EPAPER

Earthquake: కాశ్మీర్‌లో వరుస భూకంపాలు..వణికిపోయిన ప్రజలు

Earthquake: కాశ్మీర్‌లో వరుస భూకంపాలు..వణికిపోయిన ప్రజలు

Earthquake In Jammu Kashmir(Telugu breaking news): జమ్మూ కాశ్మీర్‌లో భూకంపం సంభవించింది. మంగళవారం ఉదయం వరుసగా స్వల్ప వ్యవధిలో రెండు సార్లు భూకంపం కంపించింది. దీంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. కొంతమంది ఏం జరుగుతుందో తెలియక వణికిపోయారు. మరికొంతమంది ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. ఈ భూకంపం బారాముల్లా జిల్లాలో జరిగినట్లు నేషనల్ సెంటర్ ఫర్ సెస్మోలజీ తెలిపింది.


కేంద్ర పాలిత ప్రాంతాలోని పలు జిల్లాలో ఈ భూకంప తీవ్రత కనిపించింది. ఒక్కసారిగా భూప్రకంపనలు రావడంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. బారాముల్లా జిల్లాలో భూమిలో 5 కి.మీ లోతులో భూకంప కేంద్రం ఉందని వెల్లడించింది.

ఈ ఘటనలో ఎలాంటి ఆస్తినష్టం, ప్రాణనష్టం జరగలేదు. అయితే తొలుత ఉదయం 6.45 గంటల సమయంలో 4.9 తీవ్రతతో భూకంపం సంభవించింది. తర్వాత మరో 7 నిమిషాల వ్యవధిలో 6.52 గంటలకు 4.8 తీవ్రతతో మరో భూకంపం సంభవించింది. ఈ భూకంప కేంద్రం కూడా బారాముల్లా జిల్లాలోనే భూమికి 10కిలోమీటర్ల లోతున గుర్తించారు.


భూకంపం ధాటికి పలు ప్రాంతాల్లో ఇళ్లలోని వస్తువులు కదలడంతో ప్రజలు భయంతో బయటకు పరుగులు తీశారు. అయితే పొరుగుదేశం పాకిస్తాన్ లోనే భూమి కంపించింది. అక్కడ కూడా ఎటువంటి ఆస్తి, ప్రాణ నష్టం సంభవించలేదని అధికారులు తెలిపారు.

Also Read: పోస్టల్ GDS ఫలితాలు విడుదల.. ఏపీ, తెలంగాణ మెరిట్ జాబితా ఇదే

జమ్మూ కశ్మీర్ లో నెల రోజుల వ్యవధిలో భూమి కంపించడం ఇది రెండో సారి కావడంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. అంతకుముందు జూలై 12న బురాముల్లాలో 4.1 తీవ్రతతో భూకంపం సంభవించింది.

Related News

Mahalakshmi Scheme: కాంగ్రెస్ హామీని కాపీ కొట్టిన బీజేపీ

Rahul Gandhi: ఖర్గే, నడ్డాల లేఖల యుద్ధం

Toxic Workplace: వర్క్ ప్రెజర్‌ తట్టుకోలేక ప్రైవేట్ ఉద్యోగిని మృతి.. రంగంలోకి దిగిన సర్కారు

Delhi CM: ఢిల్లీ సీఎంగా అతిశీ ప్రమాణానికి డేట్ ఫిక్స్

Rahul Gandhi Vs Ravneet Bittu: జాతీయ పార్టీల అధినేతల మధ్య లేఖల యుద్ధం..

Monkeypox Case in India: భారత్‌ను వణికిస్తున్న మంకీపాక్స్.. రెండో కేసు నమోదు.

Train accident in Uttar Pradesh: పట్టాలు తప్పిన మరో రైలు.. రైళ్ల రాకపోకలకు అంతరాయం

Big Stories

×