EPAPER

Gang War at Udupi: మిడ్ నైట్.. రెండు గ్యాంగుల ఫైటింగ్.. ఆర్థిక లావాదేవీలా..!

Gang War at Udupi: మిడ్ నైట్.. రెండు గ్యాంగుల ఫైటింగ్.. ఆర్థిక లావాదేవీలా..!

Gang War at Udupi: గ్యాంగ్ వార్ అంటే సహజంగా రెండు గ్యాంగులు కొట్టుకోవడం చూస్తాం. ఒకరిపై మరొకరు ముష్టిఘాతాలకు దిగుతారు. అక్కడ అలా కాదు ఏకంగా కార్లతో ఢీ కొట్టుకున్నాయి. ఆ తర్వాత ఇరువర్గాల వ్యక్తులు బయటకు వచ్చి రాళ్లతో దాడులకు దిగారు. ఈ ఘటనలో పోలీసులు ఇద్దర్నీ అరెస్ట్ చేశారు. మరో నలుగురు కోసం గాలింపు చేపట్టారు.


అసలేం జరిగిందన్న డీటేల్స్‌లోకి వెళ్తే… మే 18న రాత్రి సరిగ్గా పదకొండున్నర దాటి నిమిషాల ముల్లు 12 గంటల వైపు వెళ్తోంది. ఆ సమయంలో ఆరుగురు యువకులు ఉడుపి-మణిపాల్ హైవే పైకి రెండు కార్లతో వచ్చారు. వచ్చి రాగానే ఒక కారు మరొకదాన్ని ఢీ కొట్టింది. వెంటనే రెండు కార్లలోని వ్యక్తులు బయటకు వచ్చి ఒకరిపై మరొకరు దాడులు చేసుకోవడం మొదలైంది.

గ్యాంగ్‌లోని ఓ వ్యక్తి మరొక కారును ఆపే ప్రయత్నం చేశాడు. వాడ్ని హిట్ కొడుతూ ముందుకు సాగింది ఇంకొకటి. మళ్లీ ఆ కారు టర్న్ తీసుకుని వచ్చింది. కాసేపు రెండు కార్లు ఢీకొన్నాయి. వాహనాలు వెళ్తుండగానే గ్యాంగ్‌లకు సంబంధించిన వ్యక్తులు బయటకు వచ్చారు. ఆ తర్వాత ఒకరిపై మరొకరు రాళ్లతో దాడులు చేసుకున్నారు. ఈ ఘటనలో పలువురు గాయపడ్డారు. ఓ వ్యక్తికి తీవ్రంగా గాయాలయ్యాయి.


Also Read: దక్షిణాదిన దంచికొట్టుడు.. ఉత్తరాదిన ఉష్ణోగ్రతలు

ఈ తతంగాన్ని రోడ్డుపై బిల్డింగ్‌లో ఉన్న ఓ వ్యక్తి షూట్ చేసి సోషల్‌మీడియాలో పోస్టు చేశాడు. ఈ ఘటన వ్యవహారం వెలుగులోకి వచ్చింది. ఈ ఫైటింగ్‌లో ఆరుగురు వ్యక్తులు పాల్గొన్నట్లు తెలుస్తోంది. ఆర్థిక లావాదేవీల కారణంతోనే ఈ గొడవ జరిగినట్టు సమాచారం. వీడియో ఆధారంగా ఇద్దరు అదుపులోకి తీసుకున్న ఉడుపి పోలీసులు, మరో నలుగురి కోసం గాలింపు తీవ్రం చేశారు. ఈ యవ్వారంపై లోతుగా దర్యాప్తు మొదలుపెట్టారు పోలీసులు.

Tags

Related News

Rahul Gandhi: ఖర్గే, నడ్డాల లేఖల యుద్ధం

Toxic Workplace: వర్క్ ప్రెజర్‌ తట్టుకోలేక ప్రైవేట్ ఉద్యోగిని మృతి.. రంగంలోకి దిగిన సర్కారు

Delhi CM: ఢిల్లీ సీఎంగా అతిశీ ప్రమాణానికి డేట్ ఫిక్స్

Rahul Gandhi Vs Ravneet Bittu: జాతీయ పార్టీల అధినేతల మధ్య లేఖల యుద్ధం..

Monkeypox Case in India: భారత్‌ను వణికిస్తున్న మంకీపాక్స్.. రెండో కేసు నమోదు.

Train accident in Uttar Pradesh: పట్టాలు తప్పిన మరో రైలు.. రైళ్ల రాకపోకలకు అంతరాయం

Bank Holidays: ఖాతాదారులకు బిగ్ అలర్ట్.. అక్టోబర్‌లో భారీగా సెలవులు..ఎన్ని రోజులంటే?

Big Stories

×