EPAPER

Lake: భారత్‌లో మొట్టమొదటిసారి గడ్డకట్టిన సరస్సుపై పరుగు పందెం

Lake: భారత్‌లో మొట్టమొదటిసారి గడ్డకట్టిన సరస్సుపై పరుగు పందెం

Lake: ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన సరస్సుల్లో ఒకటి లద్దాఖ్‌లోని పాంగాంగ్ సరస్సు. సముద్రమట్టానికి 13,862 అడుగుల ఎత్తులో 70 చదరపు కిలోమీటర్లు ఈ సరస్సు విస్తరించి ఉంది. ప్రస్తుతం శీతాకాలం కావడంతో అక్కడ మైనస్ 30 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత ఉంది. దీంతో సరస్సు పూర్తిగా గడ్డకట్టుకుపోయింది.


అయితే గడ్డకట్టిన సరస్సుపై పరుగు పందెం నిర్వహించడానికి అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఫిబ్రవరి 20న ఈ పోటీ జరగనుంది. భారత్‌లో మొట్టమొదటిసారి ఇటువంటి పోటీని నిర్వహిస్తున్నారు. 21 కిలోమీటర్ల ఈ మారథాన్ పరుగు లుకుంగ్ నుంచి ప్రారంభమై మాన్ గ్రామం వరకు కొనసాగుతుంది. ఈ పోటీలో 50 మంది విదేశీ అథ్లెట్లు, 25 మంది స్వదేశీ అథ్లెట్లు మొత్తం 75 మంది పాల్గొననున్నారు. వారికి ముందుగా వైద్య పరీక్షలు నిర్వహించినాకే పోటీలోకి అనుమతిస్తామని అధికారులు తెలిపారు.

గిన్నిస్ వరల్డ్ రికార్డుగా నమోదుకానున్న ఈ మారథాన్‌కు లాస్ట్ రన్ అని పేరు పెట్టారు. ఇప్పటికే భారత సైన్యంతో పాటు ఇండో టిబెటన్ బోర్డర్ పోలీసులు కార్యక్రమం నిర్వహణ పనులు చేపట్టారు. ఈ ప్రాంతంలో పర్యాటక రంగాన్ని మరింత విస్తరించేందుకు ఈ మారథాన్ ఉపయోగపడుతుందని నిర్వాహకులు తెలిపారు.


Tags

Related News

Hand Foot Mouth: రాష్ట్రంలో ‘హ్యాండ్ ఫుట్ మౌత్’ కలకలం.. వ్యాధి లక్షణాలు ఇవే!

Hyderabad Real Boom: ఆ అందాల వలయంలో చిక్కుకుంటే మోసపోతారు.. హైదరాబాద్‌లో ఇల్లు కొనేముందు ఇవి తెలుసుకోండి

DSC Results 2024: డీఎస్సీ ఫలితాలను రిలీజ్ చేసిన సీఎం రేవంత్ రెడ్డి.. కేవలం 56 రోజుల్లోనే!

 Rice Prices: సామాన్యులకు మరో షాక్.. భారీగా పెరగనున్న బియ్యం ధరలు!

Nepal Floods: నేపాల్‌లో వరదలు.. 150 మంది మృతి.. బీహార్‌కు హెచ్చరికలు

PM Modi: తెలంగాణపై ప్రశంసల వర్షం.. మన్ కీ బాత్‌లో ప్రధాని మోదీ

Chicken Rates: మాంసం ప్రియులకు బ్యాడ్ న్యూస్.. భారీగా పెరిగిన చికెన్ ధరలు!

Big Stories

×