EPAPER

Holi 2024: హోలీ వేడుకలు.. ఆరోగ్యంపై రసాయన రంగుల ప్రభావం..

Holi 2024: హోలీ వేడుకలు.. ఆరోగ్యంపై రసాయన రంగుల ప్రభావం..
Holi 2024
Holi 2024

Holi 2024: హోలీ వేడుకల వేళ ఒకరిపై ఒకరు రంగులు చల్లుకుంటారు. ఈ రంగుల్లోని రసాయనాల వల్ల చర్మ , కంటి, శ్వాసకోశ సమస్యలు కలుగుతాయి. ఆరోగ్యంపై హానికర ప్రభావం ఉంటుంది. రంగుల పండుగ జరుపుకోవడానికి ప్రతి ఒక్కరూ ఇష్టపడతారు. పిల్లలు ముఖ్యంగా హోలీని చాలా ఇష్టపడతారు. రంగులను నీటిలో కలిపిపై చల్లు కుంటారు.


పూలతో చేసిన రంగులతో హోలీ ఆడటం వల్ల ఎలాంటి సమస్యలు రావు. లెడ్ ఆక్సైడ్, క్రోమియం అయోడైడ్, కాపర్ సల్ఫేట్, మెర్క్యూరీ సల్ఫైట్ , అల్యూమినియం బ్రోమైడ్ లాంటి హానికరమైన రసాయనాలను హోలీ రంగులలో విరివిగా ఉపయోగిస్తారు.

సీసం లాంటి ఎండోటాక్సిన్స్ , హెవీ మెటల్స్ లాంటి ప్రమాదకర రసాయనాలు తీవ్రమైన ఆరోగ్య సమస్యలను కలిగిస్తాయి. హోలీ వేడుకల తర్వాత చర్మ సమస్యలు, శ్వాసకోశ ఇన్ఫెక్షన్, కండ్లకలక కలిగే అవకాశం ఉంది. కళ్ల సమస్యలతో చాలా మంది ఆసుపత్రులకు వెళుతూ ఉంటారు.


Also Read:  2026 నాటికి దేశంలో తొలి బుల్లెట్‌ రైలు.. అందుబాటులోకి వచ్చేది ఆ రూట్ లోనే..!

హోలీ అనేది రంగుల పండుగ. కానీ రసాయనాలతో కూడిన రంగులు ఆరోగ్యానికి ముప్పు కలిగిస్తాయి. వీటిలో సీసం, పాదరసం, క్రోమియం, కాడ్మియం, ఆస్బెస్టాస్ లాంటి హానికరమైన రసాయనాలు ఉంటాయి.

హోలీ రంగుల ప్రభావం..
చర్మ అలెర్జీలు: రసాయన రంగులు చర్మానికి చికాకు కలిగిస్తాయి. ఎరుపు రంగులో దద్దుర్లు వస్తాయి. దురద, మంటను కలిగించవచ్చు. సెన్సిటివ్ స్కిన్ ఉన్నవారు ఈ సమస్యలకు ఎక్కువగా గురవుతారు.

కంటి సమస్యలు: రసాయన రంగులు కంటికి చికాకు కలిగిస్తాయి. కళ్లు ఎరుపురంగులోకి మారతాయి.  నీరు కారుతుంది. తాత్కాలిక అంధత్వం కలిగే ప్రమాదం ఉంది.

క్యాన్సర్: హోలీ రంగుల్లో ఉపయోగించే సీసం, క్రోమియం లాంటి కొన్ని రసాయనాలు క్యాన్సర్ కారకంగా ఉంటాయి. దీర్ఘకాలంలో క్యాన్సర్ ప్రమాదాన్ని పెంచుతాయి.

హోలీ రంగులు విషపూరితం, గర్భిణీ స్త్రీలకు తీవ్రమైన ఆరోగ్య సమస్యలను కలిగిస్తాయి. శ్వాసకోశ సమస్యలకు దారితీస్తాయి.

సురక్షితమైన హోలీ ఆడటానికి చిట్కాలు..

పువ్వులు, ఆకులు, కూరగాయలు లాంటి సహజ పదార్ధాలతో తయారు చేసిన మూలికా రంగులతో హోలీ ఆడండి.

హోలీ ఆడే ముందు చర్మానికి కొబ్బరి నూనె , మాయిశ్చరైజర్‌ని పూయండి.

రంగు పొడి నుంచి మీ కళ్లు, ముక్కును రక్షించడానికి సన్ గ్లాసెస్, స్కార్ఫ్ ధరించండి.

కళ్లు, నోటిలోకి రంగులు పడకుండా జాగ్రత్తలు తీసుకోండి.

హోలీ ఆడిన తర్వాత జుట్టు, శరీరాన్ని శుభ్రమైన నీటితో శుభ్రంగా కడగాలి.

చర్మం చికాకు పెట్టడం, ఎరుపురంగులోకి మారడం, శ్వాస సమస్యలు ఎదురైనా వెంటనే వైద్యుడిని సంప్రదించండి.

Tags

Related News

Mahalakshmi Scheme: కాంగ్రెస్ హామీని కాపీ కొట్టిన బీజేపీ

Rahul Gandhi: ఖర్గే, నడ్డాల లేఖల యుద్ధం

Toxic Workplace: వర్క్ ప్రెజర్‌ తట్టుకోలేక ప్రైవేట్ ఉద్యోగిని మృతి.. రంగంలోకి దిగిన సర్కారు

Delhi CM: ఢిల్లీ సీఎంగా అతిశీ ప్రమాణానికి డేట్ ఫిక్స్

Rahul Gandhi Vs Ravneet Bittu: జాతీయ పార్టీల అధినేతల మధ్య లేఖల యుద్ధం..

Monkeypox Case in India: భారత్‌ను వణికిస్తున్న మంకీపాక్స్.. రెండో కేసు నమోదు.

Train accident in Uttar Pradesh: పట్టాలు తప్పిన మరో రైలు.. రైళ్ల రాకపోకలకు అంతరాయం

Big Stories

×