EPAPER

Groom Kisses Bride on Stage: పెళ్లికూతురికి కిస్సిచ్చిన వరుడు.. కొట్టుకున్న ఇరు కుటుంబాలు

Groom Kisses Bride on Stage: పెళ్లికూతురికి కిస్సిచ్చిన వరుడు.. కొట్టుకున్న ఇరు కుటుంబాలు

Groom Kisses Bride on Stage During Wedding: పెళ్లి వేడుకలో వరుడు చేసిన పనికి ఇరు కుటుంబాల మధ్య వివాదం తలెత్తింది. అంతటితో వారు ఆగకుండా కర్రలతో ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. సోమవారం చోటు చేసుకున్న ఈ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి..


ఉత్తరప్రదేశ్ లోని హాపూర్ లో సోమవారం ఓ పెళ్లి వేడుక జరుగుతోంది. ఆ పెళ్లి కార్యక్రమానికి ఇరుకుటుంబాలు, వారి బంధువులు, సన్నిహితులు చాలా పెద్ద ఎత్తున హాజరయ్యారు. అయితే, వరుడు చేసిన పనికి ఇరు వర్గాలు కొట్టుకున్నాయి. అయితే, యూపీకి చెందిన ఓ వ్యక్తి తన ఇద్దరు కుమార్తెల పెళ్లి కార్యక్రమాలను హాపూర్ లోని అశోక్ నగర్ లో ఏర్పాటు చేశాడు. ఆ ఇద్దరిలో ఒకరి పెళ్లి వేడుక ఎలాంటి గొడవలు లేకుండా, ఇబ్బంది లేకుండా పూర్తయ్యింది. అయితే, ఆ పెళ్లి వేడుక అయిపోయిన కొద్దిసేపటికే మరో కుమార్తె వివాహం జరుగుతోంది. పెళ్లి కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఇందులో భాగంగా పెళ్లి కొడుకు, పెళ్లి కూతురు పూల దండలు మార్చుకున్నారు. దండలు మార్చుకున్న తరువాత పెళ్లి కొడుకు పెళ్లి కూతురికి ముద్దు పెట్టాడు.

అయితే, వరుడు అలా చేయడంతో ఆమె బంధువులకు కోపం వచ్చింది. ఈ క్రమంలో వారిరువురి కుటుంబాల మధ్య వాగ్వాదం చెలరేగింది. ఇంతలో పెళ్లి కూతురు బంధువులు స్టేజీపైకి చేరుకుని వరుడు, అతడి కుటుంబ సభ్యులపై దాడికి దిగారు. ఆ తరువాత ఇరు కుటుంబాలు కర్రలతో దాడి చేసుకునేవరకు వెళ్లింది. దీంతో ఆ కళ్యాణ వేదిక రణరంగంగా మారిపోయింది. విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకున్నారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు.


Also Read: భిన్న వాతావరణం.. చూసి ఆశ్చర్యపోతున్న ప్రజలు

అయితే, ఈ సంఘటనకు సంబంధించి పోలీసులు మాట్లాడుతూ.. ఘటనపై ఎవరూ ఫిర్యాదు చేయలేదని, అయితే ఎవరైనా ఫిర్యాదు చేస్తే కేసు నమోదు చేస్తామని తెలిపినట్లు తెలుస్తోంది. అదేవిధంగా ప్రజాశాంతికి భంగం కలిగించినందుకు ఆరుగురిపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపినట్లు సమాచారం.

Tags

Related News

Mahalakshmi Scheme: కాంగ్రెస్ హామీని కాపీ కొట్టిన బీజేపీ

Rahul Gandhi: ఖర్గే, నడ్డాల లేఖల యుద్ధం

Toxic Workplace: వర్క్ ప్రెజర్‌ తట్టుకోలేక ప్రైవేట్ ఉద్యోగిని మృతి.. రంగంలోకి దిగిన సర్కారు

Delhi CM: ఢిల్లీ సీఎంగా అతిశీ ప్రమాణానికి డేట్ ఫిక్స్

Rahul Gandhi Vs Ravneet Bittu: జాతీయ పార్టీల అధినేతల మధ్య లేఖల యుద్ధం..

Monkeypox Case in India: భారత్‌ను వణికిస్తున్న మంకీపాక్స్.. రెండో కేసు నమోదు.

Train accident in Uttar Pradesh: పట్టాలు తప్పిన మరో రైలు.. రైళ్ల రాకపోకలకు అంతరాయం

Big Stories

×