EPAPER

Elderly Man Abused Over Beef: ట్రైన్ లో వృద్ధుడిపై దాడి చేసిన అల్లరిమూకలు.. బీఫ్ తీసుకెళుతున్నాడని అనుమానంతో..!

Elderly Man Abused Over Beef: ట్రైన్ లో వృద్ధుడిపై దాడి చేసిన అల్లరిమూకలు.. బీఫ్ తీసుకెళుతున్నాడని అనుమానంతో..!

Elderly Man Abused Over Beef| తన కూతురి ఇంటికి వెళ్లడానికి రైలు ప్రయాణం చేస్తున్న ఓ 80 ఏళ్ల వృద్ధుడిపై అతని తోటి ప్రయాణీకులు దాడి చేశారు. ముదుసలి వ్యక్తి అని కూడా చూడకుండా అమానవీయంగా తిట్టడం, కొట్టడం చేశారు. ఇదంతా జరుగుతుంటే పక్కనే ఉన్న మిగతా ప్యాసింజర్లంతా చూస్తూ నిలబడ్డారు. కొందరైతే నవ్వుతూ నిలబడ్డారు. ఈ ఘటన ని అక్కడే ఉన్న ఒక వ్యక్తి వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అది ఇప్పుడు వైరల్ గా మారింది. అయితే ఈ వైరల్ వీడియో చూసి రైల్వే పోలీసులు విచారణ మొదలుపెట్టారు. ఈ ఘటన మహారాష్ట్రలో జరిగింది.


పోలీసుల కథనం ప్రకారం.. అష్రఫ్ మునియార్ అనే 80 ఏళ్ల వృద్ధుడు మహారాష్ట్రలోని జల్ గావ్ లో నివసిస్తున్నాడు. ఆయన తన కూతురిని కలిసేందుకు మాలెగావ్ వెళ్లేందుకు ధూలే ఎక్స్ ప్రెస్ ట్రైన్ లో ఎక్కడా. ప్రయాణం సాగుతున్న సమయంలో మునియార్ భోజనం చేసేందుకు తనతో తెచ్చుకున్న బాక్సు తెరిచి తింటున్న సమయంలో అష్రఫ్ తో పాటు ఉన్న కొంతమంది యువకులు అనుమానంగా ఆయన చేయిని పట్టుకున్నారు.

ఆష్రఫ్ తింటున్న ఆహారం మాంసం ఉండడంతో అది గోమాంసం అని ఆ యువకుడు అనుమానపడ్డారు. దీంతో ఓ 12 మంది యువకులు ఒంటరిగా ఉన్న బలహీన వృద్ధుడిని గట్టిగా పట్టుకున్నారు. ఆయన ముఖంపై ఎడాపెడా కొట్టారు. ఆ తరువాత ప్రశ్నించడం మొదలుపెట్టారు. నువ్వేం తీసుకెళుతున్నావ్?.. ఎక్కడికి వెళుతున్నావ్?.. ఎక్కడి నుంచి వస్తున్నావ్? నీకు మేక మాంసం దొరకలేదా? ఎంత మంది కోసం గోమాంసం తీసుకెళుతున్నావ్? అని పరుషంగా మాట్లాడుతూ.. బూతులు తిట్టారు.


అయితే ఆ ముసలి వ్యక్తి తనని కొట్టవద్దని బతిమాలాడు. తాను తింటున్నది గోమాంసం కాదని.. బర్రె మాంసమని చెప్పాడు. అయినా ఆ యువకుడు సంతృప్తి చెందలేదు. వారిలో ఒకరు ఫోన్ లో ఆ వృద్ధుడిని హింసించే వీడియోలను సంతోషంగా తీయసాగాడు.

అష్రఫ్ మునియార్ చెప్పిన సమాధానానికి బదులిస్తూ.. ”నువ్వ చెప్పేది నిజమో? కాదో? మేము తెలుసుకుంటాం. అయినా ఇది శ్రావణ మాంసం. మాకు పవిత్ర పండుగల మాసం. కానీ నువ్వు ఇలాంటి అపవిత్ర ఆహారం తింటావా?.. ”అని కోపంగా ప్రశ్నించారు.

