EPAPER

Budget 2024: దేశ చరిత్రలో అతి ముఖ్యమైన బడ్జెట్లు.. డ్రీమ్ బడ్జెట్, బ్లాక్ బడ్జెట్, ఎపోచల్ బడ్జెట్ వివరాలు

Budget 2024: దేశ చరిత్రలో అతి ముఖ్యమైన బడ్జెట్లు.. డ్రీమ్ బడ్జెట్, బ్లాక్ బడ్జెట్, ఎపోచల్ బడ్జెట్ వివరాలు

Important Budget’s from 1947 to 2024(Today’s news in telugu): కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ రేపు జూలై 23న పార్లమెంటు 2024-25 ఆర్థిక సంవత్సరానికి గాను పూర్తి స్థాయి బడ్జెట్ సమర్పించనున్నారు. నిర్మలా సీతారామన్ ఏడవ సారి పూర్తి స్థాయి బడ్జట్‌ను ప్రవేశపెట్టబోతున్నారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో ఎన్డీయే కూటమి అధికారంలోకి వచ్చిన తరువాత ప్రవేశ పెట్టబోయే తొలి పూర్తి స్థాయి బడ్జెట్ కూడా ఇదే. రికార్డుల విషయంలో అతిముఖ్యమైన బడ్జెట్లు మన దేశ చరిత్రలో కొన్ని ఉన్నాయి. దేశ ఆర్థిక స్థితిని మలుపు తిప్పిన కీలక బడ్జెట్లుగా వీటికి పేరుంది. వాటి వివరాలు మీ కోసం.


స్వాతంత్య్రం తరువాత తొలి కేంద్ర బడ్జెట్ – 1947
స్వతంత్ర భారత దేశంలో తొలిసారి ఆర్ కె షన్ముఖమ్ పార్లమెంటులో బడ్జెట్ ప్రవేశపెట్టారు. అయితే ఈ బడ్జెట్ కేవలం ఏడున్నర అతి తక్కువ కాలం పరిమితి కోసం సమర్పించారు. ఆగస్టు 15, 1947 నుంచి మార్చి 31 1948 మధ్య కాలం కోసం ఈ బడ్జెట్ ను రూపొందించారు. దేశ తొలి బడ్జెట్ కావడంతో అప్పుడే విభజన జరిగిన పాకిస్తాన్ కు కూడా ఇందులో వాటా ఉంది. సెప్టెంబర్ 1948 వరకు పాకిస్తాన్, ఇండియా రెండు దేశాలు ఒకే కరెన్సీని ఉపయోగించాయి. ఈ చిన్న బడ్జెట్ లో దేశ విభజన తరువాత ఎదురయ్యే ఆర్థిక సవాళ్లపై రెండు దేశాల నాయకులు దృష్టి సారించారు.

బ్లాక్ బడ్జెట్ – 1973
1973-74 ఆర్థిక సంవత్సరానికి గాను ప్రధాన మంత్రి ఇందిరా గాంధీ నాయకత్వంలో యశ్వంత్ బి చవాన్ ఈ బడ్జెట్‌ ను పార్లమెంటులో సమర్పించరు. బడ్జెట్ లో హై ఫిస్కల్ డెఫిసిట్ (లోటు బడ్జెట్) ఉండడంతో దీన్ని బ్లాక్ బడ్జెట్ అని పేరు పెట్టారు. దేశంలో అప్పుడు ఆర్థిక మాంద్యం పరిస్థితులున్నాయి. ఈ బడ్జెట్ మొత్తం విలువ రూ.550 కోట్లు. ఆ సమయంలో ఇది చాలా పెద్ద మొత్తం.


క్యారెట్ అండ్ స్టిక్ బడ్జెట్ – 1986
1986లో ఆర్థిక మంత్రి విపి సింగ్ క్యారెట్ అండ్ స్టిక్ బడ్జెట్ పేరుతో కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టారు. ఈ బడ్జెట్ లో దేశ ఆర్థికాభివృద్ధి కోసం పరిశ్రమలకు పుష్కలంగా ప్రోత్సాహకాలు ప్రకటించారు. అందుకే దీన్ని క్యారెట్ బడ్జెట్ అని పిలిచారు. మరోవైపు దేశంలో పెరిగిపోతున్న పన్ను ఎగవేతదారులు, బ్లాక్ మనీ కేసులను అరికట్టడానికి కఠినమైన చట్టాలను తీసుకువచ్చారు. అందుకే స్టిక్ బడ్జెట్.. అంటే కర్రతో శిక్షించే విధంగా పేరు పెట్టారు. ఈ బడ్జెట్ కు చాలా ప్రాముఖ్యత ఉంది. దేశంలో తొలిసారి మాడిఫైడ్ వ్యాల్యూ యాడెడ్ ట్యాక్స్ విధానాన్ని ఈ బడ్జెట్ ద్వారానే తీసుకువచ్చారు. దీనివల్ల తయారీ రంగానికి చాలా లాభం కలిగింది. దేశంలో ఉన్న లైసెన్స్ రాజ్ విధానాన్ని తొలగించేందుకు తొలిప్రయత్నం కూడా ఈ బడ్జెట్ ద్వారా అప్పటి కేంద్రం చేసింది. పన్ను ఎగవేతదారులు, బ్లాక్ మార్కెట్, స్మగలర్లను అణచివేసేందుకు కఠిన చట్టాలు చేశారు.

