EPAPER

Kovind Committee Report : జమిలీ ఎన్నికలపై అధ్యయనం పూర్తి.. రాష్ట్రపతికి కోవింద్ కమిటీ నివేదిక

Kovind Committee Report : జమిలీ ఎన్నికలపై అధ్యయనం పూర్తి.. రాష్ట్రపతికి కోవింద్ కమిటీ నివేదిక

Kovind Committee Report on Jamili Elections


Kovind Committee Report on Jamili Elections(Today news paper telugu): ఒకే దేశం..ఒకే ఎన్నిక అంశంపై మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ నేతృత్వంలో ఏర్పాటైన కమిటీ తన నివేదికను గురువారం రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు సమర్పించింది. లోక్ సభ, శాసనసభ, స్థానిక సంస్థల ఎన్నికలను దేశవ్యాప్తంగా ఒకేసారి నిర్వహించడంలో సాధ్యాసాధ్యాలపై ఈ కమిటీ అధ్యయనం చేసింది. గత ఏడాది సెప్టెంబర్ 2న ఏర్పాటైన కమిటీ జమిలీ ఎన్నికలకు సంబంధించి మొత్తం 18,626 పేజీల నివేదికను రూపొందించింది.

Also Read : రెండో జాబితా ప్రకటించిన టీడీపీ.. 34 మంది అభ్యర్థులు వీరే..


జమిలీ ఎన్నికల నిర్వహణకు రాజ్యాంగ సవరణలకు రామ్‌నాథ్ కోవింద్ కమిటీ సూచించినట్టు తెలిసింది. రెండు దశల్లో ఏకకాల ఎన్నికలు నిర్వహించాలని కమిటీ పేర్కొంది. తొలిదశలో పార్లమెంట్, అసెంబ్లీకి ఏకకాలంలో ఎన్నికలు జరుగుతాయి. ఈ ఎన్నికలకు ఒకే ఓటరు లిస్ట్ ఉంచే విషయంపై కూడా కమిటీ పలు సూచనలు చేసింది. రెండవ దశలో.. మున్సిపాలిటీలు, పంచాయతీల ఎన్నికలు నిర్వహిస్తారు. ఈ రెండు దశల ఎన్నికల మధ్య వందరోజుల వ్యవధి ఉంటుంది. రాష్ట్రాల శాసనసభల ఆమోదం స్థానిక ఎన్నికల నిర్వహణకు అవసరమని కమిటీ పేర్కొంది.

హంగ్.. అవిశ్వాస తీర్మానం వంటి పరిస్థితులు తలెత్తినప్పుడు కొత్త పార్లమెంటు లేదా శాసనసభను ఏర్పాటు చేయడానికి తాజా ఎన్నికలు నిర్వహించాలని కమిటీ సూచించడం విశేషం.

Related News

Rahul Gandhi: ఖర్గే, నడ్డాల లేఖల యుద్ధం

Toxic Workplace: వర్క్ ప్రెజర్‌ తట్టుకోలేక ప్రైవేట్ ఉద్యోగిని మృతి.. రంగంలోకి దిగిన సర్కారు

Delhi CM: ఢిల్లీ సీఎంగా అతిశీ ప్రమాణానికి డేట్ ఫిక్స్

Rahul Gandhi Vs Ravneet Bittu: జాతీయ పార్టీల అధినేతల మధ్య లేఖల యుద్ధం..

Monkeypox Case in India: భారత్‌ను వణికిస్తున్న మంకీపాక్స్.. రెండో కేసు నమోదు.

Train accident in Uttar Pradesh: పట్టాలు తప్పిన మరో రైలు.. రైళ్ల రాకపోకలకు అంతరాయం

Bank Holidays: ఖాతాదారులకు బిగ్ అలర్ట్.. అక్టోబర్‌లో భారీగా సెలవులు..ఎన్ని రోజులంటే?

Big Stories

×