EPAPER

Chennai Floods: చెన్నైలో జలప్రళయం.. ముంచెత్తుతోన్న వరదలు.. ఐదుగురి మృతి

Chennai Floods: చెన్నైలో జలప్రళయం.. ముంచెత్తుతోన్న వరదలు.. ఐదుగురి మృతి

Chennai Floods: బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం.. మిగ్ జాం తుఫానుగా మారి ద్రవిడ రాష్ట్రాన్ని అతలాకుతలం చేసేస్తుంది. బీభత్సకరమైన వానలు, భీకర ఈదురుగాలులతో .. చెన్నై చిగురుటాకులా వణికిపోతోంది. ఏటా ఇదే పరిస్థితితో.. తమిళవాసులు అష్టకష్టాలు పడుతున్నారు. వీధులు చెరువులయ్యాయి.. రోడ్లు నదులయ్యాయి.. ఎయిర్‌పోర్ట్‌లోని రన్‌ వేపై సైతం అడుగుల మేర నీరు పారుతోంది.. మొత్తంగా తమిళనాడు రాజధాని చెన్నై వాసుల జీవితాలు మళ్లీ జలమయం అయ్యాయి. ఒక్క చెన్నైను మాత్రమే కాదు.. మిగ్ జాం తుపాన్‌.. మొత్తం తమిళనాడును ఆగం చేస్తోంది. ఇప్పుడు అన్ని జిల్లాల్లో రికార్డ్‌ స్థాయిలో వర్షాలు కురుస్తున్నాయి. దీంతో ఆ ప్రాంతాలన్ని జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి.


ప్రస్తుతం తమిళనాడు, ఏపీ తీరంవైపు మిగ్ జాం తుపాను దూసుకొస్తుంది. దీంతో అంతకంతకు ప్రభావం పెరుగుతోంది. బలమైన ఈదురుగాలులు, వాటికి తోడు అతి భారీ వర్షాలు తోడవుతుండటంతో పరిస్థితి అంతకంతకు దిగజారుతోంది. భారీ వర్షాలకు కాలువలు పొంగిపొర్లుతున్నాయి. చెరువులు మత్తడి పోస్తుండగా.. కొన్ని ప్రాంతాల్లో గండ్లు పడి ప్రధాన రోడ్లు, వీధుల్లో వరద నీరు ముంచెత్తుతోంది. దీంతో కార్లు, బైకులు కొట్టుకుపోతున్నాయి.

చెన్నై ఎయిర్‌పోర్ట్‌లో భారీగా వరద నీరు చేరింది. ఎయిర్‌ప్లేన్‌ పార్కింగ్ స్థలాల్లో కూడా నీరు చేరడంతో సర్వీసులను తాత్కాలికంగా రద్దు చేశారు. తమిళనాడు మీదుగా నడిచే రైళ్లను రద్దు చేయడమో.. దారి మళ్లించడమో చేస్తున్నారు. చెన్నైకు మరో 24 గంటల పాటు ఆరెంజ్ అలర్ట్ జారీ చేయగా.. తిరువల్లూరు జిల్లాకైతే రెడ్ అలర్ట్ చేశారు.


రెస్క్యూ టీమ్స్‌ పూర్తి స్థాయిలో చర్యలు చేపడుతున్నారు. ప్రమాదకర ప్రాంతాలను గుర్తించి NDRF టీమ్స్‌ను మోహరించారు. చెన్నైలోని 14 రైల్వే సబ్‌వేల్లోకి ఇప్పటికే నీరు చేరడంతో వాటిని మూసివేశారు. అటు భారీ వర్షాలకు చెన్నైలోని స్కూళ్లను మూసివేశారు. వీలైనంత వరకు ప్రజలు ఇళ్లలోనే ఉండాలని అధికారులు కోరారు. ప్రస్తుతం చెన్నైలోని అనేక ప్రాంతాల్లోకి నీరు చేరడంతో విద్యుత్తు సరఫరా నిలిచిపోయింది. కాంచీపురం, చెంగల్‌పట్టు, తిరువల్లూరు జిల్లాలో కూడా భారీ వర్షాలు పడుతున్నాయి.

