EPAPER

Formers ‘Delhi Chalo’: హర్యాణ బార్డర్ లో దూసుకొస్తున్న రైతులు.. బాష్పవాయువు ప్రయోగించిన పోలీసులు!

Formers ‘Delhi Chalo’: హర్యాణ బార్డర్ లో దూసుకొస్తున్న రైతులు.. బాష్పవాయువు ప్రయోగించిన పోలీసులు!

Farmers “Delhi Chalo” Today: దేశ రాజధానిలో రైతులు మరోసారి కదం తొక్కారు. కేంద్రం గతంలో ఇచ్చిన డిమాండ్లను నెరవేర్చాలని కోరతూ ఢిల్లీ చలోకి పిలుపునిచ్చారు. మొదట డిమాండ్ల పరిష్కారానికి రెండు దఫాలుగా చర్చలు జరిపారు. కానీ, చర్చలు విఫలం కావడంతో భారీస్థాయిలో ఆందోళన చేపట్టేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. ఢిల్లీ చుట్టుపక్కల రాష్ట్రాల రైతులంతా.. ఢిల్లీకి ర్యాలీగా బయల్దేరగా.. పోలీసులు ఎక్కడికక్కడ అరెస్టులు చేశారు.


ఉదయం 10 గంటలకు పంజాబ్ లోని ఫతేగఢ్ సాహిబ్ నుంచి వేలాదిమంది రైతులు ట్రాక్టర్లతో ఢిల్లీకి బయల్దేరారు. రైతుల్ని అడ్డుకునేందుకు పోలీసులు బారికేడ్లను ఏర్పాటు చేశారు. ఢిల్లీ సరిహద్దుల్లో రైతుల ఆందోళనను భగ్నం చేసేందుకు అత్యంత కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేయడంతో.. ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పంజాబ్, హర్యానా సరిహద్దుల్లో యుద్ధవాతావరణం కనిపిస్తోంది. రైతులను చెదరగొట్టేందుకు శంభు బోర్డర్ లో టియర్ గ్యాస్ ను ప్రయోగించారు. ఢిల్లీ అంతటా 144 సెక్షన్ అమల్లో ఉంది. ఎర్రకోట వద్ద కూడా పరిస్థితి ఉద్రిక్తంగా ఉండటంతో భారీగా భద్రతా బలగాలు చేరుకున్నాయి. ఢిల్లీకి చేరుకునే అన్ని మార్గాల్లోనూ భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది.

కాగా.. ఢిల్లీ చలో కార్యక్రమాన్ని విరమించుకోవాలని కోరుతూ కేంద్రం రైతుసంఘాల నేతలతో చండీగఢ్‌ లో నిన్న చర్చలు జరిపింది. అర్ధరాత్రి వరకూ జరిగిన ఈ చర్చలు విఫలమయ్యాయి. కేంద్ర మంత్రులు పీయూష్‌ గోయల్‌, అర్జున్‌ ముండా.. రైతుల సంఘాల నేతలతో సమాలోచనలు జరిపారు.


Read More: బరేలీ బరిలో ప్రియాంక..? రాజ్యసభకు సోనియా..?

2020-21లో రైతుల ఆందోళనలు చేసిన రైతులపై కేసుల ఉపసంహరణకు సెంట్రల్ టీం అంగీకరించింది. అప్పటి ఆందోళనల్లో మరణించిన రైతుల కుటుంబాలకు ఇంకా ఎవరికైనా పరిహారం దక్కకపోతే వారికీ పరిహారం చెల్లిస్తామని హామీ ఇచ్చింది. కానీ, కనీస మద్దతు ధరకు చట్టబద్ధత కల్పించాలని రైతు నాయకులు గట్టిగా డిమాండ్‌ చేశారు. ఈ విషయంలో రైతుల సంఘాల నేతలకు, కేంద్ర బృందానికి ఏకాభిప్రాయం కుదరలేదు. దీంతో.. చలో ఢిల్లీ యథాతథంగా కొనసాగుతుందని రైతు నాయకులు తేల్చి చెప్పారు.

