EPAPER

DRDO : ఆకాశ్‌.. అదరహో.. ఒకేసారి నాలుగు టార్గెట్లను కూల్చేసిన డీఆర్‌డీఓ..

DRDO : ఆకాశ్‌.. అదరహో.. ఒకేసారి నాలుగు టార్గెట్లను కూల్చేసిన డీఆర్‌డీఓ..

DRDO : ఒకేసారి ఒకటికి మించిన టార్గెట్లు దూసుకొస్తే భారత రక్షణ దళాలు ఎలా ఎదర్కొంటాయి? వివిధ దిశల్లో మన స్థావరాలపై దూసుకొచ్చే యుద్ధ విమానాలు, ఇతర UAVలను అడ్డుకోవడం ఎలా? ఈ ప్రశ్నలన్నింటికి సమాధానం చెప్పింది డిఫెన్స్‌ రిసెర్స్‌ అండ్ డెవలప్‌మెంట్‌ ఆర్గనైజేషన్. సొల్యూష్‌ కనిపెట్టడమే కాదు.. దాన్ని ఆచరణలో చేసి చూపించింది.


భారత గగన విధుల రక్షణలో ముందు వరుసలో ఉన్న ఆకాశ్‌ మిస్సైల్స్‌ను ఉపయోగించి ఒకేసారి నాలుగు టార్గెట్లను విజయవంతంగా కూల్చేసింది DRDO. ఇలాంటి ఫీట్‌ సాధించిన తొలి దేశంగా భారత్‌ ఇప్పుడు నిలిచింది.

ఏపీలోని సూర్యలంక ఎయిర్‌ఫోర్స్‌ స్టేషన్‌లో నిర్వహించిన ఆస్త్రశక్తి 2023 ఎక్సర్‌సైజ్‌ల్లో భాగంగా ఈ పరీక్షను నిర్వహించారు. 25 కిలోమీటర్ల పరిధిలోకి వచ్చిన నాలుగు టార్గెట్లను సింగిల్ ఫైరింగ్ యూనిట్‌తో కూల్చేసింది. ఈ ఆకాశ్‌ ఫైరింగ్ యూనిట్‌లో ఒక ఫైరింగ్ లెవల్ రాడార్‌.. ఫైరింగ్ కంట్రోల్ సెంటర్, రెండు ఆకాష్‌ ఎయిర్‌ఫోర్స్‌ లాంచర్లు ఉన్నాయి. ఇందులో ఒక్కో లాంచర్‌లో ఐదు ఆర్మ్‌డ్‌ మిసైల్స్ ఉంటాయి.


FLR పరిధిలోకి వచ్చిన టార్గెట్‌ను వెంటనే అలర్ట్ చేయగానే.. ఫైరింగ్‌ యూనిట్‌ వాటిని కూల్చేసింది. క్షణాల వ్యవధిలో నాలుగు టార్గెట్‌లను ఫైర్‌ చేసి కూల్చేసింది. వేరు వేరు దిశల నుంచి వచ్చే టార్గెట్లను గుర్తించి ఖచ్చితత్వంతో కూల్చేశాయి. ఈ ప్రయోగం సక్సెస్‌ అయినట్టు DRDO ప్రకటించింది.

గత పదేళ్లుగా భారత రక్షణశాఖ ఆకాశ్‌ మిసైల్స్‌ను ఉపయోగించింది. ఇవి సర్ఫేస్‌ టు ఎయిర్‌ మిసైల్స్‌. ఇప్పటి వరకు అనేక సార్లు వీటిని విజయవంతంగా పరీక్షించారు.

Tags

Related News

Star Health Data: స్టార్ హెల్త్ కస్టమర్లకు షాక్.. డేటా మొత్తం ఆ యాప్ లో అమ్మకానికి ?

Jammu Kashmir Elections: జమ్ము ఎన్నికల వేళ.. పాక్ మంత్రి కీలక వ్యాఖ్యలు

Cash for Vote Scam: ఓటుకు నోటు కేసులో సీఎం రేవంత్ రెడ్డికి భారీ ఊరట

MLA Bojju Patel: రవ్‌నీత్ సింగ్ తలను తీసుకొస్తే.. నా ఆస్తి రాసిస్తా : కాంగ్రెస్ ఎమ్మెల్యే సంచలనం

Uttarakhand Train: రైలు ప్రమాదానికి భారీ కుట్ర.. పట్టాలపై 6 మీటర్ల ఇనుప రాడ్

Mahalakshmi Scheme: కాంగ్రెస్ హామీని కాపీ కొట్టిన బీజేపీ

Rahul Gandhi: ఖర్గే, నడ్డాల లేఖల యుద్ధం

Big Stories

×