ఏపీపై మిచౌంగ్ తుపాన్ ప్రభావం తీవ్రంగా ఉంది. ఈ తుపాను గంటకు గరిష్ఠంగా 110 కిలోమీటర్ల వేగంతో దక్షిణ కోస్తా తీరం వెంబడి కదులుతోంది. ఇవాళ మధ్యాహ్నంలోపు చీరాల, బాపట్ల సమీపంలో తీరం దాటుతుందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలోకి ప్రవేశించిన తీవ్ర మిగ్ జాం ఉత్తర, దక్షిణ కోస్తాకు సమాంతరంగా పయనిస్తోంది అంటున్నారు. తుపాన్ తీరం దాటాక తీరంలో గంటకు 100-110 కిలోమీటర్ల వేగంతో పెనుగాలులు వీచే అవకాశం ఉందని.. కోస్తా జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ, అక్కడక్కడా అతి తీవ్ర వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ అంచనా వేస్తోంది. ప్రధానంగా మచిలీపట్నం నుంచి ఒంగోలు వరకు తీరానికి ఆనుకుని ఉన్న లోతట్టు ప్రాంతాలపై తుఫాను ప్రభావం ఎక్కువగా ఉంటుందంటున్నారు.

మిగ్ జాం తుపాన్ ప్రభావంతో తిరుపతి, నెల్లూరు జిల్లాల్లో కుండపోత వానలు పడుతున్నాయి. రహదారులపైకి నీరు చేరడంతో రాకపోకలు స్తంభించాయి. చెట్లు నేలకూలాయి.. విద్యుత్తు సరఫరా నిలిచిపోయింది. ఉమ్మడి గుంటూరు, ప్రకాశం, కృష్ణా, తూర్పు, పశ్చిమగోదావరి జిల్లాల్లోనూ సోమవారం రాత్రి నుంచి వర్షం, గాలుల తీవ్రత కనిపిస్తోంది. ఈ తుపాన్ మొత్తం 8 జిల్లాలపై ప్రభావం చూపనుంది. తీరంలో సోమవారం నుంచి అలలు 1.50 మీటర్ల నుంచి 2 మీటర్ల ఎత్తుకు ఎగసిపడుతున్నాయి. ప్రభుత్వం 8 జిల్లాల్లో 300 పునరావాస కేంద్రాల్ని ఏర్పాటు చేసింది. తీరప్రాంత జిల్లాల్లో పాఠశాలలకు నేడు కూడా సెలవులు ప్రకటించారు.

తమిళనాడును వణికిస్తున్న మిగ్ జాం తుపాన్ ప్రభావం అటు ఏపీలోనే కాకుండా ఇటు తెలంగాణలోనూ తీవ్రంగానే ఉంటుందని వాతావరణ శాఖ తాజాగా వెల్లడించింది. రాష్ట్రంలోని పలు జిల్లాలకు హెచ్చరికలు జారీ చేసింది. తుపాన్ ప్రభావంతో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. సోమ, మంగళవారాల్లో కొన్ని జిల్లాల్లో బారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది. ఆయా జిల్లాలకు ఎల్లో, ఆరెంజ్ అలెర్ట్‌ జారీ చేసింది.

తుపాన్ ప్రభావంతో తూర్పు దిశ నుంచి తెలంగాణ వైపు గాలులు వీస్తున్నాయని ఐఎండీ వెల్లడించింది. దీంతో భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, సూర్యాపేట, నల్గొండలలో అక్కడక్కడా వర్షాలు కురుస్తాయని పేర్కొంది. ఉరుములు, మెరుపులతో గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని తెలిపింది.

.

.

Related News

Uttarakhand Train: రైలు ప్రమాదానికి భారీ కుట్ర.. పట్టాలపై 6 మీటర్ల ఇనుస రాడ్

Mahalakshmi Scheme: కాంగ్రెస్ హామీని కాపీ కొట్టిన బీజేపీ

Rahul Gandhi: ఖర్గే, నడ్డాల లేఖల యుద్ధం

Toxic Workplace: వర్క్ ప్రెజర్‌ తట్టుకోలేక ప్రైవేట్ ఉద్యోగిని మృతి.. రంగంలోకి దిగిన సర్కారు

Delhi CM: ఢిల్లీ సీఎంగా అతిశీ ప్రమాణానికి డేట్ ఫిక్స్

Rahul Gandhi Vs Ravneet Bittu: జాతీయ పార్టీల అధినేతల మధ్య లేఖల యుద్ధం..

Monkeypox Case in India: భారత్‌ను వణికిస్తున్న మంకీపాక్స్.. రెండో కేసు నమోదు.

Big Stories

×