మహారాష్ట్ర జంతు సంరక్షణ చట్టం, 1976 ప్రకారం.. ఆవులు, ఎద్దులను వధించడం నిషేధం. కానీ బర్రెల వధించడం పై నిషేధం లేదు. ఈ ఘటనకు సంబంధించి.. వైరల్ వీడియో చూసిన రైల్వే కమిషనర్ ముసలి వ్యక్తిపై దాడి చేసిన యువకులపై కేసు నమోదు చేశారు. రైల్వే పోలీసులు ఆ యువకుల కోసం గాలిస్తున్నారు.

వీడియోలో ఉన్న ముసలి వ్యక్తిని జీఆర్‌పి పోలీసులు సంప్రదించారు. అయితే అష్రఫ్ మునియార్.. ఆ యువకులపై ఎటువంటి కేసు నమోదు చేయడానికి ముందుగా నిరాకరించాడు. దాడి చేసిన వారిలో ఇద్దరు యువకులను పోలీసులు గుర్తించినట్లు తెలిపారు. వారంతా ధూలె గ్రామానికి చెందిన వారని.. త్వరలోనే పట్టుకుంటామని పోలీసులు చెప్పారు.

Also Read: లేటు వయసులో సోగ్గాడి వేషాలు.. యువతులు కావాలని ఆ రిటైర్డ్ ఉద్యోగి ఏం చేశాడంటే..

ఈ అమానవీయ ఘటనపై మహారాష్ట్ర రాజకీయ నాయకుడు.. షరద్ పవార్ స్పందించారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు దిగజారిపోయాయని చెప్పడానికి ఈ ఘటన ఉదాహరణగా చెప్పవచ్చు. కొందరు యువకుడు ఆ వ్యక్తి బీఫ్ తీసుకెళుతున్నాడని అనుమానంతో చితకాబాదారు. ఇలా మహారాష్ట్రలో జరగదు. ఇది మన సంప్రదాయం కాదు. ఈ హింస ఎప్పుడు ఆగుతుంది?.. మహారాష్ట్రలో 80 శాతం ప్రజలు మాంసాహారులు, కోస్తా ప్రాంతంలో నివసించే 95 శాతం ప్రజలు మాంసాహారులే. మేము అన్ని మతాలను గౌరవించాలి. జైన మతాన్ని కూడా గౌరవించాలి. కానీ ఇలా ప్రజలను ద్వేషంతో అనుమానిస్తూ.. హింసాత్మకంగా దాడి చేస్తారా? తండ్రి వయసుగల ఒక వృద్ధ వ్యక్తిని కొట్టడానికి ఆ యువకులకు సిగ్గనింపించలేదా?.. ఆ యువకులు ఈ పాటికి పారిపోయి కూడా ఉంటారు?.. ” అని ఉద్వేగంగా మాట్లాడారు.

మహారాష్ట్రలో ఇటీవల బద్లాపూర్ ప్రాంతంలో ఓ యువతిపై అత్యాచారం ఘటన మరువక ముందే ఈ ట్రైన్ దాడి ఘటన వెలుగులోకి వచ్చింది.

Also Read:  ‘నా ఇష్టం మీకేంటి?’.. 16 ఏళ్ల అబ్బాయిని డేట్ చేస్తున్న 21 ఏళ్ల భామ..

Related News

Mahalakshmi Scheme: కాంగ్రెస్ హామీని కాపీ కొట్టిన బీజేపీ

Rahul Gandhi: ఖర్గే, నడ్డాల లేఖల యుద్ధం

Toxic Workplace: వర్క్ ప్రెజర్‌ తట్టుకోలేక ప్రైవేట్ ఉద్యోగిని మృతి.. రంగంలోకి దిగిన సర్కారు

Delhi CM: ఢిల్లీ సీఎంగా అతిశీ ప్రమాణానికి డేట్ ఫిక్స్

Rahul Gandhi Vs Ravneet Bittu: జాతీయ పార్టీల అధినేతల మధ్య లేఖల యుద్ధం..

Monkeypox Case in India: భారత్‌ను వణికిస్తున్న మంకీపాక్స్.. రెండో కేసు నమోదు.

Train accident in Uttar Pradesh: పట్టాలు తప్పిన మరో రైలు.. రైళ్ల రాకపోకలకు అంతరాయం

Big Stories

×