EPAPER

Train Derailed: మధ్యప్రదేశ్ రత్లామ్ లో రైలు ప్రమాదం.. పట్టాలు తప్పిన గూడ్స్ ట్రైన్

Train Derailed: మధ్యప్రదేశ్ రత్లామ్ లో రైలు ప్రమాదం.. పట్టాలు తప్పిన గూడ్స్ ట్రైన్

Train Derailed: దేశంలో రైలు ప్రమాదాలు తరుచూ జరుగుతూనే ఉన్నాయి. తాజాగా ఒక గూడ్స్ ట్రైన్ పట్టాలు తప్పింది. ఈ ఘటన మధ్యప్రదేశ్ రాష్ట్రం రత్లామ్ నగరానికి సమీపంలో గురువారం (అక్టోబర్ 3, 2024) రాత్రి జరిగిందని సమాచారం. జాతీయ మీడియా కథనం ప్రకారం.. మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్ సమీపంలోని బకానియా భోరి నుంచి బయలుదేరిన ఈ ట్రైన్ ఢిల్లీ ముంబై మార్గంలో ప్రయాణిస్తుండగా.. రత్లామ్ రైల్వే యార్డు వద్ద ఈ ప్రమాదం జరిగింది.


గూడ్స్ ట్రైన్ పట్టాలు తప్పడంతో అందులోని మూడు బోగీలు కింద పడ్డాయి. ఆ మూడు బోగీలలో పెట్రోలియం ఉత్పత్తులు ఉన్నట్లు తెలిసింది. ఒక బోగీ నుంచి పెట్రోల్ లీక్ అవుతున్నట్లు అధికారులు తెలిపారు.

Also Read:  ‘రోడ్డుపై ఉమ్మివేసే వారికి ఇలా చేయండి’.. స్వచ్ఛ భారత్ కోసం నితిన్ గడ్కరీ భలే ఐడియా..


ఈ ఘటనపై రత్లామ్ డివిజనల్ మేనేజర్ రజనీష్ కుమార్ స్పందించారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ”గూడ్స్ ట్రైన్ పట్టాలు తప్పడంతో మూడు బోగీలు కింద పడ్డాయి. ఒక బోగీలో నుంచి పెట్రోల్ లీక్ అవుతోంది. మేము ఎలాంటి భారీ ప్రమాదం జరగకుండా చర్యలు తీసకుంటున్నాం. కింద పడిన బోగీల నుంచి ప్రజలకు దూరంగా ఉండాలని కోరుతున్నాం. కింద పడిన బోగీల సమీపంలో ఎవరినీ సిగరెట్, బీడీ లాంటి పొగత్రాగకూడదని కఠినంగా ఆదేశించడం జరిగింది. ఈ ప్రమాదంలో ఇప్పటివరకు ఎలాంటి ప్రాణహాని జరగలేదు.” అని అన్నారు.

బోగీలను తిరిగి పట్టాలెక్కించే ప్రయత్నంలో రైల్వే సిబ్బంది
ప్రమాదం కారణంగా మూడు రైలు బోగీలు కిందపడడంతో ఆ మార్గంలో ఇతర ట్రైన్ల రాకపోకలు నిలిచిపోయాయి. దీంతో రైల్వే ఉన్నతాధికారులు వెంటనే చేరుకున్నారు. రత్లామ్ డివిజనల్ మేనేజర్ రజనీష్ కుమార్ మాట్లాడుతూ.. రైల్వే లైన్ త్వరగా క్లియన్ చేయడానికి పనులు ప్రారంభించాం. త్వరలోనే రిపేరింగ్ ట్రైన్ తీసుకువచ్చి బోగీలను తిరిగి పట్టాలపై ఎక్కించడం జరుగుతుంది. ఇప్పటికే ఒక బోగీని పైకి లేపడం జరిగింది. రెండో బోగీ విషయంలో కష్టంగా ఉంది. అది కూడా త్వరలోనే పూర్తవుతుంది. రైలు ప్రమాదం జరగడానికి కారణాలను ఒక బృందం విశ్లేషిస్తోంది. ప్రస్తుతానికి ఈ మార్గంలో ప్రయాణించే ఏ ట్రైన్లు కూడా రద్దు చేయమని చెప్పలేదు. కానీ ఘటన కారణంగా కొన్ని ట్రైన్లు ఆలస్యం చేయడం జరిగింది. రైలు ప్రమాదం కారణంగా ఇరు వైపులా రెండు ట్రైన్లు నిలిచిపోయి ఉన్నయని తెలుస్తోంది.

Related News

UP Road Accident: యూపీలో ఘోర రోడ్డు ప్రమాదం.. 10 మంది కూలీలు మృతి

PM Modi Cabinet Committee: పశ్చిమాసియాలో యుద్ధ మేఘాలు.. భద్రతా వ్యవహారాల భేటీలో ప్రధాని ఏమన్నారు?

Isha Foundation: ఈషా ఫౌండేషన్‌‌లో పోలీసుల సోదాలు.. సుప్రీం కోర్టు కీలక ఆదేశాలు

Nitin Gadkari: ‘రోడ్డుపై ఉమ్మివేసే వారికి ఇలా చేయండి’.. స్వచ్ఛ భారత్ కోసం నితిన్ గడ్కరీ భలే ఐడియా..

Punjab Woman: ముగ్గురు దొంగలకు మూడుచెరువుల నీళ్లు తాపించిన మహిళ.. తట్టుకోలేక చివరకు వాళ్లు… వీడియో

Jan Suraj Party : పార్టీ పేరు ప్రకటించిన పీకే… టార్గెట్ రూ.5 లక్షల కోట్లట!

Big Stories

×