EPAPER

Bus Collided Car: కారును ఢీ కొట్టిన బస్సు.. ఐదుగురు సజీవదహనం

Bus Collided Car: కారును ఢీ కొట్టిన బస్సు.. ఐదుగురు సజీవదహనం

Uttarpradesh Road Accident: ఉత్తరప్రదేశ్ లో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఐదుగురు సజీవదహనమయ్యారు. ఈ విషాద ఘటన మధుర పరిధిలోని మహవాన్ వద్ద యమునా ఎక్స్ ప్రెస్ వే పై సోమవారం ఉదయం రోడ్డు ప్రమాదం జరిగింది. 40 మంది ప్రయాణికులతో బీహార్ నుంచి ఢిల్లీ వైపు వెళ్తున్న బస్సు.. కారును ఢీ కొట్టడంతో ఐదుగురు మృతి చెందారు. వీరంతా సజీవ దహనమైనట్లు సమాచారం. బస్సు కారును ఢీ కొట్టడంతో మంటలు చెలరేగి కారు పూర్తిగా దగ్ధమైంది. బస్సులో ఉన్న ప్రయాణికులంతా సురక్షితంగా బయటపడ్డారు.


కాగా.. సిక్కింలోని గ్యాంగ్ టక్ లో ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతి చెందారు. రాణిపోల్ ప్రాంతంలో ఒక పాల ట్యాంకర్ రోడ్డుపై నిలబడి ఉన్న జనాలపైకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందగా.. మరో 150 మంది గాయపడ్డారు. వారిలో 30 మందికి తీవ్రగాయాలయ్యాయి. ఈ ప్రమాదానికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.

Read More : విరిగిపడిన కొండచరియలు.. 54 మంది మృతి..


రాణిపూల్ లోని తాంబ్లా గేమ్ ఫెయిర్ లో ఆదివారం రాత్రి సుమారు 7.15 గంటల సమయంలో ఈ ప్రమాదం జరిగింది. రాణిపూర్ టాటా మైదానం జనాలతో కిటకిటలాడుతుండగా.. సిక్కిం మిల్క్ యూనియన్ ట్యాంకర్ రోడ్డుపై ఉన్న నాలుగు కార్లను ఢీ కొని.. జనాలపైకి దూసుకొచ్చింది. దీంతో పలువురు ట్యాంకర్ కింద పడి నలిగిపోయారు. ముగ్గురు ఘటనా ప్రాంతంలోనే మరణించారు. సమాచారం అందుకున్న పోలీసులు క్షతగాత్రులను రాణిపూర్ ఆస్పత్రికి తరలించారు.

మరో ఘటనలో హైదరాబాద్ వాసి మృతి చెందింది. హిమాచల్ ప్రదేశ్ లోని కులూలో ఆదివారం పారా గ్లైడింగ్ చేస్తూ.. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ కు చెందిన నవ్య(26) మరణించింది. మనాలి సమీపంలోని దోభీ గ్రామంలో పారాగ్డైడింగ్ కు వెళ్లగా.. టేకాఫ్ అయిన కొద్దినిమిషాలకే టెన్డం ఫ్లైట్ లో ఈ దదుర్ఘటన జరిగింది. పర్యాటకురాలికి అమర్చిన సేఫ్టీ బెల్ట్ ను తనిఖీ చేయకుండానే పారాగ్లైడింగ్ కు వెళ్లడం వల్లే ప్రమాదం జరిగినట్లు అధికారులు తెలిపారు. పోలీసులు.. నిర్లక్ష్యంగా వ్యవహరించిన పారాగ్లైడింగ్ పైలట్ ను అరెస్ట్ చేశారు.

Tags

Related News

Nipah virus: కేరళలో నిఫా వైరస్ విజృంభణ.. స్టూడెంట్ మృతి.. రాష్ట్రంలో ఆంక్షలు!

PM Modi: ఇది ట్రైలర్ మాత్రమే.. ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు నాయుడు భేటీ

yashwant Sinha: వాజ్ పేయి సిద్ధాంతాలతో.. పార్టీ పేరు ప్రకటించిన యశ్వంత్ సిన్హా

Delhi: ఢిల్లీకి తదుపరి సీఎం ఎవరు? రేసులో ఆరుగురు పేర్లు.. వీళ్లేనా?

Rajasthan Road Accident: రాజస్థాన్‌లో ట్రక్కును ఢీకొట్టిన తుఫాను.. ఎనిమిది మంది దుర్మరణం

Jammu Kashmir: గాంధీ, నెల్సన్ మండేలాతో బీజేపీ పోల్చుతున్న ఈ బుఖారీ ఎవరు?

PM Narendra Modi: మరో 6 వందే భారత్ రైళ్లు.. వర్చువల్‌గా ప్రారంభించిన ప్రధాని మోదీ

Big Stories

×