EPAPER

EC TRANSFERS DIST POLICE CHIEFS: ఈసీ కొరడా.. ఆ పోలీసు అధికారులపై వేటు

EC TRANSFERS DIST POLICE CHIEFS: ఈసీ కొరడా.. ఆ పోలీసు అధికారులపై వేటు
EC TRANSFERS DIST POLICE CHIEFS
EC TRANSFERS DIST POLICE CHIEFS

EC TRANSFERS DIST POLICE CHIEFS: లోక్ సభ ఎన్నికల వేళ అన్నిరాష్ట్రాలపై ఓ కన్నేసింది కేంద్ర ఎన్నికల సంఘం. వివిధ రాష్ట్రాల్లో జరుగుతున్న పరిణామాలను నిశితంగా గమనిస్తోంది. ఇందులో భాగంగా ఇప్పటికే పలువురు అధికారులపై వేటు వేసింది. ఇంకా మరికొందరి అధికారుల జాబితాను రెడీ చేసినట్టు ఢిల్లీ సమాచారం. ఎన్నికలు స్వేచ్ఛాయుతంగా జరిగేలా చర్యలు చేపడుతోంది. తాజాగా అధికారుల బదిలీ వేటు కంటిన్యూ చేస్తోంది. తాజాగా అస్సాం, పంజాబ్ లోని జిల్లా పోలీసుల అధికారులను బదిలీ చేసింది.


వీళ్లలో చాలా మందికి రాజకీయ నాయకులతో బంధుత్వం కూడా ఉంది. ఐఏఎస్, ఐపీఎస్ కేడర్ అధికారులకు కేటాయించినవి కావడంతో చర్యలు చేపట్టింది. అలాగే రాజకీయ నేతలతో రిలేషన్ షిప్ ఉన్న అధికారులను విధుల నుంచి పక్కన పెట్టాలని వివిధ రాష్ట్రాలకు సమాచారం ఇచ్చింది. పంజాబ్, ఒడిషా, గుజరాత్ బెంగాల్ ల్లో నాన్ కేడర్ జిల్లా జడ్జీలు, ఎస్పీలు ఇతర విభాగాలకు మార్చాలని ఆయా ప్రభుత్వాలకు సూచన చేసింది.

ఈ జాబితాలో ఏపీ, కర్ణాటక, తమిళనాడుకు చెందిన అధికారులు ఉన్నట్లు సమాచారం. ఇటీవల బెంగాల్ డీజీపీతోపాటు ఆరు రాష్ట్రాల హోంశాఖ కార్యదర్శులపై తప్పించింది ఈసీ. వారిలో యూపీ, బీహార్, గుజరాత్, జార్ఖండ్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ కు చెందిన అధికారులున్నారు. ఏడు దశల్లో జరగనున్న సార్వత్రిక ఎన్నికలకు ఇప్పటికే తొలి విడత నోటిఫికేషన్ విడుదలైంది. ఏప్రిల్ 19న మొదటి విడత ఎన్నికల పోలింగ్ జరగనుంది.


Tags

Related News

Nipah virus: కేరళలో నిఫా వైరస్ విజృంభణ.. స్టూడెంట్ మృతి.. రాష్ట్రంలో ఆంక్షలు!

PM Modi: ఇది ట్రైలర్ మాత్రమే.. ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు నాయుడు భేటీ

yashwant Sinha: వాజ్ పేయి సిద్ధాంతాలతో.. పార్టీ పేరు ప్రకటించిన యశ్వంత్ సిన్హా

Delhi: ఢిల్లీకి తదుపరి సీఎం ఎవరు? రేసులో ఆరుగురు పేర్లు.. వీళ్లేనా?

Rajasthan Road Accident: రాజస్థాన్‌లో ట్రక్కును ఢీకొట్టిన తుఫాను.. ఎనిమిది మంది దుర్మరణం

Jammu Kashmir: గాంధీ, నెల్సన్ మండేలాతో బీజేపీ పోల్చుతున్న ఈ బుఖారీ ఎవరు?

PM Narendra Modi: మరో 6 వందే భారత్ రైళ్లు.. వర్చువల్‌గా ప్రారంభించిన ప్రధాని మోదీ

Big Stories

×