EPAPER

Toxic Workplace: వర్క్ ప్రెజర్‌ తట్టుకోలేక ప్రైవేట్ ఉద్యోగిని మృతి.. రంగంలోకి దిగిన సర్కారు

Toxic Workplace: వర్క్ ప్రెజర్‌ తట్టుకోలేక ప్రైవేట్ ఉద్యోగిని మృతి.. రంగంలోకి దిగిన సర్కారు

Work Pressure: ప్రైవేట్ కంపెనీల్లో టార్గెట్లు అని, కంప్లీట్ చేయాల్సిన టాస్క్‌లు అని ఒత్తిళ్లు షరామామూలుగానే ఉంటాయి. సమయానికి, బాధ్యతకు మించి పని భారాన్ని మోయడం కూడా ఉంటుంది. వీటికితోడు వర్క్‌ప్లేస్ టాక్సిక్‌గా ఉంటే ఇక ఆ ఉద్యోగి.. కంపెనీలో నరకయాతన పడాల్సిందే. తీవ్రమైన వర్క్ ప్రెజర్, టాక్సిక్ కల్చర్‌తో ఎంప్లాయీ మానసికంగా, శారీరకంగా బలహీనులవుతారు. ఎర్నస్ట్ అండ్ యంగ్ (ఈ అండ్ వై)ఇండియా కంపెనీలో ఆ ఉద్యోగి ఎంతలా వర్క్ ప్రెజర్‌కు గురైందంటే శారీరకంగా, మానసికంగా చితికిపోయింది. విశ్రాంతి తీసుకున్నా కోలుకోలేని స్థితికి వెళ్లిపోయింది. హాస్పిటల్‌లో చికిత్స పొందుతూ మరణించింది. ఈ ఘటన నేటి ప్రైవేటురంగంలోని ఉద్యోగాలకు సంబంధించి ఓ ఆందోళనకర అంశాన్ని బహిరంగ చర్చకు పెట్టింది. సదరు ఉద్యోగి తల్లి.. ఆ కంపెనీ హెడ్‌కు రాసిన లేఖ.. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నది. లేఖ చదివితే గుండె బరువెక్కడం ఖాయం. నెటిజన్లు ఈ ఘటనపై తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే కేంద్ర ప్రభుత్వం రంగప్రవేశం చేసింది.


26 ఏళ్ల చార్టర్డ్ అకౌంటెంట్ అన్నా సెబాస్టియన్ పెరాయిల్ 2020 జనవరిలో తన కెరీర్‌ను ప్రారంభించింది. ఆడిట్ అసిస్టెంట్‌లో మూడేళ్లు పని చేసింది. ఆరు నెలల క్రితమే ఆమె ఎర్నస్ట్ అండ్ యంగ్ కంపెనీలో చేరింది. ఆడిట్ అండ్ అష్యూరెన్స్ ఎగ్జిక్యూటివ్‌గా కొత్త పొజిషన్‌లోకి వెళ్లింది. ఈ విషయాన్ని తన లింక్డిన్‌లో సంతోషంగా పంచుకుంది కూడా. కానీ, ఆఫీసులో పరిస్థితులు చాలా అసహజంగా, నరకప్రాయంగా ఉన్నాయి. ఆమె బాస్ తీవ్రమైన పని ఒత్తిడికి గురి చేశాడు. టాస్కుల మీద టాస్కులు అప్పజెప్పాడు. ఎక్సెస్సివ్ వర్క్‌తో 26 ఏళ్ల అన్నా సెబాస్టియన్ చితికిపోయింది.

మార్చి నెలలో ఈ అండ్ వై కంపెనీలో జాయిన్ అయిన సెబాస్టియన్ నాటికే మళ్లీ కోలుకలేనంతగా అలసిపోయారు. ఆమెను పూణేలోని హాస్పిటల్‌లో అడ్మిట్ చేశారు. జులై 20వ తేదీన ఆమె తన తుది శ్వాస విడిచిపెట్టింది. ఈ ఘటన సాధారణ ఘటనలాగే కాలగర్భంలో కలిసిపోయేది. కానీ, ఆమె తల్లి అనితా ఆగస్టిన్ ఈ అండ్ వై ఇండియా హెడ్‌కు ఓ లేఖ రాసింది. తీవ్రమైన వర్క్ ప్రెజర్‌కు గురి చేసిన తన బిడ్డ.. అనారోగ్యానికి గురైందని, అది అంతిమంగా ఆమె ప్రాణాలనే తీసిందని బాధపడ్డారు. అన్నా సెబాస్టియన్ మేనేజర్లు నిత్యం ఆమెకు పనులు అప్పజెబుతూనే వచ్చారని, సుదీర్ఘమైన గంటలు ఆమె పని చేస్తూనే ఉండాల్సి వచ్చిందని తల్లి అనితా ఆగస్టిన్ తెలిపింది. తన బిడ్డ అంత్యక్రియలకు ఈ అండ్ వై నుంచి కనీసం ఒక్కరు కూడా రాలేదని ఆ కంపెనీ నిర్దయ గురించి ప్రస్తావించారు.


Also Read: 2050 నాటికి 4 కోట్లకు పైగా మరణాలు.. వాటివల్లే ఆ ముప్పు, తాజా స్టడీలో షాకింగ్ విషయాలు వెల్లడి

ఈ ఘటనపై మాజీ కేంద్రమంత్రి రాజీవ్ చంద్రశేఖర్ రియాక్ట్ అయ్యారు. ఈ ఘటన తనను చాలా ఇబ్బందికి గురి చేసిందని, ఆమె కుటుంబ ఆరోపణలపై, ఈ అండ్ వైలో వర్క్ ఎన్విరాన్మెంట్ పై దర్యాప్తు చేయాలని పేర్కొన్నారు. ఈయన ట్వీట్‌కు కేంద్ర కార్మిక శాఖ సహాయ మంత్రి శోభా స్పందించి.. ఈ ఘటనపై సమగ్రమైన విచారణ చేపడుతున్నట్టు తెలిపారు. అనారోగ్యకర, పీడించే, శ్రమదోపిడీ చేసే వర్క్ ఎన్విరాన్మెంట్‌పై దర్యాప్తు జరుగుతున్నట్టు వెల్లడించారు.

ఇక ఈ అండ్ వై ఈ ఘటనపై మొక్కుబడిగా రియాక్ట్ అయింది. తమ ఉద్యోగుల క్షేమం కోసం మంచి వర్క్ ఎన్విరాన్మెంట్ ఏర్పడేలా చర్యలు తీసుకుంటామని పేర్కొంది. సెబాస్టియన్ గురించి ఒక్క మాట కూడా పేర్కొనలేదు. దీనిపైనా నెటిజన్లు మండిపడుతున్నారు.

Related News

Mahalakshmi Scheme: కాంగ్రెస్ హామీని కాపీ కొట్టిన బీజేపీ

Rahul Gandhi: ఖర్గే, నడ్డాల లేఖల యుద్ధం

Delhi CM: ఢిల్లీ సీఎంగా అతిశీ ప్రమాణానికి డేట్ ఫిక్స్

Rahul Gandhi Vs Ravneet Bittu: జాతీయ పార్టీల అధినేతల మధ్య లేఖల యుద్ధం..

Monkeypox Case in India: భారత్‌ను వణికిస్తున్న మంకీపాక్స్.. రెండో కేసు నమోదు.

Train accident in Uttar Pradesh: పట్టాలు తప్పిన మరో రైలు.. రైళ్ల రాకపోకలకు అంతరాయం

Big Stories

×