Apply or Register your Vote in Mobile: సార్వత్రిక ఎన్నికలకు సమయం సమీపిస్తోంది. 18 ఏళ్లు నిండిన వారు, ఓటు మిస్సైన వారంతా.. ఓటును నమోదు చేసుకుని, ఓటు హక్కును వినియోగించుకునేలా కేంద్ర ఎన్నికల సంఘం చర్యలు చేపట్టింది. ఎన్నికల్లో ఓటింగ్ శాతం పెంచడమే లక్ష్యంగా పెట్టుకున్న ఈసీ.. స్మార్ట్ మొబైల్లోనే ఆన్లైన్లో ఓటరుగా నమోదు చేసుకునే అవకాశాన్ని కల్పించింది. ఈ అవకాశం ఇంకొక్క రోజులో ముగుస్తుంది.
2006 మార్చి 31వ తేదీ లోపు పుట్టినవారంతా.. ఓటరుగా రిజిస్టర్ చేసుకోవచ్చు. ఇప్పటికీ ఎవరైనా ఓటరుగా నమోదు చేసుకోకపోయుంటే.. మీ ఫోన్ లోనే https://voters.eci.gov.in/ వెబ్ సైట్ లోకి వెళ్లి అప్లై చేసుకోండి. ఓట్ల జాబితాలో పేరు గల్లైంతైన వారు, ఓటు వేసే అర్హత ఉన్నా ఓటు హక్కు ఇంకా రాని వారు ఫారం-6 దరఖాస్తు ద్వారా ఓటును నమోదు చేసుకోవచ్చు.
మీ ఫోన్ నంబర్, ఈ-మెయిల్ అడ్రస్ ను ఎంటర్ చేశాక.. క్యాప్చా కోడ్ ను ఎంటర్ చేయండి. ఇప్పుడు మీ పేరు, పాస్ వర్డ్ పెట్టాక మొబైల్ నంబర్ కు వచ్చిన ఓటీపీని ఎంటర్ చేయాలి. మళ్లీ మీ మొబైల్ నంబర్ లేదా ఈ మెయిల్ ఐడీ ఎంటర్ చేశాక.. పాస్ వర్డ్ టైప్ చేసి.. క్యాప్చా కోడ్ ఎంటర్ చేస్తే మరో ఓటీపీ వస్తుంది.
Also Read: బీజేపీ మేనిఫెస్టో విడుదల చేసిన ప్రధాని మోదీ.. ప్రధాన అంశాలివి
ఇప్పుడు నెక్ట్స్ పేజీలో కొత్తగా ఓటరుగా నమోదయ్యేందుకు ఫారం-6ను పూర్తి చేయాలి. దీనికోసం పాస్ పోర్టు సైజ్ ఫొటో, అడ్రస్, బర్త్ సర్టిఫికేట్ లేదా పుట్టినతేదీని ధృవీకరించే పత్రాలను సబ్ మిట్ చేయాలి. వాటిని డాక్యుమెంట్లుగా అప్ లోడ్ చేయడంతో ఓటర్ నమోదు ప్రక్రియ పూర్తవుతుంది. అక్కడ వచ్చిన రిఫరెన్స్ నంబర్, స్టేట్ నేమ్ ఎంటర్ చేసి మీ అప్లికిషన్ స్టేటస్ ను ఇక్కడ https://voters.eci.gov.in/home/track తెలుసుకోండి.