EPAPER

Kumaraswamy Illegal Mining: ‘అవినీతికేసు విచారణ ఆపేయాలని కుమారస్వామి నన్ను బెదిరిస్తున్నారు’.. ఫిర్యాదు చేసిన సిట్ చీఫ్

Kumaraswamy Illegal Mining: ‘అవినీతికేసు విచారణ ఆపేయాలని కుమారస్వామి నన్ను బెదిరిస్తున్నారు’.. ఫిర్యాదు చేసిన సిట్ చీఫ్

Kumaraswamy Illegal Mining| కేంద్ర మంత్రి హెచ్ డి కుమారస్వామి తనను బెదిరిస్తున్నారని ఒక పోలీస్ ఉన్నతాధికారి శుక్రవారం ఎఫ్ఐఆర్ ఫైల్ చేశారు. అవినీతి కేసులో కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామికి వ్యతిరేకంగా విచారణ చేస్తున్న అదనపు డైరెక్టర్ జెనెరల్ ఆఫ్ పోలీస్ (ఏడిజీపి) ఎం. చంద్ర శేఖర్.. తనను, తన కటుంబాన్ని కుమారస్వామి ఆయన కుమారుడు బెదిరిస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నాడు.


కర్ణాటక ముఖ్యమంత్రి పదవిలో ఉన్న సమయంలో హెడి కుమారస్వామి 550 ఎకరాల భూమిలో చట్టవ్యతిరేకంగా మైనింగ్ కు అనుమతులిచ్చారని.. ఆరోపణలు రావడంతో ఈ కేసులో ప్రభుత్వం స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ (సిట్) ద్వారా విచారణ జరుపుతోంది. ఈ సిట్ విచారణ బృందానికి ఐపిస్ అధికారి ఎడిజిపి ఎం. చంద్ర శేఖర్ నేతృత్వం వహిస్తున్నారు. కర్ణాటకలోని బెల్లారి జిల్లాలో శ్రీ సాయి వెంకటేశ్వర మినలర్స్ కంపెనీకి 550 ఎకరాల భూమిలో మైనింగ్ చేసుకునేందకు కుమారస్వామి సిఎంగా ఉన్న సమయంలో అనుమతులిచ్చారు. ఈ అవినీతి కేసులో ఆరోపణలు రావడంతో కుమారస్వామి కోర్టు నుంచి బెయిల్ తెచ్చుకున్నారు. అయితే ప్రస్తుతం విచారణ చివరిదశలో ఉందని, ఈ కేసులో కుమారస్వామి కుమారుడు నిఖి కుమార్ స్వామి కీలక పాత్ర పోషించారిన సిట్ చీఫ్ చంద్రశేఖర్ తెలిపారు.

విచారణ పూర్తి చేసి మరికొద్ది రోజుల్లో చార్జ్ షీట్ సమర్పించాల్సిన సమయంలో కుమారస్వామి, ఆయన కుమారుడు తనకు విచారణ పూర్తి చేయకుండా అడ్డుపడుతున్నారని.. ఇటీవల మీడియా సమావేశం నిర్వహించిన కుమారస్వామి ఆ తరువాత ఇల్లీగల్ మైనింగ్ కేసు విచారణ ఆపేయకపోతే తనను ఉద్యోగం నుంచి సస్పెండ్ చేయిస్తానని, తన కుటుంబం పెద్ద సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని బెదిరించారని సిట్ చీఫ్ ఎడిజిపి ఐపిఎస్ ఎం చంద్రశేఖర్ తెలిపారు.


Also Read: ఆ రాజ్యానికి వారసుడిగా క్రికెటర్ అజయ్ జడేజా.. అధికారికంగా ప్రకటించిన రాజుగారు

ఇల్లీగల్ మైనింగ్ కేసులో ప్రస్తుత కేంద్ర మంత్రి కుమారస్వామి అవినీతికి పాల్పడినట్లు తమ వద్ద అన్ని ఆధారాలున్నాయని, కుమారస్వామిని విచారణ చేసేందకు నవంబర్ 2023లోనే కర్ణాటక గవర్నర్ ను అనుమతులు కోరామని వెల్లడించారు. అయితే గవర్నర్ ఈ కేసులో విచారణ పై స్పష్టత కోరగా.. తాను విచారణ చివరిదశలో ఉన్నట్లు సమాధానం చెప్పానని అన్నారు. అయితే తాజాగా సెప్టెంబర్ 28న కుమారస్వామి ఈ కేసు గురించి మీడియా సమావేశం పెట్టి తనపై, సిట్ బృందంపై తప్పుడు ఆరోపణలు చేశారని.. ఇదంతా విచారణను ఎలాగైనా ఆపేయాలని ఆయన చేస్తున్న ప్రయత్నాలని ఎడిజిపి అభిప్రాయపడ్డారు.

ఇటీవల తనను కుమారస్వామి కలిసి విచారణ ఆపేయాలని లేకపోతే ఉద్యోగం నుంచి తొలగించేస్తానని బెదిరించారని.. అంతటితో ఆగక తన కుటుంబాన్ని ఇబ్బంది పెడతానని చూపుడు వేలితో కుమారస్వామి వార్నింగ్ ఇచ్చినట్లు తెలిపారు. ఒక విచారణ చేస్తున్న పోలీస్ అధికారిని బెదిరించడం భారతీయ న్యాయ సంహిత 2023 చట్టం సెక్షన్ 224 ప్రకారం శిక్షర్హమైన నేరమని తెలిపారు. అందుకే బెంగుళూరులోని సంజయ్ నగర్ పోలీస్ స్టేషన్ లో కుమారస్వామిపై ఫిర్యాదు చేశానని అన్నారు.

Related News

25 Cr in Lucky Draw: అందుకే భార్య మాట వినాలి.. ఒక్కరోజులో రూ.25 కోట్లు.. ఈ భర్త భలే లక్కీ

Coast Guard News: అరేబియా సముద్రంలో హెలికాప్టర్ క్రాష్, 40 రోజుల తర్వాత పైలట్ మృతదేహం లభ్యం

Train Accident: మరో రైలు ప్రమాదం.. ఎగసిపడుతున్న మంటలు.. కాలిపోయిన బోగీలు

Jimmy Tata: అన్న అలా.. తమ్ముడు ఇలా.. అజ్ఞాతవాసి జిమ్మీ టాటా గురించి మీకు తెలుసా?

Air India: విమానంలో సాంకేతిక లోపం.. గాల్లోనే రెండు గంటలుగా చక్కర్లు.. బిక్కుబిక్కుమంటున్న 140 మంది ప్రయాణికులు!

TATA TRUST: నోయల్‌కే ఆ బాధ్యతలు.. టాటా ట్రస్ట్ ఛైర్మన్‌గా ఏకగ్రీవంగా ఎన్నిక

Big Stories

×