EPAPER

Kangana Ranaut: కంగనా రనౌత్ కు హై కోర్టు నోటీసులు.. మండి ఎన్నికల నిర్వహణపై సవాల్ చేస్తూ పిటీషన్!

Kangana Ranaut: కంగనా రనౌత్ కు హై కోర్టు నోటీసులు.. మండి ఎన్నికల నిర్వహణపై సవాల్ చేస్తూ పిటీషన్!

Kangana Ranaut latest news(Current news from India): హిమాచల్ ప్రదేశ్ హైకోర్టు బుధవారం బిజేపీ ఎంపీ, నటి కంగనా రనౌత్ కు నోటీసులు జారీ చేసింది. హిమాచల్ రాష్ట్రంలోని మంది లోక్ సభ నియోజకవర్గం నుంచి ఇటీవలే కంగనా రనౌత్ ఎంపీగా ఎన్నికలు గెలిచారు. కానీ ఆమె పోటీ చేసి ఎన్నికలు చెల్లవంటూ ఓ వ్యక్తి కోర్టులో పిటీషన్ వేశాడు. మంది ఎన్నికల్లో తాను కూడా పోటీ చేసేందుకు నామినేషన్ వేశానని.. కానీ ఎన్నికల అధికారి అకారణంగా తన నామినేషన్ పేపర్లు తిరస్కరించాడని పిటీషన్ లో పేర్కొన్నాడు. ఈ పిటీషన్ ని విచారణ కోసం అనుమతిస్తూ.. ఎన్నికల్లో విజయం సాధించిన కంగనా రనౌత్ కు కోర్టు నోటీసులు జారీ చేసింది.


మండి లోక్ సభ స్థానం నుంచి బిజేపీ ఎంపీ కంగాన్ రనౌత్ తన సమీప కాంగ్రెస్ అభ్యర్థి విక్రమాదిత్య సింగ్ పై 74,755 ఓట్ల భారీ మెజారిటీతో విజయం సాధించారు. అమెకు 5,37,002 ఓట్లు లభించగా.. కాంగ్రెస్ అభ్యర్థి విక్రమాదిత్య.. 4,62,267 ఓట్లు పోల్ అయ్యాయి. అయితే ఈ ఎన్నికలు చెల్లుబాటు కాదంటూ లాయక్ రామ్ నేగీ అనే వ్యక్తి కోర్టులో పిటీషన్ వేశాడు. అటవీ శాఖ అధికారి ప్రభుత్వ ఉద్యోగం నుంచి ముందస్తు రిటైర్ మెంట్ తీసుకొని ఎన్నికల్లో పోటీచేశానని.. ఎన్నికల నామినేషన్ ప్రక్రియలో రిటర్నింగ్ అధికారి తప్పుడు కారణాలతో తన నామినేషన్ దరఖాస్తు తిరస్కరించాడని కోర్టుకు తెలిపాడు.

పిటీషన్ లో లాయక్ రామ్ నేగీ.. ఎన్నికల రిటర్నింగ్ అధికారిపై కూడా కేసు వేశాడు. నామినేషన్ ప్రక్రియ లో భాగంగా ఎన్నికల అధికారి.. తాను పనిచేసిన డిపార్ట్‌మెంట్ నుంచి ‘నో డ్యూస్’ సర్టిఫికెట్ కూడా సమర్పించానని.. అయినా మరుసటి రోజు మళ్లీ కరెంటు, నీరు, టెలిఫోన్ విభాగాల నుంచి కూడా ‘నో డ్యూస్’ సర్టిఫికెట్ తీసుకురావాలని కేవలం ఒకరోజు గడువు ఇచ్చారని.. ఆ డాకుమెంట్స్ కూడా సమర్పిస్తే.. కారణం చూపకుండా తన నామినేషన్ తిరస్కరించారని పిటీషన్ లో పేర్కొన్నాడు. తాను ఈ ఎన్నికల్లో పోటీ చేసి ఉంటే.. కచ్చితంగా విజయం సాధించేవాడినని లాయక్ రామ్ నేగి వాదన.


Also Read:  ‘నువ్వు ఆడదానివి.. నీకేం తెలుసు.. మాట్లాడకు..’ మళ్లీ నోరుజారిన బిహార్ సిఎం!

ఇప్పుడు మంది నియోజకవర్త ఎంపీగా ఉన్న కంగనా రనౌత్ ఎన్నిక చెల్లదని.. మరోసారి ఎన్నికలు నిర్వహించాలని కోరుతూ అతను దాఖలు చేసిన పిటీషన్ పై హిమాచల్ ప్రదేశ్ హైకోర్టు స్పందిస్తూ.. కంగనా రనౌత్ కు నోటీసులు జారీ చేసింది. నోటీసులపై స్పందించేందుకు ఆగస్టు 21 వరకు గడువు విధించింది.

 

 

Related News

Rahul Gandhi: ఖర్గే, నడ్డాల లేఖల యుద్ధం

Toxic Workplace: వర్క్ ప్రెజర్‌ తట్టుకోలేక ప్రైవేట్ ఉద్యోగిని మృతి.. రంగంలోకి దిగిన సర్కారు

Delhi CM: ఢిల్లీ సీఎంగా అతిశీ ప్రమాణానికి డేట్ ఫిక్స్

Rahul Gandhi Vs Ravneet Bittu: జాతీయ పార్టీల అధినేతల మధ్య లేఖల యుద్ధం..

Monkeypox Case in India: భారత్‌ను వణికిస్తున్న మంకీపాక్స్.. రెండో కేసు నమోదు.

Train accident in Uttar Pradesh: పట్టాలు తప్పిన మరో రైలు.. రైళ్ల రాకపోకలకు అంతరాయం

Bank Holidays: ఖాతాదారులకు బిగ్ అలర్ట్.. అక్టోబర్‌లో భారీగా సెలవులు..ఎన్ని రోజులంటే?

Big Stories

×