Big Stories

Abroad Country Gold on GST : విదేశాల నుంచి బంగారం తెస్తే పన్ను ఎంతో తెలుసా?

Abroad Country Gold on GST : మన దేశంలో బంగారానికి డిమాండ్ అంతా ఇంతా కాదు. పుత్తడి ధరలు ఎంత పెరిగినా… పండగలు, పెళ్లిళ్ల సీజన్లో బంగారం షాపులు ఎప్పుడూ కొనుగోలుదారులతో కళకళలాడుతుంటాయి. దిగుమతి సుంకంతో పాటు GST వడ్డనతో 24 క్యారెట్ల 10 గ్రాముల మేలిమి బంగారం ధర 50 వేలు దాటిపోయినా… మన దగ్గర బంగారం కొనే వాళ్లకి కొదవేమీ లేదు. ఇక్కడ పన్నుల భారంతో బంగారం ధర ఎక్కువగా ఉందన్న కారణంతో చాలా మంది పన్నులు లేని దేశాల నుంచి గోల్డ్ తెచ్చుకునే ఆలోచన చేస్తుంటారు. కానీ… విదేశాల నుంచి బంగారం తీసుకురావాలంటే ఎలాంటి నిబంధనలు ఉన్నాయో చాలా మందికి తెలీదు. ఆ వివరాలేంటో ఇక్కడ తెలుసుకుందాం.

- Advertisement -

విదేశాల నుంచి బంగారం తెచ్చుకోవాలంటే మొదటగా వినిపించే పేరు దుబాయ్. ఎందుకంటే అక్కడ బంగారంపై ఎలాంటి పన్నులు లేవు. దాంతో అక్కడ చౌకగా కొని తెచ్చుకోవాలని చాలా మంది భావిస్తుంటారు. దుబాయే కాదు… ఏ దేశం నుంచి బంగారం తేవాలన్నా కొన్ని నిబంధనలు ఉన్నాయి. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఇన్ డైరెక్ట్ టాక్సెస్ & కస్టమ్స్… CBIC ప్రకారం… భారత పాస్‌పోర్ట్ కలిగిన వాళ్లు లేదా 6 నెలల కంటే ఎక్కువ కాలం దేశంలో ఉండాలనుకునే భారత సంతతి వ్యక్తులు… దేశానికి బంగారం తీసుకొస్తే… దాని విలువలో 13.75 శాతం పన్ను చెల్లించాలి. అదే మరెవరైనా దేశానికి బంగారం తీసుకొస్తే… దాని విలువలో ఏకంగా 38.5 శాతం పన్ను చెల్లించాలి. అంతేకాదు… ఈ రెండు సందర్భాల్లోనూ ఒక వ్యక్తి కేజీ కంటే ఎక్కువ బంగారం తీసుకురాకూడదు.

- Advertisement -

ఎలాంటి పన్నులు లేకుండా విదేశాల నుంచి మన దేశానికి బంగారం తీసుకురావాలనుకుంటే… తెచ్చే వ్యక్తి ఏడాదికిపైగా విదేశాల్లో ఉండి ఉండాలి. పురుషుడు అయితే తనతో కేవలం 20 గ్రాముల బంగారు ఆభరణాలను మాత్రమే తీసుకురావొచ్చు. అలాగే దాని విలువ 50 వేల రూపాయలకు మించకూడదు. అదే మహిళ అయితే… 40 గ్రాముల వరకు బంగారు ఆభరణాలను తీసుకురావొచ్చు. అలాగే దాని విలువ లక్ష రూపాయలు మించకూడదు. ఇవీ… విదేశాల నుంచి బంగారం తెచ్చుకోవాలంటే ఉన్న నిబంధనలు.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News