట్లాడుతూ మోదీ లోక్ సభ ఎన్నికల్లో మ్యాచ్ ఫిక్సింగ్ చేసేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపణలు చేశారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన అకౌంట్లను ఫ్రీజ్ చేశారని తెలిపారు. అలాగే నాయకులను అరెస్ట్ చేయడం ద్వారా ఎన్నికల్లో గెలవడానికి చూస్తున్నారని విమర్శించారు. మోదీ ఒక్కరే ఈ నిర్ణయం తీసుకోరు అని.. తన ఐదుగురు ధనిక మిత్రులతో కలిసి ఈ నిర్ణయం తీసుకుంటారని ఫైర్ అయ్యారు.

Also Read: Congress Party: మరో నోటీసు.. రూ. 1,745 కోట్లు కట్టాలని కాంగ్రెస్‌కు ఐటీ సమన్లు

రాజ్యాంగాన్ని కాపడడం కోసమే తాము పోరాటం చేస్తున్నామని అన్నారు. బీజేపీ పాలనలో ధనికులు.. ధనికులు గానే, పేదవారు.. పేదవారిగానే ఉంటున్నారని మండిపడ్డారు. మోదీకి దేశంలో 180 సీట్లు కూడా రావు. మోదీ మాత్రం 400 సీట్లు వస్తాయని ప్రచారం చేస్తున్నారు. ఇది ఓ రకంగా మ్యాచ్ ఫిక్సింగ్ లాంటిదే. ఈడీ, సీబీఐ, ఐటీ వంటి ప్రభుత్వ సంస్థలను మోదీ అడ్డం పెట్టుకున్నారని అన్నారు.

ఇండియా కూటమి 5 డిమాండ్లు ఇవే..
ఈ సమావేశంలో మాట్లాడిన ప్రియాంక గాంధీ వాద్రా.. ఇండియా కూటమికి 5 ప్రత్యేక డిమాండ్లు ఉన్నాయన్నారు.
1. ఎన్నికల సంఘం లోక్‌సభ ఎన్నికల్లో సమాన అవకాశాలు కల్పించాలి.
2. ఈసీఐ వారిపై బలవంతపు చర్యలు నిలిపివేయాలి.
3. ఈడీ, సీబీఐ, ఐటీలు వెంటనే హేమంత్ సోరెన్, అరవింద్ కేజ్రీవాల్‌ను విడుదల చేయాలి.
4. ప్రతిపక్షాలను ఆర్థికంగా బలహీన పరిచే ప్రయత్నాలు ఆపాలి.
5. ఎలక్టోరల్ బాండ్ల ద్వారా బీజేపీ సేకరించిన నిధులపై సిట్ దర్యాప్తు ఏర్పాటు చేయాలి.

దేశవ్యాప్తంగా కేజ్రీవాల్ 6 హామీలు అమలు చేస్తాం: సునీతా
వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ కూటమి అధికారంలోకి వస్తే కేజ్రీవాల్ తీసుకువచ్చిన ఆరు హామీలను అమలు చేస్తామని సునీతా కేజ్రావాల్ అన్నారు. దేశవ్యాప్తంగా 24 గంటల విద్యుత్, దేశంలో పేదలకు ఉచిత విద్యుత్, ప్రతి గ్రామానికి ప్రభుత్వ పాఠశాల, వైద్య క్లినిక్ లు, స్వామినాథన్ కమిటీ నివేదిక ప్రకారం రైతులకు మద్దతు ధర అందిస్తామని కేజ్రీవాల్ ఇచ్చిన హామీలను ఆమె వెల్లడించారు. 75 ఏళ్లలో ఎన్నిడూ లేని విధంగా ఢిల్లీ ప్రజలు అన్నాయాన్ని ఎదుర్కొంటున్నారని అన్నారు. తాము ఓట్లు అడగడం లేదని నవ భారత నిర్మాణం కోసం 140 కోట్ల మంది భారతీయులను తాము ఆహ్వానిస్తున్నామన్నారు. తాము అధికారంలోకి వస్తే ఢిల్లీని పూర్తి స్థాయి రాష్ట్రంగా తీర్చిదిద్దుతాం అని తెలిపారు.

Related News

Minister Comments: బ్రేకింగ్ న్యూస్.. వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన మంత్రి.. తన కూతురు – అల్లుడిని నదిలో తోసేయండంటూ..

Amit Shah: ఆ విషయంలో.. పాక్‌తో చర్చలు జరిపే ఆలోచనే లేదు: అమిత్ షా

No Doctors For Jails: 5600 మంది ఖైదీలకు ఒక డాక్టర్.. జైళ్లలో నేరస్తుల ఆరోగ్యంపై నిర్లక్ష్యమా?..

Uttar Pradesh Wolf Attacks: యూపీలో తోడేళ్ల విధ్వంసం.. 8 మంది మృతి.. మంత్రి వింత వాదన!

Kolkata Rape Case CBI: కోల్‌కతా రేప్ నిందితుడికి బెయిల్?.. సిబిఐ నిర్లక్ష్యం.. మండిపడిన మమతా పార్టీ!

Jammu and Kashmir Assembly Polls: జమ్మూకాశ్మీర్ బీజేపీ ఎన్నికల మేనిఫెస్టో విడుదల

Mumbai times tower: ముంబై.. మంటల్లో టైమ్స్ టవర్, భారీగా నష్టం

Big Stories

×