ఎపోచల్ బడ్జెట్ – 1991
భారత దేశ ఖజానాలో మరో రెండు వారాలు సరిపడ ధనం మాత్రమే ఉన్న సమయంలో ప్రధాన మంత్రి పివి నర్సింహా రావు.. ఆర్థిక మంత్రిగా మన్హోహన్ సింగ్ ని నియమించారు. ఆర్థికవేత్తల్లో మహామేధావి అయిన మన్హోహన్ సింగ్ ఆ కష్టసమయంలో మన దేశాన్ని తన నైపుణ్యంతో గట్టెక్కించారు. 1991 లో మన్హోహన్ సింగ్ ప్రవేశ పెట్టిన బడ్జెట్ నే ఎపోచల్ బడ్జెట్ అని అంటారు. ఈ బడ్జెట్ లోని కొత్త విధానాలతో దేశం ఆర్థికంగ పురుగులు పెట్టింది. ఇప్పటివరకు దేశ చరిత్రలో ఈ బడ్జెట్ కు ఎక్కువ ప్రాముఖ్యం ఉండడంతో దీన్ని ఎపోచల్ (చాలా ముఖ్యమైనది) బడ్జెట్ అని పేరు పెట్టారు. ఈ బడ్జెట్ లో అప్పటి ఆర్థిక మంత్రి మన్మోహన్ సింగ్ ఓపెన్ మార్కెట్ విధానాన్ని తీసుకువచ్చారు. దేశంలో కీలక ఆర్థిక సంస్కరణలు చేశారు. ఎగుమతులను ప్రోత్సహించేందుకు ఇండియన్ కరెన్సీ విలువను తగ్గించి, వ్యాపారాలు చేసుకునేందుకు సరళంగా అనుమతులు లభించే విధానం ప్రవేశపెట్టారు. దిగుమతులపై పన్నులు కూడా తగ్గించారు. ఫలితంగా దేశంలో విదేశీ పెట్టుబడుల వర్షం కురిసింది.

డ్రీమ్ బడ్జెట్ – 1997
1997-98 ఆర్థిక సంవత్సరానికి గాను కేంద్ర బడ్జెట్ ను పి. చిదంబరం ప్రవేశపెట్టారు. దేశంలో పన్నుల శాతాన్ని భారీ తగ్గించడంతో ఈ బడ్జెట్ కు డ్రీమ్ బడ్జెట్ అని పేరు పెట్టారు. ఇలాంటి బడ్జెట్ మళ్లీ రావాలని ప్రజలు ఎన్నో సార్లు కోరుకున్నారు. ఈ బడ్జెట్ ఆదాయపు పన్నులు, కార్పొరేట్ పన్నులు, కార్పొరేట్ పన్ను సర్చార్జీలు భారీగా తగ్గించడంతోపాటు చాలా ఆర్థిక సంస్కర్ణలు చేశారు. అంతకుముందు సంపన్నులపై విధించే 40 శాతం ఆదాయపు పన్నుని 30 శాతానికి తగ్గించారు. దేశీయ కంపెనీలకు కూడా 35 శాతం పన్నులు విధించారు. ప్రజల వద్ద లెక్కల్లో చూపని బ్లాక్ మనీ ఉంటే స్వచ్ఛందంగా ముందుకు రావాలని వాలంటరీ పథకం ప్రవేశపెట్టారు. కస్టమ్స్ డ్యూటీని 40 శాతానికి తగ్గించి, ఎక్సైజ్ డ్యూటీ విధానాన్ని సరళీకృతం చేశారు.

Also Read: కొత్త బడ్జెట్‌లో ఆదాయపు పన్ను పరిమితి పెరుగబోతోందా?.. పాత లేదా కొత్త టాక్స్ స్లాబ్‌లో ఏది ఉచితం?

