EPAPER

Digvijay Singh comments: ఆర్ఎస్ఎస్ నుంచి చాలా నేర్చుకోవాలన్న దిగ్విజయ్‌సింగ్

Digvijay Singh comments: ఆర్ఎస్ఎస్ నుంచి చాలా నేర్చుకోవాలన్న దిగ్విజయ్‌సింగ్

Digvijay Singh latest comments(Today news paper telugu): ఎవరు ఏమనుకున్నా కొందరు రాజకీయ నేతలు పట్టించుకోరు. చెప్పాల్సిన మాటలు ఓపెన్‌గా చెప్పేశారు. ఒక్కోసారి అది మంచి కావచ్చు.. ఇంకోసారి నెగిటివ్ సంకేతాలు వస్తాయి. కొందరు అవేమీ పట్టించుకోరు. అలాంటివారిలో కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్‌సింగ్ ఒకరు. ఆర్ఎస్ఎస్‌ ను చూసి యూత్ కాంగ్రెస్ కార్యకర్తలు నేర్చుకోవాలని సూచించారాయన.


సమయం, సందర్భం, సన్నివేశాన్ని బట్టి ఆర్ఎస్ఎస్‌పై విరుచుకుపడతారు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌ గాంధీ. ఈ విషయంలో ఎవరేమన్నా అస్సలు పట్టించుకోరు. ఎన్నికల సమయంలో చెప్పనక్కర్లేదు. కానీ కొందరు కాంగ్రెస్ నేతలు ఇందుకు భిన్నం. తాజాగా మధ్యప్రదేశ్‌లోని జబల్పూర్‌లో యూత్ కాంగ్రెస్ కార్యకర్తలు నర్సింగ్ కాలేజీ కుంభకోణం, నీట్ పేపర్ లీకేజీకి వ్యతిరేకంగా చేపట్టిన ర్యాలీకి హాజరయ్యారు కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్‌సింగ్.

యూత్ కాంగ్రెస్ కార్యకర్తలను ఉద్దేశించి నాలుగు మంచి మాటలు బయటపెట్టారు దిగ్విజయ్‌సింగ్. ఒక సందేశాన్ని సక్సెస్‌ఫుల్‌గా ప్రజలకు ఎలా అందించాలో వారికి తెలుసన్నారు. అంతేకాదు సంస్థను ఎలా విస్తరించాలో కూడా ఆర్ఎస్ఎస్‌ను చూసి నేర్చుకోవాలన్నారు. అంతేకాదు మైండ్ గేమ్ ఆడడంతో వారికి తిరుగులేదన్నారు. వారు నిరసనలు, ప్రదర్శనలు ఎప్పుడూ చేయరని, జైలుకి వెళ్లరన్నారు.


మనల్ని మాత్రం వారు జైలుకి పంపుతారని వ్యాఖ్యానించారు దిగ్విజయ్‌సింగ్. వారి కార్యాచరణ, ప్రచారం అర్థం చేసుకోవడం ద్వారా సమర్థవంతంగా ఎదుర్కోవచ్చన్నారు. ఆర్ఎస్ఎస్‌కు మనం బద్ద వ్యతిరేకుల మని, కానీ నేర్చుకోవాల్సింది ఎంతో ఉందన్నారు. కేవలం మూడు విషయాలపైనే వాళ్లు దృష్టి సారిస్తార న్నారాయన. కరపత్రాలు పంపిణీ చేయడం, చర్చలు నిర్వహించడం, చివరకు ఉద్యమం చేయడమ న్నారు. వారితో మీరు పోరాడాలనుకుంటే, సొంత ఆటలో వారిని ఓడించాలన్నారు.

ALSO READ: నీట్ కేసు, టెస్టింగ్ ఏజెన్సీ నుంచి పేపర్ లీక్, కీలక నిందితుడు అరెస్ట్

దిగ్విజయ్‌సింగ్ మాటలను చాలామంది కాంగ్రెస్ నేతలు సమర్థిస్తున్నారు. ఆయన చెప్పింది ముమ్మాటికీ నిజమేనని అంటున్నారు. ట్రెండ్ తగ్గట్టుగా మనం ఇలాంటి పంధాను అనుసరించడమే మంచిదని, దీనివల్ల రానున్న రోజుల్లో మంచి ఫలితాలు వస్తాయని అంటున్నారు.

Tags

Related News

Mahalakshmi Scheme: కాంగ్రెస్ హామీని కాపీ కొట్టిన బీజేపీ

Rahul Gandhi: ఖర్గే, నడ్డాల లేఖల యుద్ధం

Toxic Workplace: వర్క్ ప్రెజర్‌ తట్టుకోలేక ప్రైవేట్ ఉద్యోగిని మృతి.. రంగంలోకి దిగిన సర్కారు

Delhi CM: ఢిల్లీ సీఎంగా అతిశీ ప్రమాణానికి డేట్ ఫిక్స్

Rahul Gandhi Vs Ravneet Bittu: జాతీయ పార్టీల అధినేతల మధ్య లేఖల యుద్ధం..

Monkeypox Case in India: భారత్‌ను వణికిస్తున్న మంకీపాక్స్.. రెండో కేసు నమోదు.

Train accident in Uttar Pradesh: పట్టాలు తప్పిన మరో రైలు.. రైళ్ల రాకపోకలకు అంతరాయం

Big Stories

×