EPAPER

Lok Sabha Elections 2024: కేంద్రానికి షాక్ ఇచ్చిన ఈసీ.. వికసిత భారత్ సందేశాలు ఆపండి

Lok Sabha Elections 2024: కేంద్రానికి షాక్ ఇచ్చిన ఈసీ.. వికసిత భారత్ సందేశాలు ఆపండి
Viksit Bharat Messages
Viksit Bharat Messages

Viksit Bharat: ‘వికసిత భారత్‌’ పేరిట వాట్సప్‌లో కేంద్ర ప్రభుత్వం నుంచి సందేశాలు వస్తున్న సంగతి తెలిసిందే. వెంటనే వాటిని ఆపాలని ఎన్నికల సంఘం ఆదేశించింది.


కేంద్ర ప్రభుత్వానికి కేంద్ర ఎన్నికల సంఘం కీలక ఆదేశాల జారీ చేసింది. గత కొన్ని రోజులుగా కేంద్ర ప్రభుత్వం అందిరికి వాట్సాప్ లో వికసిత భారత్ పేరిట సందేశాలు పంపిస్తుంది. అయితే ఈ ప్రక్రియను వెంటనే ఆపాలని కేంద్రానికి ఈసీ ఆదేశాలు జారీ చేసింది. ఎన్నికల కోడ్ వెలువడిన తర్వాత కొందరి వాట్సాప్ కి ప్రధాని నరేంద్ర మోదీ పేరుతో సందేశాలు వస్తున్నాయని ఈసీ ఫిర్యాదు అందింది. ఈ ఫిర్యాదు మేరకు వాటిని వెంటనే నిలుపుదల చేయాలని కేంద్ర ఐటీ మంత్రిత్వ శాఖకు ఈసీ ఆదేశాలు జారీ చేసింది.
ఎన్నికల షెడ్యూల్ వెలువడే కొన్ని గంటల ముంది ప్రధాని మోదీ ఫోటోతో ఉన్న లేఖను కేంద్రం అందరి వాట్సాప్ కు పంపింది. వికసిత భారత్ సంపర్క్ పేరిట అవి వస్తున్నాయి. అయితే నెట్ వర్క్ పరిమితులు కారణంగా మార్చి 16వ తేదీనా పంపిన సందేశాలు కొందరికి ఆలస్యంగా వస్తున్నాయని ఐటీ శాఖ ఈసీకి వెల్లడించింది. ఎన్నికల షెడ్యూల్ వెలువడిన తర్వాత కూడా కొందరికి ఈ సందేశాలు రావడంతో కాంగ్రెస్ పార్టీ, తృణమాల్ కాంగ్రెస్ పార్టీలు అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఈసీకి ఫిర్యాదు చేశాయి.

బీజేపీ ఎన్నికల కోడ్ ఉల్లంఘనకు పాల్పడుతుందని ఈ పార్టీలు ఈసీకి ఫిర్యాదు చేశాయి. దీనిపై స్పందించిన ఈసీ ఐటీ శాఖకు ఆదేశఆలు జారీ చేసింది. పారదర్శకతను నిర్ధరించేందుకు తాము తీసుకుంటున చర్యల్లో ఇదొక భాగం అని కేంద్ర ఎన్నికల సంఘం వెల్లడించింది.


Related News

Lucknow Building collaps : యూపీలో ఘోర ప్రమాదం.. కూలిన బిల్డింగ్.. ఐదుగురు మృతి

Minister Comments: బ్రేకింగ్ న్యూస్.. వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన మంత్రి.. తన కూతురు – అల్లుడిని నదిలో తోసేయండంటూ..

Amit Shah: ఆ విషయంలో.. పాక్‌తో చర్చలు జరిపే ఆలోచనే లేదు: అమిత్ షా

No Doctors For Jails: 5600 మంది ఖైదీలకు ఒక డాక్టర్.. జైళ్లలో నేరస్తుల ఆరోగ్యంపై నిర్లక్ష్యమా?..

Uttar Pradesh Wolf Attacks: యూపీలో తోడేళ్ల విధ్వంసం.. 8 మంది మృతి.. మంత్రి వింత వాదన!

Kolkata Rape Case CBI: కోల్‌కతా రేప్ నిందితుడికి బెయిల్?.. సిబిఐ నిర్లక్ష్యం.. మండిపడిన మమతా పార్టీ!

Jammu and Kashmir Assembly Polls: జమ్మూకాశ్మీర్ బీజేపీ ఎన్నికల మేనిఫెస్టో విడుదల

Big Stories

×