EPAPER

Haryana Cashless Treatment: రోడ్డు ప్రమాదాలకు గురైన వారికి ప్రైవేట్ ఆస్పత్రుల్లో ఉచిత వైద్యం.. హర్యాణాలో కొత్త పథకం!

Haryana Cashless Treatment: రోడ్డు ప్రమాదాలకు గురైన వారికి ప్రైవేట్ ఆస్పత్రుల్లో ఉచిత వైద్యం.. హర్యాణాలో కొత్త పథకం!

Haryana Cashless Treatment| రోడ్డు ప్రమాదాలకు గురైన వారికి ప్రైవేట్ ఆస్పత్రుల్లో ఉచిత వైద్యం అందిస్తామని హర్యాణా ముఖ్యమంత్రి నాయబ్ సింగ్ సైనీ బుధవారం రాత్రి ప్రకటించారు. చికిత్సకు అయ్యే ఖర్చు ప్రభుత్వమే భరిస్తుందని.. ప్రైవేట్ ఆస్పత్రిలో వైద్యం చేయించుకోవడానికి ఎటువంటి చెల్లింపులు లేకుండా క్యాష్ లెస్ ట్రీట్ మెంట్ అందిస్తామని తెలిపారు.


ఈ పథకం ద్వారా ప్రమాదాలకు గురైన బాధితులకు నష్టపరిహారం, చికిత్సకు అయ్యే ఖర్చు ఒక నిర్ణీత గడువులోగా అందుతాయని ముఖ్యమంత్రి చెప్పారు. హర్యాణా రోడ్ సేఫ్టీ ఫండ్ ద్వారా చికిత్సకు అయ్యే ఖర్చు కేటాయిస్తామని హర్యాణా సిఎం మీడియాకు తెలిపారు.

Also Read: ధోతీ ధరించాడని మాల్‌లోకి రానివ్వని సెక్యూరిటీ సిబ్బంది


ఈ పథకాన్ని అమలుపరిచేందుకు జిల్లా స్థాయి కమిటీని నియమిస్తామని ఆయన అన్నారు. ప్రమాద బాధితులకు యాక్సిడెంట్ రిపోర్ట్ అందిన 15 రోజులలోపు నష్టపరిహారం చెల్లింపులు జరుగుతాయని. ఒక ఇంక్వైరీ కమిషనర్ ఆధ్వర్యంలో యక్సిడెంట్ రిపోర్ట్ తయారు చేయబడుతుందని అన్నారు.

మీడియా సమావేశంలో ముఖ్యమంత్రి నాయబ్ సింగ్ సైనీ మాట్లాడుతూ.. ”రోడ్ ట్రాన్స్ పోర్ట్ అండ్ హైవేస్ కేంద్ర మంత్రిత్వ శాఖ ఫిబ్రవరి 25,22న రోడ్డు ప్రమాదాలు, హిట్ అండ్ రన్ మోటార్ యాక్సిడెంట్ బాధితుల కోసం నష్టపరిహారం పథకాన్ని ప్రకటించింది. కేంద్ర పథకాన్ని అనుకరిస్తూ.. హర్యాణా ప్రభుత్వం కూడా బాధితులకు నగదు రహిత వైద్య చికిత్స, నష్టపరిహారం అందిస్తుంది,” అని అన్నారు.

Also Read: భయపడ్డ సిద్ధరామయ్య సర్కార్.. ప్రైవేట్ జాబ్ కోటా బిల్ నిలిపివేత!!

”ప్రమాదం జరిగిన వెంనే బాధితులకు సమీపంలోని ప్రభత్వ లేదా ప్రైవేటు ఆస్పత్రికి తీసుకువెళ్లొచ్చు. రాష్ట్ర ప్రభుత్వం.. కేటాయించిన హర్యణా రోడ్ సేఫ్టీ ఫండ్ ద్వారా చెల్లింపులు జరుగుతాయి. ఒకవేళ ప్రమాదానికి గురైన వ్యక్తి చనిపోతే.. అతని కుటుంబానికి పరిహారం అందుతుంది. ఈ ప్రక్రియ అంతా సవ్యంగా సాగేందుకు ఒక జిల్లా స్థాయి కమిటీ ఏర్పాటు చేస్తాం,” అని వివరించారు.

మరోవైపు హర్యాణాలో వాణిజ్య ఉపయోగం కోసం భూమి కావాలనుకునే రైతులు, సన్నకారు వ్యాపారుల కోసం మైన్స్ అండ్ జియోలజీ డిపార్ట్ మెంట్ ఒక ఆన్ లైన్ పోర్టల్ ఏర్పాటు చేసిందని.. దాని ద్వారా సంబంధిత అనుమతులు ఇస్తామని ఆయన నాయబ్ సింగ్ సైనీ తెలిపారు.

Tags

Related News

Chhattisgarh Bomb Blast| ఛత్తీస్ గడ్ లో బాంబు పేల్చిన నక్సల్స్.. ఇద్దరు కానిస్టేబుళ్లు మృతి, నలుగురికి గాయాలు

Parenting Tips : మీ పిల్లాడు జెంటిల్‌మెన్ కావాలంటే.. ఈ టిప్స్ చాలు..!

Ayodhya : ఈ చారిత్రక వేడుకకు సాక్ష్యమవడం సంతోషంగా ఉంది.. ఉపరాష్ట్రపతి ధన్‌ఖడ్‌ ట్వీట్..

Sperm Count : రోజూ ఇలా చేస్తే.. మీ స్పెర్మ్ కౌంట్ పెరుగుతుంది..!

Mopidevi Temple : ఈ ఆలయానికి ఒక్కసారి వెళితే.. వివాహం, సంతాన యోగం..!

Plastic Bottle : మీ చేతిలో ప్లాస్టిక్ బాటిల్ ఉందా..? అయితే మీరు ప్రమాదంలో ఉన్నట్లే..!

Big Stories

×