EPAPER

Delhi Liquor Scam : నేడు అరవింద్ కేజ్రీవాల్ ఈడీ విచారణ .. హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన ఢిల్లీ సీఎం..

Delhi Liquor Scam : నేడు అరవింద్ కేజ్రీవాల్ ఈడీ విచారణ .. హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన ఢిల్లీ సీఎం..

Delhi Liquor Case


Delhi Liquor Case (today news telugu) : ఢిల్లీ మద్యం కుంభకోణం కేసు విచారణకు ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ హాజరవుతారా? లేదా అనే అంశంపై ఉత్కంఠ కొనసాగుతోంది. 9వ సారి ఆయనకు ఈడీ నోటీసులు జారీ చేసింది. ఢిల్లీ జల బోర్డు మనీ ల్యాండరింగ్ కేసులో మార్చి 18న విచారణ రావాలని కోరింది. అలాగే ఢిల్లీ మద్యం పాలసీ కేసులో మార్చి 21న విచారణకు హాజరు కావాలని నోటీసులు ఇచ్చింది. ఢిల్లీ జల బోర్డు మనీ ల్యాండరింగ్ కేసులో విచారణకు ఢిల్లీ సీఎం డుమ్మా కొట్టారు. కోర్టు బెయిల్ మంజూరు చేసినప్పుడు ఈడీ మళ్లీ మళ్లీ ఎందుకు సమన్లు పంపుతోందని ఆప్ నేతలు ప్రశ్నిస్తున్నారు. ఈడీ సమన్లు చట్ట విరుద్ధమని అంటున్నారు.

ఈడీ అరెస్టు చేయకుండా ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ ఢిల్లీ హైకోర్టును తాజాగా అరవింద్ కేజ్రీవాల్ ఆశ్రయించారు. జస్టిస్ సురేష్ కైత్ నేతృత్వంలోని ధర్మాసనం  ఈ పిటిషన్ పై విచారణ చేపట్టనుంది. మరోవైపు ఢిల్లీ మద్యం పాలసీ కేసులో అరవింద్ కేజ్రీవాల్ ఈడీ విచారణపై ఉత్కంఠ కొనసాగుతోంది. ఆయన ఈడీ విచారణకు హాజరు కాకపోవచ్చనని ఆమ్ ఆద్మీ పార్టీ వర్గాలు అంటున్నాయి. ఈడీ సమన్లను సవాల్ చేస్తూ ఢిల్లీ హైకోర్టులో అరవింద్ కేజ్రీవాల్ పిటిషన్ దాఖలు చేశారు. తనకు ఇప్పటివరకు జారీ చేసిన 9 సమన్లను సవాల్ చేశారు. కేజ్రీవాల్ పిటిషన్ పై రెండువారల్లోగా సమాధానం ఇవ్వాలని ఇప్పటికే ఈడీకి ఢిల్లీ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. తదుపరి విచారణ ఏప్రిల్ 22కు వాయిదా వేసింది.


అరవింద్ కేజ్రీవాల్ దాఖలు చేసిన పిటిషన్ పై జస్టిస్ సురేష్ కుమార్ కైత్, జస్టిస్ మనోజ్ జైన్ లతో కూడిన ద్విసభ్య ధర్మాసనం విచారణ జరిపింది. కేజ్రీవాల్ తరపున అభిషేక్ మను సింఘ్వీ వాదన వినిపించారు. ఈడీ తరఫున ఎస్వీ రాజు వాదనలు వినిపించారు.

Also Read:  కరుడుగట్టిన గ్యాంగ్ స్టర్.. ఎన్నికల కోసం 62 ఏళ్ల వయసులో పెళ్లి..

మరోవైపు ఢిల్లీ మధ్య కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు నాలుగు ఈడీ కస్టడీ పూర్తైంది. గురువారం ఐదో రోజు ఆమెను ఈడీ అధికారులు ప్రశ్నించనున్నారు. పలు అంశాలపై కవిత నుంచి సమాచారం సేకరించేందుకు ప్రయత్నిస్తున్నారు. బుధవారం రాజేష్, రోహిత్ రావు ఈడీ విచారణకు హాజరయ్యారు. కవిత అరెస్టు సమయంలో రాజేష్, రోహిత్, చరణ్ ఫోన్లను ఈడీ అధికారులు సీజ్ చేశారు. ప్రస్తుతం వాడుతున్న ఫోన్లను కూడా తీసుకుని విచారణకు రావాలని ఆదేశించారు.

కవిత వద్ద వారు ఎప్పటి నుంచి పని చేస్తున్నారన్న విషయాలపై ఈడీ ప్రశ్నించినట్లు సమాచారం. ఎమ్మెల్సీ కవిత పిటిషన్‌పై శుక్రవారం సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ ఎంఎం సుందరేశ్, జస్టిస్ బేలా. ఎం. త్రివేదితో కూడిన త్రిసభ్య ధర్మాసనం విచారణ చేపట్టనుంది. ఈడీని ప్రతివాదిగా చేర్చుతూ కవిత ఈ పిటిషన్ దాఖలు చేశారు.

Related News

Nipah virus: కేరళలో నిఫా వైరస్ విజృంభణ.. స్టూడెంట్ మృతి.. రాష్ట్రంలో ఆంక్షలు!

PM Modi: ఇది ట్రైలర్ మాత్రమే.. ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు నాయుడు భేటీ

yashwant Sinha: వాజ్ పేయి సిద్ధాంతాలతో.. పార్టీ పేరు ప్రకటించిన యశ్వంత్ సిన్హా

Delhi: ఢిల్లీకి తదుపరి సీఎం ఎవరు? రేసులో ఆరుగురు పేర్లు.. వీళ్లేనా?

Rajasthan Road Accident: రాజస్థాన్‌లో ట్రక్కును ఢీకొట్టిన తుఫాను.. ఎనిమిది మంది దుర్మరణం

Jammu Kashmir: గాంధీ, నెల్సన్ మండేలాతో బీజేపీ పోల్చుతున్న ఈ బుఖారీ ఎవరు?

PM Narendra Modi: మరో 6 వందే భారత్ రైళ్లు.. వర్చువల్‌గా ప్రారంభించిన ప్రధాని మోదీ

Big Stories

×