EPAPER

High Tension in Delhi: నిరసనతో అట్టుడుకుతున్న దేశ రాజధాని.. తగ్గేదేలే అంటున్న రైతులు!

High Tension in Delhi: నిరసనతో అట్టుడుకుతున్న దేశ రాజధాని.. తగ్గేదేలే అంటున్న రైతులు!

Farmers Protest in Delhi: దేశ రాజధాని ఢిల్లీ రైతుల ఆందోళనతో అట్టుడుకుతోంది. కేంద్రం గతంలో ఇచ్చిన డిమాండ్లను నెరవేర్చాలని కోరతూ ఢిల్లీ చలోకి పిలుపునిచ్చారు. ఢిల్లీ చుట్టుపక్కల రాష్ట్రాల రైతులంతా దేశ రాజధానికి ర్యాలీగా బయల్దేరగా.. పోలీసులు ఎక్కడికక్కడ అరెస్టులు చేశారు. ఈ ఉదయం పంజాబ్‌, హరియాణా నుంచి వేలాదిమంది రైతులు ట్రాక్టర్లతో నగరానికి తరలి వచ్చారు. ఈ క్రమంలో కొన్ని కీలక విషయాలు వెల్లడైనట్లు చమాచారం.


ఇటీవలే వెలుగులోకి వచ్చిన నివేదిక ప్రకారం ఒక్క పంజాబ్ నుంచే అధిక సంఖ్యలో రైతులు కదిలి వచ్చారు. రైతులతో పాటు ట్రాక్టర్లు, వాహనాలలో ఆరు నెలలకు సరిపడా ఆహారం సామగ్రిని తిసుకొచ్చారని సమాచారం. మీడియాతో మాట్లాడిన కొందరు రైతులు ఈ విషయాలు వివరించారు. తమ డిమాండ్లను ప్రభుత్వం నెరవేర్చేవరకు నిరసన కొనసాగుతుందన్నారు. ప్రభుత్వం, పోలీసులు తమ సహనాన్ని పరీక్షించినా తము వెనక్కి తగ్గమన్నారు.

నిరసనలో రైతులు మీడియాతో మాట్లాడుతూ.. ‘ మా డిమాండ్లు నెరవేర్చేవరకు నిరసన జరుగుతుంది. ఆరు నెలలకు సరిపడ సమాగ్రితో మేము ఇక్కడికి కదిలి వచ్చాము. సుత్తి, రాళ్లను పగలకొట్టే పరికరాలు మా ట్రాలీల్లో ఉన్నాయి’ అని వెల్లడించారు. నిరసనకు తరలివస్తున్న తమను అడ్డుకుంనేందుకు ట్రాక్టర్లకు డీజిల్ దొరక్కుండా చేస్తున్నారని రైతులు ఆరోపనలు చేశారు. రెండు ట్రాలీల్లో సామగ్రిని తీసుకొని పంజాబ్ గురుదాస్‌పూర్ నుంచి ఢిల్లికి వచ్చామన్నారు.


2020-21లో ఉద్యమానికి వచ్చిన రైతులు ప్రస్తుతం ఈ నిరసనలో పాల్లొంటున్నారు. అప్పట్లో వారు కొన్ని నెలల పాటు చలిని సైతం లెక్క చేయకుండా ఢిల్లీలో ఆందోళనలు చేపట్టారు. కేంద్రం ఇచ్చిన హామీలను నెలవేర్చలేదని.. ఇప్పుడు ఆ హామీలు నెరవేర్చేదాకా చలో ఢిల్లీ నిరసన యథాతథంగా కొనసాగుతుందని రైతు నాయకులు తేల్చి చెప్పారు.

Related News

Rahul Gandhi: ఖర్గే, నడ్డాల లేఖల యుద్ధం

Toxic Workplace: వర్క్ ప్రెజర్‌ తట్టుకోలేక ప్రైవేట్ ఉద్యోగిని మృతి.. రంగంలోకి దిగిన సర్కారు

Delhi CM: ఢిల్లీ సీఎంగా అతిశీ ప్రమాణానికి డేట్ ఫిక్స్

Rahul Gandhi Vs Ravneet Bittu: జాతీయ పార్టీల అధినేతల మధ్య లేఖల యుద్ధం..

Monkeypox Case in India: భారత్‌ను వణికిస్తున్న మంకీపాక్స్.. రెండో కేసు నమోదు.

Train accident in Uttar Pradesh: పట్టాలు తప్పిన మరో రైలు.. రైళ్ల రాకపోకలకు అంతరాయం

Bank Holidays: ఖాతాదారులకు బిగ్ అలర్ట్.. అక్టోబర్‌లో భారీగా సెలవులు..ఎన్ని రోజులంటే?

Big Stories

×