EPAPER

Budget 2024 : ఆశల బడ్జెట్ లో వరాలెవరికి ? బడ్జెట్ కు ఆమోదం తెలిపిన కేంద్ర కేబినెట్

Budget 2024 : ఆశల బడ్జెట్ లో వరాలెవరికి ? బడ్జెట్ కు ఆమోదం తెలిపిన కేంద్ర కేబినెట్

Union budget 2024 highlights(Live tv news telugu): ముచ్చటగా మూడోసారి ఎన్డీఏ సర్కార కొలువు దీరాక.. తొలిసారి పూర్తిస్థాయి బడ్జెట్ ను ప్రవేశపెట్టనుంది మోదీ ప్రభుత్వం. ఈ బడ్జెట్ పూర్తిగా మధ్యతరగతి వర్గాలకు ఊరట కలిగించేలా ఉంటుందని ఇప్పటి వరకూ ఉన్న సమాచారం. దీంతో బడ్జెట్ పై అందరికీ అంచనాలు భారీగా ఉన్నాయి. కొత్త పన్ను విధానంలో మార్పులు చేస్తారని, ఉద్యోగులకు ఆదాయపు పన్నులో ఊరట లభిస్తుందని ఆశిస్తున్నారు.


బడ్జెట్ కు ముందు పార్లమెంట్ లో కేంద్ర కేబినెట్ సమావేశమైంది. ఈ సమావేశంలో బడ్జెట్ కు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది.

Also Read : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు పెన్షన్ గా 50 శాతం సాలరీ.. బడ్జెట్‌లో ప్రతిపాదించే అవకాశం


ఉదయం 11.07 గంటలకు కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ 2024-25 బడ్జెట్ ను ప్రవేశపెట్టనున్నారు. వరుసగా ఏడోసారి బడ్జెట్ ను ప్రవేశపెట్టనున్న మంత్రిగా ఆమె రికార్డు సృష్టించనున్నారు. ఈ బడ్జెట్ లో ఈసారి అన్నదాతలకు పెద్దపీట వేయనున్నట్లు తెలుస్తోంది. పీఎం కిసాన్ పథకం కింట రైతులకు ఇచ్చే పంటసాయం రూ.6 వేలు ఉండగా.. దానిని రూ.8 వేలకు పెంచాలన్న డిమాండ్ వినిపిస్తుంది. మరి రైతులకోసం కేంద్రం ఎలాంటి నిర్ణయం తీసుకుందో చూడాలి.

Also Read : ‘వైద్య పరికరాల దిగుమతులపై కస్టమ్స్ డ్యూటీ పెంచండి’.. కేంద్రాన్ని కోరిన దేశీయ కంపెనీలు

అలాగే సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు కూడా ఊరటనిచ్చేలా ఒక ప్రకటన చేస్తుందని సమాచారం. చిన్న పరిశ్రమల నుంచి సరుకులు కొనుగోలు చేస్తే 45 రోజుల్లోగా చెల్లింపులు చేయాలని కార్పొరేట్ కంపెనీలకు ఉన్న నిబంధనలను కేంద్రం తొలగించనుందని సమాచారం. సూక్ష్మ, చిన్న, మధ్య తరహా వ్యాపారాలను ప్రోత్సహించేందుకు కేంద్రం ఆదాయపు పన్ను నుంచి 43B(H) లో మార్పులు చేయాలని నిపుణులు సూచించగా.. అందుకు కేంద్రం అంగీకరించింది.

Also Read : దేశ చరిత్రలో అతి ముఖ్యమైన బడ్జెట్లు.. డ్రీమ్ బడ్జెట్, బ్లాక్ బడ్జెట్, ఎపోచల్ బడ్జెట్ వివరాలు

ఇక బడ్జెట్ లో ఏయే వస్తువుల ధరలు తగ్గుతాయి.. ఏయే వస్తువుల ధరలు పెరుగుతాయోనని అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈసారి బడ్జెట్ లో మొబైల్ ఫోన్ల ధరలు తగ్గుతాయన్న సమాచారం ఉంది. గతేడాది ప్రవేశపెట్టిన బడ్జెట్ లో మొబైల్ ఫోన్ల తయారీకి వాడే విడిభాగాలపై పన్నుల్ని తగ్గించింది. దాంతో దేశీయ మొబైల్స్ వాడకం పెరిగింది. మొబైల్స్, ఎలక్ట్రానిక్స్ రేట్లను తగ్గించేలా మళ్లీ ప్రొడక్ట్ లింక్డ్ ఇన్సెంటివ్ (పీఎల్ఐ) పథకాన్ని మళ్లీ అమలు చేయాలని యోచిస్తోంది.

Also Read : మొబైల్ ఫోన్స్ ధరలు తగ్గుతాయా?.. కొత్త బడ్జెట్‌పై ఆశలు..

బడ్జెట్ లో ఊరట లభిస్తుందని చూస్తున్న మరో పథకం అటల్ పెన్షన్ యోజన పథకం. ఈ పథకాన్ని వృద్ధుల కోసం కొన్నేళ్ల క్రితం ప్రారంభించింది ప్రభుత్వం. 60 ఏళ్ల వరకూ చేసుకున్న సేవింగ్స్ ను.. 60 ఏళ్లు దాటిన పౌరులకు.. సేవింగ్స్ చేసుకున్న దానిని బట్టి నెలకు రూ.1000 నుంచి రూ.5000 వరకూ ప్రభుత్వం పెన్షన్ రూపంలో చెల్లిస్తుంది. అయితే ఈ పరిమితిని బడ్జెట్ లో రూ.10 వేల వరకూ పెంచనున్నట్లు సమాచారం. జూన్ 20, 2024 వరకూ ఈ పథకంలో 66.2 మిలియన్ల మంది ఉంటే.. 12.2 మిలియన్ల మంది 2023-24 ఆర్థిక సంవత్సరంలోనే కొత్తగా నమోదు చేసుకున్నారు.

Related News

Mahalakshmi Scheme: కాంగ్రెస్ హామీని కాపీ కొట్టిన బీజేపీ

Rahul Gandhi: ఖర్గే, నడ్డాల లేఖల యుద్ధం

Toxic Workplace: వర్క్ ప్రెజర్‌ తట్టుకోలేక ప్రైవేట్ ఉద్యోగిని మృతి.. రంగంలోకి దిగిన సర్కారు

Delhi CM: ఢిల్లీ సీఎంగా అతిశీ ప్రమాణానికి డేట్ ఫిక్స్

Rahul Gandhi Vs Ravneet Bittu: జాతీయ పార్టీల అధినేతల మధ్య లేఖల యుద్ధం..

Monkeypox Case in India: భారత్‌ను వణికిస్తున్న మంకీపాక్స్.. రెండో కేసు నమోదు.

Train accident in Uttar Pradesh: పట్టాలు తప్పిన మరో రైలు.. రైళ్ల రాకపోకలకు అంతరాయం

Big Stories

×