EPAPER

EC Note on 4th Phase Polling: నాలుగో విడత పోలింగ్.. 10 రాష్ట్రాల్లో ఎన్నికలు.. బరిలో 1717 మంది..!

EC Note on 4th Phase Polling: నాలుగో విడత పోలింగ్.. 10 రాష్ట్రాల్లో ఎన్నికలు.. బరిలో 1717 మంది..!

Election Commission Released Press Note On 4th Phase Polling: లోక్ సభ ఎన్నికల్లో భాగంగా నాలుగో విడత పోలింగ్ మే 13న జరగనుంది. దీంతో ఎన్నికల కమిషన్ శుక్రవారం ప్రెస్ నోట్ విడుదల చేసింది. మొత్తం 10 రాష్ట్రాల్లోని 96 పార్లమెంట్ స్థానాలకు పోలింగ్ జరగనుండగా 1717 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. ఇందులో అత్యధికంగా తెలంగాణ నుంచి 525 మంది అభ్యర్థులు 17 ఎంపీ స్థానాల బరిలో నిల్చున్నారు. ఇక ఆంధ్రప్రదేశ్‌లోని 25 స్థానాలకు 454 మంది అభ్యర్థులు అమీతుమీ తేల్చుకోనున్నారు.


ఇక బీహార్‌లోని 5 పార్లమెంట్ స్థానాలకు పోలింగ్ జరగనుండగా 55 మంది పోటీలో నిలిచారు. జమ్మూ కాశ్మీర్లో ఒక్క పార్లమెంటు స్థానానికి 24 మంది పోటీపడుతున్నారు. ఝార్ఖండ్‌లోని 4 పార్లమెంట్ స్థానాలకు పోలింగ్ జరగనుండగా 45 మంది పోటీలో ఉన్నారు. మధ్యప్రదేశ్‌లోని 8 పార్లమెంటు స్థానాలకు గానూ 74 మంది పోటీపడుతున్నారు. అటు మహారాష్ట్రలో 11 పార్లమెంటు స్థానాలకు పోలింగ్ జరగనుండగా 209 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. ఒడిశాలో 4 పార్లమెంట్ స్థానాలకు 37 మంది అభ్యర్థులు పోటీపడుతున్నారు. ఉత్తరప్రదేశ్‌లోని 13 స్థానాలకు పోలింగ్ జరగనుండగా 130 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. ఇక పశ్చిమ బెంగాల్‌లో 8 స్థానాల్లో 75 మంది అభ్యర్థులు పోటీలో నిలిచారు.

Also Read: చివరి నిమిషంలో మార్పులు, రాయ్‌బరేలి నుంచి రాహల్


మొత్తం 96 స్థానాలకు 4264 నామినేషన్లు రాగా.. స్క్రుటినీ తర్వాత ఆ సంఖ్య 1970కు చేరుకుంది. ఇక ఉపసంహరణ గడువు ముగిసాక మొత్తం 1717 మంది మే 13న జరగనున్న పోలింగ్‌లో తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో నామినేషన్ల సంఖ్య ఎక్కువగా ఉంది. 17 ఎంపీ స్థానాలకు గాను 1488 నామినేషన్లు రాగా.. ఆంధ్రప్రదేశ్‌లోని 25 ఎంపీ స్థానాలకు 1103 నామినేషన్లు వచ్చాయి. తెలంగాణలోని మల్కాజ్‌గిరి పార్లమెంట్ స్థానానికి 177 నామినేషన్లు రాగా.. నల్గొండ, భువనగిరి స్థానాలకు చెరో 144 నామినేష్లను వచ్చాయి.

Related News

Mahalakshmi Scheme: కాంగ్రెస్ హామీని కాపీ కొట్టిన బీజేపీ

Rahul Gandhi: ఖర్గే, నడ్డాల లేఖల యుద్ధం

Toxic Workplace: వర్క్ ప్రెజర్‌ తట్టుకోలేక ప్రైవేట్ ఉద్యోగిని మృతి.. రంగంలోకి దిగిన సర్కారు

Delhi CM: ఢిల్లీ సీఎంగా అతిశీ ప్రమాణానికి డేట్ ఫిక్స్

Rahul Gandhi Vs Ravneet Bittu: జాతీయ పార్టీల అధినేతల మధ్య లేఖల యుద్ధం..

Monkeypox Case in India: భారత్‌ను వణికిస్తున్న మంకీపాక్స్.. రెండో కేసు నమోదు.

Train accident in Uttar Pradesh: పట్టాలు తప్పిన మరో రైలు.. రైళ్ల రాకపోకలకు అంతరాయం

Big Stories

×