EPAPER

Holi Celebrations in Ayodhya : 500 ఏళ్ల తర్వాత అయోధ్యలో హోలీ వేడుకలు.. ముస్తాబవుతున్న రామాలయం

Holi Celebrations in Ayodhya : 500 ఏళ్ల తర్వాత అయోధ్యలో హోలీ వేడుకలు.. ముస్తాబవుతున్న రామాలయం

Holi Celebrations in Ayodhya


Holi Celebrations in Ayodhya after 500 Years (latest today news in india) : ఐదువందల ఏళ్ల తర్వాత.. అయోధ్యలో హోలీ పూర్ణిమ వేడుకలు ఘనంగా జరగనున్నాయి. ఈ వేడుకలు చరిత్రలో నిలిచిపోనున్నాయి. మార్చి 25వ తేదీన జరగబోయే హోలీ వేడుకలకు అయోధ్య రామాలయం ముస్తాబవుతోంది. ఆ రోజున ఆలయానికి విచ్చేసే భక్తులంతా.. బాలురామునితో కలిసి హోలీ వేడుకలు జరుపుకోనున్నారు. ఈ పర్వదినం రోజున ఆలయ కమిటీ.. రామ్ లల్లా కు 56 రకాల వంటకాలను నైవేద్యంగా సమర్పించనున్నారు. ఈ నైవేద్యాన్ని భక్తులకు ప్రసాదంగా పంచిపెట్టనున్నారు.

రామమందిరంలో హోలీ వేడుకలపై ట్రస్ట్ కార్యాలయ ఇన్ చార్జి ప్రకాష్ గుప్తా మీడియాతో మాట్లాడుతూ.. అయోధ్య అంతటా ఆనందోత్సాహం నెలకొందని తెలిపారు. హోలీ వేడుకల నిర్వహణకు రామమందిర ట్రస్ట్ సన్నాహాలు చేస్తుందన్నారు. హోలీ వేడుకల నేపథ్యంలో ఇక్కడ సాంస్కృతిక కార్యక్రమాలు కూడా నిర్వహించనున్నారు.


Also Read : భయాలను తీర్చే అరగొండ సంజీవరాయుడు..

కాగా.. అయోధ్య రామమందిరం నిర్మాణానికి 2020, ఆగస్టు 5న మధ్యాహ్నం 12 గంటల 44 నిమిషాల 40 సెకన్లకు శంకుస్థాపన చేశారు. ఈ ఏడాది జనవరి 22న ప్రధాని నరేంద్రమోదీ ఆలయాన్ని ప్రారంభించి, రామ్ లల్లా విగ్రహానికి ప్రాణప్రతిష్ట చేశారు. ప్రారంభోత్సవం జరిగిన మరునాటి నుంచీ నేటి వరకూ రామ్ లల్లాను దర్శించుకునేందుకు భక్తులు పెద్దసంఖ్యలో తరలి వస్తున్నారు.

2.77 ఎకరాల విస్తీర్ణంలో ఆలయ నిర్మాణాన్ని పూర్తి చేశారు. 70 ఎకరాల వరకూ విస్తరించి ఉన్న ఆలయంలో 5 మండపాలు, 12 ద్వారాలు ఉన్నాయి. ఇంకా యజ్ఞశాల, అనుస్థాన మండపం, వీర్ మారుతి విశాల్ ప్రతిమ, జన్మభూమి సంగ్రహాలయ, సత్సంగ్ భవన్ సభాగర్, పరిశోధన కోసం అధ్యయన కేంద్రం, ప్రత్యేక శాంతి క్షేత్రం, రాంలీలా సెంటర్/ ఓపెన్ థియేటర్, మల్టీఫంక్షనల్ కమ్యూనిటీ సెంటర్, ఎగ్జిబిషన్ సెంటర్, రామంగన్ షో థియేటర్, లైబ్రరీ, వాల్మీకి రీసెర్చ్ సెంటర్, మాతా సీతా రసోయి అన్నక్రేత్ర, దీపస్తంభం వంటి నిర్మాణాలను చేపట్టారు.

Related News

Mahalakshmi Scheme: కాంగ్రెస్ హామీని కాపీ కొట్టిన బీజేపీ

Rahul Gandhi: ఖర్గే, నడ్డాల లేఖల యుద్ధం

Toxic Workplace: వర్క్ ప్రెజర్‌ తట్టుకోలేక ప్రైవేట్ ఉద్యోగిని మృతి.. రంగంలోకి దిగిన సర్కారు

Delhi CM: ఢిల్లీ సీఎంగా అతిశీ ప్రమాణానికి డేట్ ఫిక్స్

Rahul Gandhi Vs Ravneet Bittu: జాతీయ పార్టీల అధినేతల మధ్య లేఖల యుద్ధం..

Monkeypox Case in India: భారత్‌ను వణికిస్తున్న మంకీపాక్స్.. రెండో కేసు నమోదు.

Train accident in Uttar Pradesh: పట్టాలు తప్పిన మరో రైలు.. రైళ్ల రాకపోకలకు అంతరాయం

Big Stories

×