EPAPER

Patient Slapped Doctor: చికిత్స చేస్తుండగా వైద్యుడిని కొట్టిన పేషెంట్ బంధువు.. డాక్టర్ల రక్షణ చట్టం వర్తిస్తుందా?

Patient Slapped Doctor: చికిత్స చేస్తుండగా వైద్యుడిని కొట్టిన పేషెంట్ బంధువు.. డాక్టర్ల రక్షణ చట్టం వర్తిస్తుందా?

Patient Slapped Doctor| కోల్ కతా ఆస్పత్రిలో మహిళా డాక్టర్ హత్యాచారం ఘటన తరువాత వైద్యులకు రక్షణ కల్పించే చట్టం తీసుకురావాలని డాక్టర్లు భారీ నిరసనలు చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వ కూడా ఆస్పత్రుల వద్ద సెక్యూరిటీ సిబ్బందిని 25 శాతం పెంచుతున్నట్లు ఆదేశాలు జారీచేసింది. ఈ ఘటనలు మరువక ముందే తాజాగా ఓ డాక్టర్, సహాయక వైద్య సిబ్బందిపై ఓ పేషెంట్, అతని బంధువు దాడి చేశారు. ఈ ఘటన దేశ రాజధాని ఢిల్లీలోనే జరగడం గమనార్షం.


ఢిల్లలోని కర్‌కర్డూమా ప్రాంతం.. డాక్టర్ హెగ్డేవార్ ఆస్పత్రిలో శనివారం రాత్రి గాయాలతో వచ్చిన పేషెంట్ ని చికిత్స చేస్తున్న సమయంలో రెసిడెంట్ డాక్టర్, సహాయక సిబ్బందిని ఆ పేషెంట్, అతని కొడుకు కొట్టారు.

”శనివారం రాత్రి ఒంటి గంటకు ఒక వ్యక్తి తలకు గాయాలు కావడంతో ఆస్పత్రికి చికిత్స కోసం వచ్చారు. ఆ పేషెంట్ తలకు గాయం చూసి కుట్లు వేసేందుకు నేను డ్రెస్సింగ్ రూమ్ కు తీసుకెళ్లాను. ఈ క్రమంలో నేను అతని తల గాయానికి మొదటి కుట్టు వేసి రెండో కుట్టు వేయబోతున్న సమయంలో ఆ పేషెంట్ నన్ను గట్టిగా వెనక్కు తోసి అసభ్యంగా మాట్లాడడం ప్రారంభించాడు. అప్పుడే వెనుక నుంచి అతని కొడుకు వచ్చి నన్ను ఎడాపెడా ముఖంపై కొట్టాడు. ఆ తరువాత తండ్రీకొడుకులిద్దరూ బూతులు తిట్టారు. అడ్డుగా వచ్చిన సహాయక సిబ్బందిని కూడా కొట్టారు. ఆ పేషెంట్ మద్యం సేవించి ఉన్నట్లు నేను గమనించాను.” అని బాధిత డాక్టర్ మీడియాకు తెలిపారు.


Also Read: ఇదేం భక్తి.. తిరుమలకు 25 కేజీల బంగారు నగలు ధరించి వచ్చిన ఫ్యాషన్ భక్తులు..

కోల్ కతా మహిళా డాక్టర్ ఘటన తరువాత ఆస్పత్రుల వద్ద సెక్యూరిటీ పెంచాలని సుప్రీం కోర్టు కూడా ప్రభుత్వానికి సూచించింది. అయినా డాక్టర్లపై దాడులు జరగుతుండడంతో డాక్టర్ల రక్షణ కోసం ప్రత్యేక చట్టం తీసుకురావాలనే డిమాండ్ పెరుగుతోంది.

ఇలాంటిదే మరో కేసులో ఆగస్టు 24న ముంబైలోని మన్‌ఖుర్ద్ ప్రాంతంలో టూ వీలర్ పార్కింగ్ విషయంలో మొదలైన వాగ్వాదం పెద్ద గొడవగా మారింది. ఈ గొడవలో మహిళా డాక్టర్ పై ముగ్గురు మహిళలు, ఒక మైనర్ అబ్బాయి దాడి చేశారని పోలీసులకు ఫిర్యాదు అందింది.

Also Read:  610 కేజీల బరువుతో చనిపోతాడనుకున్న బాలుడు బతికాడు.. అంతా ‘రాజు’గారి దయ..

పోలీసుల కథనం ప్రకారం.. పార్కింగ్ విషయంలో వాగ్వాదంలో ముందుగా మహిళా డాక్టర్ ఆ మైనర్ అబ్బాయిపై చేయి చేసుకుందని తెలిసింది. దీంతో ఆ అబ్బాయి బంధువులు అక్కడికి చేరుకొని డాక్టర్ ని గొడుగులతో కొట్టారు. ఆమె బట్టలు కూడా చింపివేశారు. అయితే ఈ ఘటనలో పోలీసులు ఎవరినీ అరెస్టు చేయలేదు. ఈ ఘటనలో డాక్టర్ తప్పిదం కూడా ఉన్నట్లు పోలీసులు భావిస్తున్నారు.

మరి డాక్టర్లకు రక్షణ కోసం ప్రత్యేక చట్టం తీసుకువస్తే.. ఈ రెండు కేసులలో వర్తిస్తుందా?..

Also Read: ఫోన్లో ప్రియుడితో మాట్లాడుతుండగా పట్టుబడిన కొత్త పెళ్లికూతురు.. భర్త ఏం చేశాడంటే?

 

Related News

Uttarakhand Train: రైలు ప్రమాదానికి భారీ కుట్ర.. పట్టాలపై 6 మీటర్ల ఇనుస రాడ్

Mahalakshmi Scheme: కాంగ్రెస్ హామీని కాపీ కొట్టిన బీజేపీ

Rahul Gandhi: ఖర్గే, నడ్డాల లేఖల యుద్ధం

Toxic Workplace: వర్క్ ప్రెజర్‌ తట్టుకోలేక ప్రైవేట్ ఉద్యోగిని మృతి.. రంగంలోకి దిగిన సర్కారు

Delhi CM: ఢిల్లీ సీఎంగా అతిశీ ప్రమాణానికి డేట్ ఫిక్స్

Rahul Gandhi Vs Ravneet Bittu: జాతీయ పార్టీల అధినేతల మధ్య లేఖల యుద్ధం..

Monkeypox Case in India: భారత్‌ను వణికిస్తున్న మంకీపాక్స్.. రెండో కేసు నమోదు.

Big Stories

×