EPAPER

IC 814 The Kandahar Hijack| ఆ కిడ్నాపర్ నాకు పుట్టినరోజు గిఫ్ట్ ఇచ్చాడు: IC 814 విమానం హైజాక్ ప్యాసింజర్

IC 814 The Kandahar Hijack| ఆ కిడ్నాపర్ నాకు పుట్టినరోజు గిఫ్ట్ ఇచ్చాడు: IC 814 విమానం హైజాక్ ప్యాసింజర్

IC 814 Passenger| నెట్ ఫ్లిక్స్ ఓటీటీ లో ‘IC 814 కాంధహార్ హైజాక్’ వెబ్ సిరీస్ పై వివాదం నడుస్తున్న సమయంలో ఆ విమానంలో హైజాక్ అయిన ఒక ప్రయాణీకురాలు ఒక షాకింగ్ తెలిపింది. చండీగడ్ కు చెందిన ఓ మహిళ తనకు 1999లో కొత్తగా పెళ్లి అయిన తరువాత తన భర్తతో నేపాల్ కు హనీమూన్ కు వెళ్లింది. నేపాల్ రాజధాని కాఠ్మాండు నుంచి ఢిల్లీకి తిరుగు ప్రయాణం కోసం IC 814 విమానంలో వస్తున్న సమయంలో హైజాక్ జరిగింది. ఆ సమయంలో తనకు ఎదురైన అనుభవాన్ని ఆమె తాజాగా మీడియాతో పంచుకున్నారు.


చండీగడ్ కు చెందిన పూజా కటారియా తన భర్తతో డిసెంబర్ 24, 1999న కాఠ్మాండు త్రిభువన్ అంతర్జాతీయ ఎయిర్ పోర్ట్ నుంచి తిరిగి వస్తున్న సమయంలో విమానం హైజాక్ అయింది. ఆ విమానంలో మొత్తం 26 మంది కొత్త గా పెళ్లి అయిన జంటలున్నారు. అయితే వారంతా విమాన ప్రయాణం మొదలుపెట్టిన అరగంట తరువాత అయిదు మంది టెర్రరిస్టులు విమానాన్ని హైజాక్ చేశారు. ప్రయాణీకుల్లో ఒకరిని టెర్రరిస్టులు కాల్చి చంపారు.

‘నాకు ఆ టెర్రరిస్ట్ ఒక శాలువని కానుకగా ఇచ్చాడు’


ఆ విమానంలో ప్రయాణిస్తున్న పూజా కటారియా అనే చండీగడ్ మహిళ ఇటీవల మీడియా ఇంటర్‌వ్యూలో మాట్లాడారు. తనకు పుట్టినరోజు కానుకగా విమానాన్ని హైజాక్ చేసిన ఒక టెర్రరిస్ట్ శాలువ ఇచ్చాడని ఆమె తెలిపింది. విమానంలోని అయిదుగురు టెర్రరిస్టులు మారు పేర్లతో ఒకరిని మరొకరు పిలుచుకునేవారు. వారిలో ఒక టెర్రరిస్ట్ మారుపేరు ‘బర్గర్’. ఆ బర్గర్ అనే ఉగ్రవాదితో పూజా మాట్లాడింది. మరుసటి రోజు తన పుట్టినరోజు అని, తాము అమాయకులమని తమని వదిలేయవని పూజా.. టెర్రరిస్ట్ బర్గర్ తో ప్రాధేయపడుతూ చెప్పింది.

అప్పుడు ఆ బర్గర్ టెర్రరిస్టు.. ‘సోదరి నీ పుట్టిన రోజు కానుకగా నా తరపున ఈ శాలువ తీసుకో. నువ్వు తప్పకుండా ఇంటికి చేరుకుంటావు’ అని చెబుతూ ఆమెకు శాలువ కానుకగా ఇచ్చాడని పూజా తెలిపింది. ”ఇప్పటికీ ఆ శాలువ తన వద్ద ఉంది. ఆ శాలువ నేను ఒక గుర్తుగా భద్రంగా దాచిపెట్టాను. చాలామంది నన్ను ఆ శాలువ తీసుకున్నందుకు ఎగతాళి చేస్తున్నారు.” అని పూజా చెప్పింది.

Also Read: హర్యాణా ఎన్నికల బరిలో వినేశ్ ఫోగట్, బజరంగ్ పునియా.

అయితే ‘IC 814 కాంధహార్ హైజాక్’ వెబ్ సిరీస్ వివాదం పై ఆమె స్పందిస్తూ.. ”అది ఒక ఎంటర్ టైన్మెంట్ కోసం చేసిన సినిమా. అందులో వివాదాస్పదంగా స్పందించాల్సినది ఏమీ లేదు. అయినా భారత ప్రభుత్వం సరైన సమయంలో సైనిక చర్య తీసుకొని ఉంటే ఆ విమానం ఇండియా దాటి వెళ్లేది కాదేమో” అని ఆమె అభిప్రాయపడింది.

నెట్ ఫ్లిక్స్ ఓటీటీ లో ‘IC 814 కాంధహార్ హైజాక్’ వెబ్ సిరీస్ విమానం హైజాక్ చేసిన అయిదుగురు టెర్రరిస్టులలో ఇద్దరి మారుపేర్లు హిందు దేవతల పేర్లను పోలిఉండడంతో వివాదం తలెత్తింది. దీనిపై ఆ సమయంలో విమాన చీఫ్ సిబ్బంది స్పందిస్తూ.. ”ఇందులో వివాదాస్పదం చేయాల్సిన విషయమేమీ లేదు. ఆ ఉగ్రవాదులు కావాలనే ఆ మారుపేర్లను ఉపయోగించారు. వెబ్ సిరీస్ లో అలానే చూపించారు. ఏమైనా ఉంటే ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది కదా!” అని అన్నారు.

Related News

Mahalakshmi Scheme: కాంగ్రెస్ హామీని కాపీ కొట్టిన బీజేపీ

Rahul Gandhi: ఖర్గే, నడ్డాల లేఖల యుద్ధం

Toxic Workplace: వర్క్ ప్రెజర్‌ తట్టుకోలేక ప్రైవేట్ ఉద్యోగిని మృతి.. రంగంలోకి దిగిన సర్కారు

Delhi CM: ఢిల్లీ సీఎంగా అతిశీ ప్రమాణానికి డేట్ ఫిక్స్

Rahul Gandhi Vs Ravneet Bittu: జాతీయ పార్టీల అధినేతల మధ్య లేఖల యుద్ధం..

Monkeypox Case in India: భారత్‌ను వణికిస్తున్న మంకీపాక్స్.. రెండో కేసు నమోదు.

Train accident in Uttar Pradesh: పట్టాలు తప్పిన మరో రైలు.. రైళ్ల రాకపోకలకు అంతరాయం

Big Stories

×