EPAPER

Good news for Air Passengers: విమాన ప్రయాణికులకు శుభవార్త.. 30నిమిషాల్లె బ్యాగేజ్‌ మీ చేతుల్లో!

Good news for Air Passengers: విమాన ప్రయాణికులకు శుభవార్త.. 30నిమిషాల్లె బ్యాగేజ్‌ మీ చేతుల్లో!

Good news for Air Passengers: విమాన ప్రయాణికులకు బ్యూరో ఆఫ్‌ సివిల్‌ ఏవియేషన్‌ సెక్యూరిటీ (బీసీఏఎస్‌) గుడ్‌న్యూస్‌ చెప్పింది. చివరి చెక్‌ ఇన్‌ బ్యాగేజీ చేరుకున్న ౩౦ నిమిషాలకే డెలివరీ అయ్యేలా చూడాలని బీసీఏఎస్ కొన్ని విమానయా సంస్థలకు సూచించింది. బీసీఏఎస్‌ తెలిపిన ఈ ఆదేశాలను అమలు చేయడానికి విమానయాన సంస్తలు ఫిబ్రవరి 26 వరకు సమయం కోరాయి.


ప్రస్తుతం విమాన ప్రయాణికులు బ్యాగేజీ కోసం ఎయిర్‌పోర్టుల్లో గంటలకొద్దీ ఎదురు చూస్తున్నారు. ఇప్పుడు బీసీఏఎస్‌ తీసుకున్న నిర్ణయంతో ఈ తిప్పలు తప్పనున్నాయి. ప్రయాణికులకు ౩౦ నిమిషాల్లో బ్యాగేజీ డెలివరీ చేయాలని ఆపరేషన్, మేనేజ్‌మెంట్ మరియు డెలివరీ అగ్రిమెంట్ ప్రకారం (ఓఎండీఏ) బీసీఏఎస్‌ నిర్ణయం తీసుకుంది.

ఈ ఆదేశాలను దేశంలోని ఎయిర్ ఇండియా, అకాస, ఇండిగో, స్పైస్‌జెట్, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ కనెక్ట్ , విస్తారా, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్‌ వంటి ఏడు విమానయాన సంస్థలు జారీ చేసింది. ఈ నిర్ణయాన్ని అమలులోకి తీసుకురావడానికి తమకు ఫిబ్రవరి 26 వరకు గడువు ఇవ్వాలని విమానయాన సంస్తలు బీసీఏఎస్‌ను కోరాయి.


Read More: అమెజాన్ అడవులు ఇక మాయం!

బీసీఏఎస్‌ గత నెల బెల్ట్ ప్రాంతాలలో బ్యాగేజీ చేరే సమయాన్ని ట్రాక్ చేయడానికి ఆరు ప్రధాన విమానాశ్రయాలను పర్యవేక్షించింది. ఆ పర్యవేక్షనలో నిర్దేశించిన ప్రమాణాల కంటే ఇది ఇంకా తక్కువగా ఉన్నా.. . పనితీరు మెరుగుపడినట్లు తెలింది.

ఇంజన్ షట్‌డౌన్ అయిన 10 నిమిషాలలోపు మొదటి బ్యాగ్ బెల్ట్‌కు చేరుకుంటే.. 30 నిమిషాలలోపు చివరి బ్యాగ్ చేరుకోవాలని ఓఎండీఏ నిబంధనలు పెట్టాయి. ప్రస్తుతం పర్యవేక్షించిన ఆరు ప్రధాన విమానాశ్రయాలే కాక బీసీఏఎస్‌ నిర్వహించే అన్ని విమానాశ్రయాలలో తప్పనిసరిగా అనుగుణంగా ఉండేలా చూడాలని విమానయాన సంస్థలను ఆదేశించింది.

Tags

Related News

Mahalakshmi Scheme: కాంగ్రెస్ హామీని కాపీ కొట్టిన బీజేపీ

Rahul Gandhi: ఖర్గే, నడ్డాల లేఖల యుద్ధం

Toxic Workplace: వర్క్ ప్రెజర్‌ తట్టుకోలేక ప్రైవేట్ ఉద్యోగిని మృతి.. రంగంలోకి దిగిన సర్కారు

Delhi CM: ఢిల్లీ సీఎంగా అతిశీ ప్రమాణానికి డేట్ ఫిక్స్

Rahul Gandhi Vs Ravneet Bittu: జాతీయ పార్టీల అధినేతల మధ్య లేఖల యుద్ధం..

Monkeypox Case in India: భారత్‌ను వణికిస్తున్న మంకీపాక్స్.. రెండో కేసు నమోదు.

Train accident in Uttar Pradesh: పట్టాలు తప్పిన మరో రైలు.. రైళ్ల రాకపోకలకు అంతరాయం

Big Stories

×