Arvind Kejriwal:దీపావళి అంటే టక్కున గుర్తొచ్చొవి టపాసులు. చిన్నా పెద్దా తేడా లేకుండా టపాసులు కాల్చేందుకు అంతా ఆసక్తి చూపిస్తారు. అందుకు తగ్గట్టుగానే రకరకాల టపాసులు మార్కెట్‌లోకి వచ్చాయి.
దీపావళి వేడుకల్లో పటాకులు కాల్చవద్దని ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) అధినేత అరవింద్ కేజ్రీవాల్ మరోసారి ఢిల్లీవాసులకు విజ్ఞప్తి చేశారు. బుధవారం నాడు మీడియా ముందు మాట్లాడుతూ.. దీపావళి అంటేనే వెలుగుల పండుగ. అయితే ఈ పండుగ సందర్బంగా బాణసంచా కాల్చడం వల్ల ఢిల్లీ ప్రజలు ముఖ్యంగా, పిల్లల ఆరోగ్యంపై ప్రభావం పడుతుందన్నారు.
Also Read: ‘ఇక లగేజిపై ఫైన్ విధిస్తాం’.. రైల్వేశాఖ కీలక ప్రకటన
ఈ ఆంక్షలు కేవలం మతపరమైన అంశం కాదని, ప్రజల ఆరోగ్యాన్ని కాపాడంటంలో ఒక భాగమే అని ఆయన అన్నారు. బాణసంచా కాలుష్యం వల్ల దీర్ఘకాలిక వ్యాధులు తలెత్తే అవకాశం ఉంది కాబట్టి జాగ్రత్తగా ఉండండని ప్రజలకు సూచించారు. పర్యావరణ పరిరక్షణ మనందరి బాధ్యత అని ఆయన అన్నారు. సాంప్రదాయాల కంటే.. మొదట ఆరోగ్యాన్ని ఎంచుకోవాలని కేజ్రీవాల్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఈ సమస్య ఏ మతానికి పరిమితం కాదని కేజ్రావాల్ అన్నారు. ఇందులో హిందూ, ముస్లి అనే తేడా లేదు.. ప్రతి ఒక్కరి ప్రాణాలే ముఖ్యం అని ఆయన అన్నారు.
మరోవైపు.. దీపావళి పండుగను పురస్కరించుకొని తెలుగు రాష్ట్రాల్లో సందడి వాతావరణం నెలకొంది. హైదరాబాద్ లో మార్కెట్లు హడావిడిగా ఉన్నాయి. తెల్లవారుజాము నుంచే మార్కెట్లకి కస్టమర్ల రద్దీ పెరుగుతోంది. దీపాలు, పూలు, లక్ష్మీదేవి విగ్రహాలు.. బొమ్మల కొలువుకోసం బొమ్మలు, పూజా సామాగ్రి కొనుగోలు చేసేందుకు జనాలు క్యూ కడుతున్నారు. ఈ క్రమంలోనే కస్టమర్లను ఆకర్షించేలా దీపాలు, దొంతులు అందుబాటులో ఉంచారు. మరోవైపు సాగర తీరం విశాఖలో కూడా దీపావళి సందడి నెలకొంది. ఏయూ ఇంజనీరింగ్ మైదానంలో పెద్ద ఎత్తున్న దివాళి స్టాల్స్ ఏర్పాట్లు చేశారు. దీపావళి సామాన్లు కొనేందుకు నగర వాసులు అంతా పెద్ద ఎత్తున తరలివస్తున్నారు. వ్యాపారస్తులు నిబంధనలు పాటించకపోతే చర్యలు తప్పవు అంటూ పోలీసులు హెచ్చరిస్తున్నారు.