EPAPER

Heavy RainFall Alert 9 States: బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం.. 9 రాష్ట్రాల్లో భారీ వర్షాల హెచ్చరికలు జారీ

Heavy RainFall Alert 9 States: బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం.. 9 రాష్ట్రాల్లో భారీ వర్షాల హెచ్చరికలు జారీ

Heavy RainFall Alert 9 States| పశ్చిమ బెంగాల్, బంగ్లాదేవ్ సమీపంలో బంగాళా ఖాతంలో తీవ్ర అల్పపీడనం ఏర్పడిందని భారత వాతావరణ శాఖ (India Meteorological Department) శనివారం తెలిపింది. పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్ కతా కు తూర్పు దిశలో 100 కిలో మీటర్ల దూరంలో ఉన్న ఈ అల్పపీడనం గంటకు 23 కిలోమీటర్ల వేగంతో ముందుకు సాగుతోందని.. మరో 48 గంటల్లో ఇలాగే కొనసాగితే పశ్చిమ బెంగాల్ గాంగెటిక్ ప్రాంతం, ఝార్ఖండ్ రాష్ట్రం వరకు చేరుకుంటుదని వెల్లడించింది.


సెప్టెంబర్ 14న ఐఎండి తెలిపిన సమాచారం ప్రకారం.. కోల్ కతా పరిసరాల్లో తేలికపాటి వర్షం కురిస్తే అవకాశముండగా.. బెంగాల్ లోని కొన్ని ప్రాంతాల్లో భారీ, అతిభారీ వర్షాలు కురిసే అవకాశం కూడా ఉంది. హిమలయాలకు సమీపంగా బెంగాల్ ప్రాంతాల్లో ముఖ్యంగా భారీ వర్షాలు పడే అవకాశముందని.. అలాగే ఒడిశా, ఝార్ఖండ్, బిహార్, మిజోరం, త్రిపుర, అస్సాం, మేఘాలయ రాష్ట్రాల్లో మరో రెండు రోజుల వరకు భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది.

Also Read: కదులుతున్న రైలు నుంచి అడవిలో పడ్డ ప్రయాణికుడు.. తిండి నీరు లేక ఏం చేశాడంటే..


సముద్ర నుంచి వేగమైన గాలి వీచే హెచ్చరిక
బంగాళాఖాతంలోని ఉత్తర భాగం, బంగ్లాదేశ్, పశ్చిమ బెంగాల్ తీర ప్రాంతాలు, ఒడిశా ఉత్తర భాగంలో గంటకు 50-60 కిలోమీటర్ల వేగంగా సముద్రం నుంచి గాలులు వీస్తాయని, సముద్రంలో తుఫాను అలలు 70 కిలోమీటర్ల వేగంతో ముందుసాగుతున్నాయని తెలిపింది. సెప్టెంబర్ 14 రాత్రి వరకు పరిస్థితి ఇలాగే ఉంటుందని.. ఆ తరువాత వేగం కాస్త తగ్గుముఖం పడే అవకాశముందని ఐఎండి అధికారులు తెలిపారు.
పశ్చిమ బెంగాల్, ఉత్తర ఒడిశా, ఝార్ఖండ్, ఉత్తర ఛత్తీస్ గడ్, తూర్పు మధ్య ప్రదేశ్, ఆగ్నేయ (దక్షిణ తూర్పు) ఉత్తర్ ప్రదేశ్ లో సెప్టెంబర్ 16 వరకు వేగంగా గాలులు వీచే అవకాశముంది.

ఉత్తర బంగాళా ఖాతం, పశ్చిమ బెంగాల్, ఒడిశా తీర ప్రాంతాల్లో సముద్రంలో ప్రమాదకరం అలలుండే అవకాశముంది. సెప్టెంబర్ 16 వరకు ఇలాగే పరిస్థితి ఉంటుంది అధికారులు అంచనా వేశారు. ఈ ప్రాంతంలో ఉండే మత్సకారులు మరో రెండు రోజుల వరకు సముద్రంలోకి వెళ్లకూడదని హెచ్చరిక జారీ చేశారు.

నైరుతి వర్షాలు సెప్టెంబర్ 19 నుంచి సెప్టెంబర్ 25 వరకు తగ్గిపోతాయని ఆ తరువాత పరిస్థితి సాధారణ స్థితి చేరుకుంటుందని వాతావరణ శాఖ తెలిపింది. ప్రతీ సంవత్సరం నైరుతి వర్షాలు కేరళలో జూన్ 1 మొదలై జూలై 8 వరకు దేశవ్యాప్తంగా కురుస్తాయి. క్రమంగా అక్టోబర్ 15ను పూర్తిగా తగ్గిపోతాయి.

Related News

Delhi CM: ఢిల్లీ సీఎంగా అతిశీ ప్రమాణానికి డేట్ ఫిక్స్

Rahul Gandhi Vs Ravneet Bittu: జాతీయ పార్టీల అధినేతల మధ్య లేఖల యుద్ధం..

Monkeypox Case in India: భారత్‌ను వణికిస్తున్న మంకీపాక్స్.. రెండో కేసు నమోదు.

Train accident in Uttar Pradesh: పట్టాలు తప్పిన మరో రైలు.. రైళ్ల రాకపోకలకు అంతరాయం

Bank Holidays: ఖాతాదారులకు బిగ్ అలర్ట్.. అక్టోబర్‌లో భారీగా సెలవులు..ఎన్ని రోజులంటే?

Jammu Kashmir: ఓటెత్తిన కశ్మీరం.. 58.19 శాతం పోలింగ్ నమోదు

One Nation One Election: జమిలి ఎన్నికలతో ఎవరికి లాభం? దీని వల్ల కలిగే నష్టాలేమిటీ?

Big Stories

×