రైతుల ఆందోళనలు భగ్నం చేసేందుకు పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. ఢిల్లీ సరిహద్దుల్లో భారీగా బలగాలను మోహరించారు. దేశరాజధానిలో సోమవారం నుంచే 144 సెక్షన్ అమలులోకి వచ్చింది. నగరంలో ట్రాక్టర్లను అనుమతించేదే లేదని తేల్చి చెప్పారు. తుపాకులు, మండే స్వభావం ఉన్న పదార్థాలు, ఇటుకలు, రాళ్లు, పెట్రోల్‌ వంటి వాటిని ఎవరూ తీసుకుని రాకూడదని స్పష్టం చేశారు. ఇక.. లౌడ్‌ స్పీకర్ల వాడకంపైనా ఈ ఆంక్షలు విధించారు. ఇప్పటికే బారీ కేడ్లు పెద్ద ఎత్తున ఏర్పాటు చేశారు. అనుమతి లేకుండా ఎవరినీ ఢిల్లీలోకి అనుతించడం లేదు. ఢిల్లీ హర్యానా సరిహద్దులను మూసివేశారు.

Read More: అన్నదాత పోరు బాట.. ఢిల్లీలో 144 సెక్షన్.. హై టెన్షన్..

రహదారిపై ఇసుక సంచులు, ముళ్ల కంచెలు, కాంక్రీటు దిమ్మెలను అడ్డుగా పెట్టారు. హర్యానా పోలీసులు టియర్ గ్యాస్ మాక్ డ్రిల్‌ను కండక్ట్ చేశారు. డ్రోన్ల సాయంతో టియర్ గ్యాస్ ప్రయోగించారు. పలు ప్రాంతాల్లో డ్రోన్లతో పరిస్థితులను పర్యవేక్షిస్తున్నారు. ఇప్పటికే ఢిల్లీ వైపుగా వెళ్తున్న ఎక్కడిక్కడ పోలీసులు అదుపులోకి తీసుకుంటున్నారు. కర్ణాటక నుంచి వెళ్తున్న 100 మంది రైతులను భోపాల్‌లో రైల్వే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

చలో ఢిల్లీ కార్యక్రమానికి రైతులు పెద్ద ఎత్తున హాజరవుతున్నారని నిఘావర్గాలు అనుమానిస్తున్నారు. దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల నుంచి కనీసం 20 వేలమంది రైతులు వస్తారని అంచనా వేస్తున్నారు. ఆందోళనలు ఎలా చేపట్టాలనే దానిపై రైతుల సంఘాలు రిహార్సల్స్ కూడా నిర్వహించారు.

పంజాబ్‌లో 30 సార్లు, హరియాణాలో 10 సార్లు రిహార్సల్స్ జరిగాయని నిఘా వర్గాలకు సమాచారం ఉంది. 2000 వేల ట్రాక్టర్లతో ఢిల్లీని చుట్టు ముట్టేందుకు రైతుల భారీ ఎత్తున బయలుదేరారు. హర్యాణ బార్డర్ లో రైతులను పోలీసులు అడ్డకునే ప్రయత్నం చేశారు. దీంతో ఒక్క సారిగా ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. రైతులు పోలీసులను దాటుకుంటూ ముందుకు వెళ్లేందుకు ప్రయత్నించారు. దీంతో వారిపై పోలీసులు బాష్పవాయువు, వాటర్ ఫోర్స్ ను ఉపయోగించి రైతులను చెదరగొట్టారు.

Related News

Mahalakshmi Scheme: కాంగ్రెస్ హామీని కాపీ కొట్టిన బీజేపీ

Rahul Gandhi: ఖర్గే, నడ్డాల లేఖల యుద్ధం

Toxic Workplace: వర్క్ ప్రెజర్‌ తట్టుకోలేక ప్రైవేట్ ఉద్యోగిని మృతి.. రంగంలోకి దిగిన సర్కారు

Delhi CM: ఢిల్లీ సీఎంగా అతిశీ ప్రమాణానికి డేట్ ఫిక్స్

Rahul Gandhi Vs Ravneet Bittu: జాతీయ పార్టీల అధినేతల మధ్య లేఖల యుద్ధం..

Monkeypox Case in India: భారత్‌ను వణికిస్తున్న మంకీపాక్స్.. రెండో కేసు నమోదు.

Train accident in Uttar Pradesh: పట్టాలు తప్పిన మరో రైలు.. రైళ్ల రాకపోకలకు అంతరాయం

Big Stories

×