మిల్లీనియం బడ్జెట్ – 2000
ఆర్థిక మంత్రి యశ్వంత్ సిన్హా 2000 సంవత్సరంలో ఇన్‌ఫర్మెషన్ టెక్నాలజీపై కేంద్రీ కరిస్తూ ఈ బడ్జెట్‌ను తీసుకువచ్చారు. దేశంలో ఐటి, టెలికమ్యూనికేషన్స్ రంగాలను ప్రోత్సహించే విధంగా ఈ బడ్జెట్ ను రూపొందించారు. భారతదేశంలో తయారు చేసే కంప్యూటర్స్, కంప్యూటర్ యాక్సెసరీస్ విదేశాలకు ఎగుమతులు చేసేందుకు వీలు కల్పిస్తూ.. వాటిపై అతితక్కువ కస్టమ్స్ డ్యూటీ విధించారు. పైగా మన దేశం నుంచి విదేశాలు సాఫ్ట్ వేర్ సేవలు ఎగుమతి చేసేందుకు ప్రోత్సహించిన బడ్జెట్ ఇదే.

రోల్ బ్యాక్ బడ్జెట్ – 2002
ఎన్డీయే ప్రభుత్వంలో ఆర్థిక మంత్రి యశ్వంత్ సిన్హా ప్రవేశ పెట్టిన మరో కీలక బడ్జెట్ ఇది. 2002-03 ఆర్థిక సంవత్సరానికి గాను ఈ బడ్జెట్ రూపొందించారు. ఈ బడ్జెట్ లో అంతకుముందు అమలలో ఉన్న చాలా ప్రభుత్వ పాలసీలను ఉపసంహరించుకున్నారు. దీంతో ఈ బడ్జెట్ కు రోల్ బ్యాక్ బడ్జెట్ అని పేరు పెట్టారు. ఆ సమయంలో అటల్ బిహారీ వాజ్ పేయి ప్రధాని మంత్రిగా ఉన్నారు.

రైల్వే మర్జెర్ బడ్జెట్ – 2017
2017లో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ఈ బడ్జెట్‌ను ప్రవేశ పెట్టారు. అప్పటివరకు ఆనవాయితీగా ఫిబ్రవరి నెల చివరి రోజున బడ్జెట్ ప్రవేశ పెట్టేవారు. కానీ 2017 నుంచి ఫిబ్రవరి 1 నుంచి బడ్జెట్ ప్రవేశ పెట్టడం మొదలు పెట్టారు. అదనంగా బడ్జెట్ సంప్రదాయాలలో రైల్వే బడ్జెట్ ను ప్రత్యేకంగా ప్రకటించేవారు. కానీ 2017లో తొలిసారి కేంద్ర జెనరల్ బడ్జెట్ లోనే రైల్వేబడ్జెట్‌‌ని విలీనం చేశారు. అందుకే ఈ బడ్జెట్ కు రైల్వే మర్జర్.. రైల్వే విలీన బడ్జెట్ అని పేరు పెట్టారు. నోట్ల రద్దు తరువాత జరిగిన తొలి బడ్జెట్ కూడా ఇదే.

వన్స్ ఇన్ ఏ సెంచురీ బడ్జెట్ (శతాబ్ద బడ్జెట్)
2021 సంవత్సరంలో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశ పెట్టిన బడ్జెట్ ని వన్స్ ఇన్ ఏ సెంచరీ బడ్జెట్ అని అంటారు. దేశంలో వైద్యరంగం, ఇన్‌ప్రాస్ట్రక్చర్ రంగంలో పెట్టుబడులను ప్రోత్సహించే విధంగా, అలాగే ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటు పరం చేయడానికి వీలు కల్పిండానికి ఆర్థిక సంస్కరణలు చేసిన బడ్జెట్ ఇది.

Also Read: మొరార్జీ దేశాయ్ పేరున ఎక్కువసార్లు ఆర్థిక బడ్జెట్ ప్రవేశపెట్టిన రికార్డ్.. త్వరలో ఆ రికార్డు బ్రేక్!

 

 

 

Related News

Mahalakshmi Scheme: కాంగ్రెస్ హామీని కాపీ కొట్టిన బీజేపీ

Rahul Gandhi: ఖర్గే, నడ్డాల లేఖల యుద్ధం

Toxic Workplace: వర్క్ ప్రెజర్‌ తట్టుకోలేక ప్రైవేట్ ఉద్యోగిని మృతి.. రంగంలోకి దిగిన సర్కారు

Delhi CM: ఢిల్లీ సీఎంగా అతిశీ ప్రమాణానికి డేట్ ఫిక్స్

Rahul Gandhi Vs Ravneet Bittu: జాతీయ పార్టీల అధినేతల మధ్య లేఖల యుద్ధం..

Monkeypox Case in India: భారత్‌ను వణికిస్తున్న మంకీపాక్స్.. రెండో కేసు నమోదు.

Train accident in Uttar Pradesh: పట్టాలు తప్పిన మరో రైలు.. రైళ్ల రాకపోకలకు అంతరాయం

Big Stories

×