EPAPER

Delhi Rains: ఢిల్లీలో కుండపోత వర్షం.. స్కూళ్లకు సెలవు!

Delhi Rains: ఢిల్లీలో కుండపోత వర్షం.. స్కూళ్లకు సెలవు!

Heavy Rain in Delhi today news(Telugu flash news): ప్రకృతి విలయతాండవం చేస్తోంది. దీంతో ఉత్తరాది రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. అయితే దేశ రాజధాని ఢిల్లీలో కుండపోత వర్షం కురుస్తోంది. ఏకంగా గంటలోనే 13 సెంమీ వర్షపాతం నమోదైంది. ఈ వర్షానికి పలు ప్రాంతాలు జలమయమయ్యాయి.


సెంట్రల్ ఢిల్లీలోని ప్రగతి మైదాన్ అబ్జర్వేటరీలో గంట వ్యవధిలో 11సెంమీ వర్షం కురిసినట్లు అధికారులు తెలిపారు. అనేక ప్రాంతాల్లో రెండు మీటర్ల వరకు వరద నిండుకుంది. వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. దీంతో పాఠశాలలకు ప్రభుత్వం సెలవు ప్రకటించింది. అత్యవసరమైతే తప్పా బయటకు వెళ్లొద్దని ప్రభుత్వం సూచించింది.

ఇదిలా ఉండగా, రావూస్ అకాడమీలో ముగ్గురు విద్యార్థుల మృతిని మరచిపోకముందే మరో ఘటన చోటుచేసుకుంది, ఈ వర్షానికి ఓ మహిళతోపాటు ఆమె కుమార్తె ప్రమాదవశాత్తు డ్రెయినేజీలో పడిపోయారు. దీంతో ఇద్దరే మరణించినట్లు సమాచారం. ఢిల్లీతోపాటు నోయిడా లోనూ భారీ వర్షం కురుస్తోందని అధికారులు తెలిపారు.


Also Read: సర్వీస్ ప్రొవైడర్లపై రాన్సమ్‌వేర్ దాడి.. 300 బ్యాంకులపై ఎఫెక్ట్

ఉత్తర ఢిల్లీలోని సబ్జీ మండి ప్రాంతంలో ఓ ఇల్లు కూలిపోయింది. ఈ ఘటనలో ఓ వ్యక్తికి గాయాలయ్యాయి. అలాగే, వసంత్ కుంజ్ లో భారీ వర్షాలకు గోడ కూలడంతో మహిళకు తీవ్ర గాయాలయ్యాయి. మరోవైపు విమానాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. దీంతో దాదాపు 10 విమానాలు రద్దయ్యాయి. మరికొన్ని విమానాలకు దారి మళ్లించారు.

Related News

Delhi New CM: ఢిల్లీ కొత్త సీఎంగా ఆతిషి..

Narendra Modi: మోదీ నిజంగానే చాయ్‌వాలానా? ఆయన రాజకీయాల్లోకి ఎలా వచ్చారు?

Amit Shah: దేశాన్ని ఉగ్రవాదంలోకి నెట్టాలనుకుంటున్నారు.. కాంగ్రెస్‌పై అమిత్ షా ఫైర్

Nipah virus: కేరళలో నిఫా వైరస్ విజృంభణ.. స్టూడెంట్ మృతి.. రాష్ట్రంలో ఆంక్షలు!

PM Modi: ఇది ట్రైలర్ మాత్రమే.. ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు నాయుడు భేటీ

yashwant Sinha: వాజ్ పేయి సిద్ధాంతాలతో.. పార్టీ పేరు ప్రకటించిన యశ్వంత్ సిన్హా

Delhi: ఢిల్లీకి తదుపరి సీఎం ఎవరు? రేసులో ఆరుగురు పేర్లు.. వీళ్లేనా?

Big Stories

×